ఏ.పి కాపు వెల్ఫేర్,డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ చలమలశెట్టి రామానుజయ తో ముఖాముఖి

- February 14, 2017 , by Maagulf
ఏ.పి కాపు వెల్ఫేర్,డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ చలమలశెట్టి రామానుజయ తో ముఖాముఖి

ఏ.పి కాపు వెల్ఫేర్,డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ చలమలశెట్టి రామానుజయ గారు యు.ఏ.ఈ విచ్చేసిన సంధర్బముగా మాగల్ఫ్.కామ్ వారితో ముఖాముఖి.


ప్ర) ఆంధ్రప్రదేశ్‌లో కాపు రిజర్వేషన్ల ఉద్యమం గురించి చెప్పండి? 

జ) ఈ రాష్ట్రంలో 1956 వ సంవత్సరం నుండి కూడా కాపులకి రిజర్వేషన్ కావాలని చెప్పి ఉద్యమాలు చేపట్టటం మొదలు పెట్టారు. అంతకముందు కాపులు ఈ రాష్ట్రంలో బీసీ లుగా ఉండేవాళ్లు. బీసీ లుగా ఉండేటటువంటి కాపులు ఆరోజున నీలం సంజీవరెడ్డి మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కాపులు బీసీ లో ఉంటె వీళ్ళకి అన్నిరకాల బెనిఫిట్స్ వస్తాయన్న ఉద్దేశంతోటి వీళ్ళని అన్ని రంగాలుగా ముందుకెళ్లనివ్వకూడదు, వీళ్లది పెద్ద జాతి అనే ఉద్దేశంతోటి బీసీ లో ఉన్నటువంటి కాపుల్ని ఓసీ లో పెట్టటం జరిగింది. ఆ తరవాత మరి దళితుడైన సరే దామోదరం సంజీవయ్య నిజంగా వీళ్ళు నిజంగా ఓసి లో ఉండటానికి అర్హులు కారు, ఆర్ధికంగా కానీ, సామాజికంగా కానీ, విద్యా పరంగా కానీ చాలా వెనకపడిపోయి ఉన్నారు వీళ్ళని బీసీ లో ఉంచటమే న్యాయం అన్న ఉద్దేశంతోటి ఆ రోజు ఉన్నటువంటి కాపు, బలిజ, వంటరి, తెలగ, తూర్పు కాపు ఒక్క స్తితిగతులన్నీ కూడా చూసి ఆరోజున మల్లి తిరిగి ఓసీలోకి తీసుకువచ్చినటువంటి కాపులని బీసీ లో పెట్టటం జరిగింది. ఆతరువాత ముఖ్యమంత్రి గా వచినటువంటి కాసు బ్రహ్మానంద రెడ్డి. కాసు బ్రహ్మానంద రెడ్డి మల్లి ఆరోజు కుట్రతో అత్యధిక జనాభా ఉన్నటువంటి వీరికి ఏ రకమైన సదుపాయాలు దొరికిన సరే వీళ్ళు అన్ని రకాలుగా ముందుకి వెళ్తారనే కుట్ర తోనే ఆరోజున తిరిగి మళ్ళీ కాపుల్ని ఓసీ లో పెట్టటం జరిగింది. అప్పటినుండి కూడా ఈ కాపు రిజర్వేషన్ మీద ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయ్. ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి అనేకమంది కాపు, బలిజ, వంటరి, తెలగ మరి ఈ సంఘాల్లో పనిచేసేటటువంటి అనేకమంది నాయకులు కాపు పెద్దలు, బలిజ పెద్దలు అందరుకూడా కాపులకి రిజర్వేషన్ కావాలని ఎప్పుడుకూడా జరుపుతూనే ఉన్నారు. కాని 2004 ఎన్నికల ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాపుల్ని ఎట్టిపరిస్థితుల్లో కూడా బీసీ లో పెడతాను మరి మీరందరు కూడా నాకు సప్పోర్ట్ చేయండి అనిచెప్పి ఆరోజున కాపుసంఘాల నాయకులని కాపుల్ని, కాపు పెద్దలందరిని కోరితే ఆ ఎన్నికలలో మరి అందరు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి కాపుల్ని బీసీ లో పెడతారనే ఆలోచనతోటి ఎన్నికల్లో ఎక్కువ మెజారిటీ ఇవ్వటం జరిగింది. కానీ పేరుకి అన్నారుగాని ఆయన 2004 నుండి 2014 వరకు ఎటువంటి కాపుల్ని బీసీ లో పెట్టటానికి  కావలసినటువంటి ఏ కార్యక్రమం కూడా తీసుకోలేదు దానివల్ల మళ్ళీ 2014 ఎన్నికల ముంది కాపు సంఘాలు అన్ని కూడా చంద్రబాబు గారిని కోరటం వల్ల మళ్ళీ ఆరోజున చంద్రబాబు గారు ప్రామిస్ చేయటం మూలంగా 2014 ఎన్నికల మానిఫెస్టోలో చంద్రబాబు గారు కాపుల్ని బీసీ లో పెడతాను అని హామీ ఇచ్చారు హామీని నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నారు. దానిలో భాగంగా మరి రాజకీయానికి ప్రాధాన్యత ఇచ్చారు సుమారు 5 శాఖల మంత్రులు చిన్న రాజప్పగారు కానివ్వండి అదేవిధంగా ఘంటా శ్రీనివాస్ గారు కానివ్వండి అదేవిధంగా మరి మాణిక్యాల రావు గారు కానివ్వండి నారాయణ గారు కానివ్వండి, మృణాలిని గారు కానివ్వండి ఇంతమంది కాపులకి ఎప్పుడుకూడా రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నపుడు కూడా ఇంత పెద్ద ఎత్తున మంత్రులు లేరు ఇంత ప్రాధాన్యత కలిగినటువంటి రాజకీయ మరి ప్రాధ్యాత ఉన్నటువంటి పదువులు కూడా లేవు. మరి అదే విధంగా అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి కూడా చదలవాడ కృష్ణమూర్తి గారిని నియమించారు. ఈ విధంగా రాజకీయాల్లో కీలకమైనటువంటి పదవి రాష్ట్ర పార్టీ పదవి. ఆ పదవిని కూడా కిమిడి కళా వెంకట్రావు గారికి ఇవ్వటం జరిగింది. ఈ రకంగా కాపులకి అధిక ప్రాధాన్యత ఇస్తూ చంద్రబాబు గారు కాపు కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయటం జరిగింది. ఈరకంగా ఇన్ని సంవత్సరాల కృషి ఫలితంగా ఈరోజున చంద్రబాబు నాయుడు వచ్చినాకనే ఈ ఒక రిజర్వేషన్ పోరాటానికి ఒక మలుపు మొదలైంది. దానిలో భాగంగానే కాపుల్ని బీసీ లో పెట్టటంకోసం మంజునాథ్ కమిషన్ చేయటం జరిగింది. మంజునాథ్ కమిషన్ కూడా ఇప్పటికి సుమారుగా పది జిల్లాల వరకు కూడా తిరగటం జరిగింది మరి పల్స్ సర్వే కూడా కాపులకి రిజర్వేషన్ ఇవ్వాలని పూర్తిచేయటం జరిగింది. ఈ రకంగా కాపుల రిజర్వేషన్ కు శ్రీకారం చుట్టిన నాయకుడెవరన్నా ఉంటె అది చంద్రబాబు నాయుడు గారు అవుతారని ఈ సందర్భంగా తెలియ చేస్తున్నాను.

ప్ర) ఎన్నికల్లో కాపు సామాజిక వర్గానికి ఇచ్చిన హామీని చంద్రబాబు ప్రభుత్వం ఎంతవరకు నెరవేరుస్తుందని మీరు నమ్ముతున్నారు? 

జ) ఎన్నికల్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు 2014 ఎన్నికల ముందు కాపులకి కాపు సంఘాలు అందరికి కూడా బీసీ లో పెట్టాలని కోరారు ఆ ప్రామిస్ చేసారు. దాని ఫలితంగానే ఈరోజున మంజునాథ్ కమిషన్ ఏర్పాటు చేయటం జరిగింది. మంజునాథ్ కమిషన్ సుమారు 10 జిల్లాలు తిరగటం జరిగింది. 10 జిల్లాలలో కూడా పల్స్ సర్వే కూడా చాలా వరకు పూర్తి అయ్యింది. తప్పనిసరిగా మరికొద్దిరోజుల్లో మార్చ్, ఏప్రిల్ ఆ ప్రాంతాల్లో మంజునాథ్ కమిషన్ రిపోర్ట్ కూడా మరి ప్రభుత్వానికి అందచేయటం జరుగుతుంది. ప్రభుత్వం కూడా చిత్తశుద్ధి తో చంద్రబాబు నాయుడు గారు ఇప్పటివరకు ఏ నాయకుడు మరి రిజర్వేషన్ పట్ల స్పందించిన నాయకుడు లేరు. ఎన్నికల్లో వాగ్దానాలు చేశారు తప్ప ఏ మాత్రం కూడా పట్టించుకున్న నాయకుడు లేరు. కానీ చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చిన దానికి అనుగుణంగా మరి ఈరోజున కాపు మంజునాథ్ కమిషన్ ద్వారా కాపులని రేజర్వేషన్లో పెట్టటం కోసం ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. ఈ రిపోర్ట్ వచ్చిన అనంతరం కేబినెట్లో పెట్టి, అసెంబ్లీ లో పెట్టి తరువాత కేంద్రానికి ఫార్వర్డ్ చేసి కేంద్రాన్ని కూడా ఒప్పించి తప్పనిసరిగా కాపులకి రిజర్వేషన్ తీసుకు వచ్చేటటువంటి సత్తా దమ్ము ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. తప్పనిసరిగా ఆయన చేసి తీరతారన్న నమ్మకం మాకు ఉంది.

ప్ర) 2019 ఎన్నికల్లోనూ కాపు రిజర్వేషన్ల అంశమే ఎన్నికల ప్రచారాంశంగా టీడీపీ ఉపయోగించుకుంటుందా? 

జ) నిజానికి 2004 ఎన్నికల ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాపులని బీసీలోకి పెడతాం అని చెప్పి ఎన్నికల్లోకి వెళ్లారు. కానీ ఏమి పీపట్టించుకోలేదు. మరి 2009 ఎన్నికల్లో కూడా ఇదే అంశాన్ని ఆయన మళ్ళీ రిపీట్ చేశారు. కానీ ఆయన 2014 వరకు పట్టించుకోలేదు. ఆ రకంగానే ఈరోజున ఆ రెండు సార్లు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ రకంగా వ్యవహరించారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే ప్రక్రియని కొనసాగిస్తారా అనేటువంటి అనుమానాన్ని కొంతమంది మరి ఈరోజున కాపు పెద్దలు కానీ ఈరోజు వక్రీకరించి చెప్పుకునేటువంటి నాయకులుగాని సందేహాలు వెళ్లబుచ్చుతూ ఉన్నారు. ఆరు నూరైనా, నూరు ఆరైనా మొత్తం ప్రక్రియంతా కూడా పూర్తి అయిపోయింది. ఎట్టిపరిస్థితుల్లో కాపుల్ని బీసీలోకి చేర్చటం ఖాయం. ఈ 2019 నాటికి ఇలాంటి మరి కాపుల్ని బీసీలో పెట్టె అంశం మీద వెళ్లేటువంటి అవకాశం కానీ పరిస్థితులు కానీ లేవు. దానికి చాలా ముందుగానే కాపుల్ని బీసీలోకి పెట్టేటువంటి అవకాశాలు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నాయి.

ప్ర) కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా, చంద్రబాబు సర్కార్‌ ఆ సామాజిక వర్గాన్ని ఆదుకునేందుకు ఏమేం చర్యలు తీసుకుంటోందని మీరు గట్టిగా చెప్పగలరు? 

జ) కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి మరి ఈరాష్ట్రంలో ఉండే కాపులు అందరిని కూడా ఆర్ధికంగా పెంచాలి, విద్యా పరంగా పెంచాలి అదేవిధంగా చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించాలి. మహిళలు కూడా ఎదో ఒక రకంగా అభివృద్ధి చెందాలి. అదేవిధంగా కాపులకి అనేక రకాలైన కార్యక్రమాలు చేస్తా వచ్చారు దాంట్లో భాగంగా ఉదాహరణకి స్వయం ఉపాధి పథకం, దాని ద్వారా రెండు లక్షలు రూపాయల వరకు ఋణం ఇస్తా ఉన్నారు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోటానికి దానిని ఉపయోగించుకోమని చెప్పి మరి ఈ కార్యక్రమం పెట్టటం జరిగింది. దాని ద్వారా రెండు లక్షల రూపాయల రుణంలో లక్ష రూపాయలు సబ్సిడీ ఇస్తున్నారు. తరువాత విదేశాల్లో చదువుకునేటువంటి పిల్లలకి 20 లక్షలు రూపాయలు బ్యాంకు నుండి ఇప్పించి 10 లక్షల రూపాయలు ఫ్రీగా ఇచ్చి వాళ విమానపు ఖర్చులు, వీసా ఖర్చులు అన్ని కూడా జిఆర్ఈ, టోఫెల్ ఖర్చులన్నీ కూడా పెట్టుకోవటానికి విదేశ ఉన్నత విద్యా కోసం సుమారు 10 .50  లక్షల నుండి 11 లక్షలు వరకు కూడా కాపు కార్పొరేషన్ బరిస్తుంది. ఆ తరువాత ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలు అందరు కూడా ఆర్ధికంగా ముందుండాలని ఆలోచనతోటి ఈ జనాభాలో సాగ భాగం మహిళలు ఉన్నారు కాబట్టి ముఖ్యంగా కాపు మహిళలు ఇంటికి, వంటింటికే పరిమితం అవుతా ఉన్నారు కాబట్టి వాళ్ళుకూడా వాళ నుండి ఆదాయం తీయాలని ఉద్దేశంతోటి వాళ్ళు కూడా ఆర్ధికంగా ఎదగాలనే ఉద్దేశం తోటి ఈ రాష్ట్రంలో ఉండే సుమారు 25000 మంది మహిళలకి కుట్టు మెషిన్ ట్రైనింగ్, ఎంబ్రాయిడరీ లాంటి ఇంటి దెగ్గరే ఉండి నెలకి 10000 నుంచి 15000 రూపాయలు సంపాదించుకునేటువంటి కార్యక్రమాలు మరి ఆయన సూచనలు చేశారు. దానిలో భాగంగా సుమారు ఈ రాష్ట్రం లో 25000 మంది మహిళలకి 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఆ ట్రైనింగ్ కి ఇచ్చినటువంటి పనిముట్లు అన్ని కూడా వారికి ఫ్రీ గా కాపు కార్పొరేషనే వారికి కొని ఇచ్చి  తరువాత ట్రైనింగ్ పీరియడ్ లో అయ్యేటువంటి ఖర్చు మొత్తం కూడా కాపు కార్పొరేషన్ భరిస్తూ మరి వాలందరిని కూడా స్కిల్ల్డ్ డెవలప్మెంట్ సెంటర్స్ ద్వారా వాలందరిని కూడా అభివృద్ధి చేస్తా ఉండి. తరువాత ఈ రాష్ట్రంలో చదువుకొని ఖాళీగా ఉండేటువంటి పిల్లలు నిరుద్యోగులుగా ఉన్నవారున్నారు, సుమారు 25000 మంది యువతీ యువకులకు ఉద్యోగాలు ఇప్పించాలనే ఒక ఆలోచనతోటి మరి కాపు జాబ్ మేళాలు ఏర్పాటు చేసి ఆ పిల్లలకి కావాల్సినటువంటి ఏదైతే విద్య ఉందొ ఆ విద్యను కూడా ఆ కంపెనీలకి కావాల్సిన స్థాయికి వీరు చేరటానికి కావాల్సినటువంటి విద్యను కూడా కాపు కార్పొరేషన్ స్కిల్ల్డ్ డెవలప్మెంట్ సెంటర్స్ ద్వారా చదివించి ఆ చదువుకి అయ్యేటువంటి ఖర్చునంతా కూడా ఇచ్చి ఆ చదువుకునే సమయంలో కూడా స్టైపెండ్ గా కొంత డబ్బులు ఇచ్చి ఈ రకంగా కాపు కార్పొరేషన్ ముందుకు వెళ్తా ఉంది. ఇంకా కాపులు ఎవరైనా ఇండస్ట్రియలిస్ట్స్ గా అవ్వాలనుకుంటే వాళ్లకి కూడా కాపు కార్పొరేషన్ 10 లక్షలు ఫ్రీ గా ఇచ్చి మరి అదే విధంగా ఆ ఇండస్ట్రీ కి కావలసిన డబ్బు 25 లక్షలు అవ్వని 30 లక్షలు అవ్వని ఆ డబ్బు కూడా కాపు కార్పొరేషన్ ముగ్గురు లేక నలుగురు లేక ఐదుగురు ఎంఎస్ఎంఈ ప్రోగ్రాం ద్వారా వీరందరికి కూడా ఆర్ధికంగా సహాయం చేయాలనిచెప్పి చంద్రబాబు గారు ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకురావటం జరిగింది. అదే విధంగా ఉన్నత విద్య ద్వారా అంటే ఐఏఎస్, ఐపీఎస్, ఐఈఎస్, ఐఆర్ఎస్ అదేవిధంగా గ్రూప్ 1 ,2 ,3 ,4  లాంటి పోటీ పరీక్షలకు వెళ్లేటువంటి విద్యార్ధులకి సంస్థలకి అయ్యే ఖర్చు మోతంకూడా 2 లక్షలు అవ్వని 50 వేలు అవ్వనీయండి ఆ డబ్బు మొత్తం  కాపు కార్పొరేషన్ భరించి వాళ్లకి స్టైఫెండ్ గా కూడా 5000 నుండి 10000 దాకా విద్యను పట్టి స్టైఫెండ్ ఇవ్వటం జరుగుతోంది. అదేవిధంగా కాపు భవన్స్ ఏర్పాటు చేసి కాపు భవన్స్  ప్రీతి జిల్లాకి 2 ఎకరాల ల్యాండ్ లో సుమారు 5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం చేస్తోంది. ముందు రోజుల్లో కాపులందరు కూడా తన సొంత ఇంటి లాగా కాపు, బలిజ, వంటరి, తెలగ కులాలకు చెందినటువంటి అందరు కూడా వాటిని వాడుకునేటట్టు అవకాశం, వారి పిల్లలను అక్కడ పెట్టి చదివించునే అవకాశం. ఆరకంగా వాటి అన్నిటికి కూడా ఉపయోగించుకోటానికి కాపు కార్పొరేషన్ ద్వారా చేయమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు. అదేవిధంగా చదువుకునేటటువంటి పిల్లలు ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంజనీరింగ్ పైన ఏది చదువుకుంటే ఆ చదువుకునే పిల్లవాడికి వైట్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇంటర్మీడియట్ కి 6000 రూపాయలు , అదేవిధంగా ఇంజనీరింగ్ పై డిగ్రీ అయితే 10000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మాకు ప్రతి సంవత్సరం ఇచ్చేటువంటి 1000 కోట్ల బడ్జెట్ కి తోడు ఇంకొక 1000 కోట్లు బ్యాంకు నుండి తీసుకొని మొత్తం 2000 కోట్ల రూపాయలు కాపు కార్పొరేషన్ ద్వారా ఈ రాష్టంలో ఉండే కాపు, బలిజ, ఒంటరి, తెలగ వాళ్లందరికీ కూడా సహాయ సహకారాలను అందిస్తూ ముందుకి వెళ్తామని ఇప్పటికే ఈ రాష్ట్రం 416000 మంది కాపులకి సహాయం చేసిన సందర్భం ఇప్పటికే జరిగింది. ఇంత పెద్ద ఎత్తున ఈ దేశం లో ఉన్నటువంటి చాలా చోట్ల అటు తెలంగాణ లో కాపులున్నారు, ఇటు ఒరిస్సా లో కాపులున్నారు ఇటు కర్ణాటక లో కాపులున్నారు అదే విధంగా తమిళనాడు లో కూడా కాపులున్నారు ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఈ రోజున మరి అంధ్రప్రదేశ్ లో కాపులకి అత్యధిక పీఠం వేసిన నాయకుడు ఎవరన్నా ఉన్నట్టుంటే అది చంద్రబాబు నాయుడు గారే అని చెప్తున్నాను.

ప్ర) కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పిస్తే, ఇతర సామాజిక వర్గాలకు రిజర్వేషన్ల పరంగా సమస్యలు వచ్చే అవకాశం ఉందా? 

జ) అంటే ఇంతకూ ముందు అనుకున్నాం కాపులకి రిజర్వేషన్ వస్తే ఇంతకు ముందు ఉన్నటువంటి రిజర్వేషన్లకి ఏదన్న ఇబ్బంది కలుగుతుందా అదేమన్నా తగ్గిపోతుందా అనేటువంటి మరి అనుమానాలు కొంతమంది బీసీ వర్గాల్లో ఉన్నటువంటి సందేహం వాస్తవం. కానీ ఈ రాష్ట్రం లో ఉన్నటువంటి ఇటు అనంతపురం నుండి శ్రీకాకుళం వరకు ఉన్నటువంటి కాపులు ఎవ్వరుకూడా బీసీలకు ఉన్నటువంటి రిజర్వేషన్లో 1 శాతం కూడా అడగటలేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్లకు వచ్చేటువంటి రిజర్వేషన్లలో ఏమాత్రం కూడా తగ్గిచాలనే ఆలోచన చంద్రబాబు గారికి లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అదనంగా కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఉన్నట్టుగా అదనపు రిజర్వేషన్ ఇప్పించాలనే ప్రయత్నం మాత్రం చేస్తా ఉన్నారు, అందుకోసం ఎట్టి పరిస్థితుల్లో బీసీ వర్గాలకి ఏమంత్రం కూడా ఇంకొకలకి నష్టం జరగదు కాబట్టి అదే దృష్టితో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అదీకాకుండా తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా బీసీ పక్షపాతంగా ఉన్నటువంటి పార్టీ. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారికి బీసీలు కాపులు కూడా రెండు రెండు కళ్ళు మరి అందుకోసం ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు గారు బీసీ లకు వచ్చేటటువంటి నష్టం ఏ మాత్రంకూడా లేకుండా వాళ్లకి వచ్చే ఏదైతే రిజర్వేషన్స్ ఉన్నాయో ఆ రెసెరేషన్ ని తూ ఛా తప్పకుండా అమలుచేస్తూ ఇంకా అదనంగా కావాల్సి వస్తే  సరే అడ్గనంగా ఇచ్చిన సరే కాపులకి అదనంగా రిజర్వేషన్ కోసం ప్ప్రయత్నిస్తున్నారు.తప్పనిసరిగా ఆరకంగా జరిగేటటువంటి అవకాశం ఉంది. బీసీలకు ఎమాత్రంకూడా ఇతర కులాలకు ఏమాత్రం కూడా నష్టం రాదు.

ప్ర) కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా, రిజర్వేషన్లపై మీరు కాపు సామాజిక వర్గానికి ఇచ్చే సందేశం ఏమిటి?

జ) ఈ రాష్ట్రంలో ఉండే కాపు, తెలగ, వంటరి, బలిజ కులాలకు చెందినటువంటి నా సోదరులందరికి కూడా ఈ సందర్భంగా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు మన సంఘాలుగాని మన కుల పెద్దలుగాని అడిగినట్టుగా కాపు రిజర్వేషన్ కి మనం కమిషన్ కావాలని అడిగాము అందుకే కమిషన్ కోసం కమిషన్ ద్వారా మాత్రమే చట్టభద్రత వస్తుంది, జీవో ద్వారా అయితే మనకి చట్టభద్రత రాదు, రేపు ప్రొద్దున  కోర్ట్ లోకి వెళ్తే విరిగిపో తుంది అని మన సంఘాల నాయకులు, పెద్దలు అందరూకూడా కోరిన మీదట చంద్రబాబు నాయుడు గారు జీవో ద్వారా కంటే మరి కమిషన్ ద్వారానే అడుగుతున్నారు.అది కూడా ముందురోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా కాపులకి మరి ఒకసారి రిజర్వేషన్ ఇచ్చిన తరువాత ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా చిత్తశుద్ధి తో పనిచేయాలి వాళ్లు ఏ కోర్ట్ కి వెళ్లినా సరే వీగిపోకూడదు అన్న ఉద్దేశం తోటి మరి ఆరకంగా ఈరోజు మంజునాథ్ కమిషన్ వేసి కమిషన్ రిపోర్ట్ ద్వారానే దానికి చట్టభద్రత తీసుకు రావాలి అనే ఉద్దేశం తోటి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేయటం జరుగుతోంది. ఈరోజున జీవో ద్వారా అయితే ఆయన అనేక పరియాయలు మీకు జీవో అయితే ఎంత రెండు నిమిషాల్లో నేను జీవో ఇస్తాను అనిచెప్పి చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కానీ జీవో ద్వారా వద్దు ఎందుకని అంటే ఒకసారి ముస్లింలకి రిజర్వేషన్ ఇచ్చినప్పుడు జీవో ద్వారా ఒకసారి వైస్ రాజశేఖర రెడ్డి గారు ఇస్తే అది కోర్టులోకి వెళ్తే అది వీగిపోయింది. అందుకోసం అట్లా వీగిపోతే ఇప్పుడు ఈరోజున మరి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చిత్రీకరించేటటువంటి ప్రతిపక్ష నాయకులంతా కూడా మళ్లీ తిరిగి మళ్లీ బ్లేమ్ చేసేటటువంటి అవకాశాలు ముందురోజుల్లో ఉండకూడదు అని చెప్పి ఎట్లా అయినా సరే నూరు ఆరైనా ఆరు నూరైనా చట్టబధ్రత తీసుకురావాలని చిత్తశుద్ధితో చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తా ఉన్నారు. కాబట్టి జరిగిన పరిణామాలు అన్ని చూస్తే మనకి కూడా అర్ధమవుతాయి ఎందుకంటే బీసీ కమిషన్ రిపోర్ట్ కూడా 10 జిల్లాల్లో తిరిగింది తరువాత మళ్లీ ఈరోజున పల్స్ సర్వే కూడా పూర్తి అయ్యింది ఎట్టి పారిస్తుతుల్లో నూరు ఆరైనా ఆరు నూరైనా మనం బీసీలోకి వెళతాం దాంట్లో మనం ఎట్టిపరిస్థితుల్లో అనుమానాలు మనకి ఎవ్వరికి కూడా వద్దు. కేవలం మన ఒక్క జాతిని అవమాన పాలు చేయాలన్న ఉద్దేశంతోటి కొంతమంది ఈరకమైనటువంటి ప్రచారాలు చేస్తావున్నారు వాళ్ళ వలలో ఎట్టిపరిస్థితుల్లో పడకండి. వాళ్ళు గ్లోబల్ ప్రచారాలు చేసేటటువంటి ప్రచారాలని ఎవరు కూడా నమ్మకండి. నమ్మకుండా మరి ఈరోజు చిత్తశుద్ధితో పనిచేస్తున్నటువంటి చంద్ర బాబు నాయుడు గారికి సపోర్ట్ గా ఉంటె తప్పనిసరిగా రిజర్వేషన్ రావటం ఖాయం, మరి అదేవిధంగా కాపు కార్పొరేషన్ ద్వారా ఈ రాష్ట్రంలో ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి అర్హులున్నారో వారందరికీ ఋణాలు ఇవ్వటం కూడా ఖాయం. మరి అదేవిధంగా ఇప్పటికే విదేశీ విద్య చూస్తఉన్నాం, ఎంఎస్ఎంఈ ప్రోగ్రాం ద్వారా ఇండస్ట్రియలిస్టులుగా డెవలప్ అవ్వటం చూస్తా ఉన్నాం ఇంత పెద్ద ఎత్తున బెనిఫిట్స్ ఇస్తున్నటువంటి నాయకుడు ఎవరైనా ఉంటె అది చంద్రబాబు నాయుడు గారే కాబట్టి జరిగిన పరిణామాలు అన్నిటినికూడా గ్రహించి మరి మనం ఒక నమ్మకం తో వెళ్ళాలి తప్ప ఎట్టిపరిస్తితుల్లోకూడా ఏ రకమైనటువంటి ఆలోచనలు లేకపోతె అనుమానాలు, అదే విధంగా మరి ఎవరో చిత్రీకరిస్తే దాంట్లో వెళ్లడం వంటి ఆలోచనలు చేయటం వద్దు అని చెప్పి ఈ సందర్భంగా  మీకు తెలియచేయాలనుకుంటున్నా.

ప్ర) కాపు ఉద్యమంలో ముద్రగడ పద్మనాభం ఎంతవరకు విజయం సాధించారు? 

జ) అసలు నిజానికి ముద్రగడ్డ పద్మనాభం గారు ఉద్యమం చేయాల్సినంత ఆవశ్యకత లేదు. ఎందుకంటే 2014 ఎన్నికల మేనిఫెస్టోలో చంద్ర బాబు నాయుడు గారు ఏరకంగా అయితే రిజర్వేషన్ ఇస్తానని ప్రామిస్ చేశారో అదే ప్రామిస్ ని 2004 ఎన్నికల్లో కూడా వైస్ రాజశేఖర రెడ్డి గారు ఆ ప్రామిస్ చేశారు. కానీ 2004 నుంచి 2014 వరకు ఏరకంగా కూడా రిజర్వేషన్ గురించి మాట్లాడనటువంటి ముద్రగడ్డ పద్మనాభం గారు ఈరోజున కేవలం జగన్ మోహన రెడ్డి ఒక్క డైరెక్షన్ లో ఆక్షన్ చేస్తా ఉన్నారు. ఆరోజున మరి వైస్ రాజశేఖర రెడ్డి గారిని ఇదే బీసీ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ని సర్వేచేయటం కోసం 40 లక్షలు రూపాయలు సర్వే కోసం ఖర్చవుతుంది ఇవ్వమని చెప్పి అడిగితె ఆరోజు వైస్ రాజశేఖర రెడ్డి గారు 40 పైసలు కూడా ఇచ్చిన సందర్భంలేదు ఆవిషయాలన్ని కూడా మరి ముద్రగడ్డ పద్మనాభం గారికి తెలుసు. కానీ ఈరోజున కేవలం ఈ రాష్ట్రం బ్రాహ్మణంగా అభివృద్ధి చెందుట ఉంది, చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు అన్ని కూడా తూచా తప్పకుండ నిరవేరుస్తున్నారు మరి కాపుల ఓట్లతోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాడు. కాపులందరు కూడా ఈరోజున కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఈ రాష్ట్రం లో ఉన్నటువంటి 416000 మంది కాపులకి మరి బెనిఫిట్స్ ఇచ్చేటట్టుగా మరి చంద్రబాబు నాయుడు గారు కాపు కార్పొరేషన్ పెట్టి ఆ కార్యక్రమం చేశారు. మరి రాజకీయ ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు కాపులకి. అదేవిధంగా బీసీ కమిషన్ అయినటువంటి మంజునాథ్ కమిషన్ పెట్టి మరి కొద్దిరోజుల్లో కాపులని బీసీల్లో చేర్చబోతున్నారు. ఇవన్నీ జారుతున్నటువంటి పనులన్నిటినీ కూడా చూసి ఓర్వలేక జగన్ మోహన రెడ్డి కాపులకి ఏదోరకంగా డిస్టర్బన్స్ తీసుకురావాలి అందుకే ఆ రకంగా ఉన్నటువంటి నాయకుడిని లోకాలని ఎంపిక చేసుకోవాలి అని ఉద్దేశంతోటి అన్ని రకాల సప్పోర్ట్స్ కూడా ముద్రగడ్డ పద్మనాభం గారికి ఇచ్చి మరి ఈ రకంగా ఈరోజున కాపుల ముసుగులో జగన్ మోహన రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టాలని ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆ ప్రయత్నంలో భాగమే ముద్రగడ్డ పద్మనాభం ఒక్క ఆక్షన్ తప్ప ఈరోజున ఈ రాష్ట్రంలో ముద్రగడ్డ పద్మనాభం గారు ఏరకంగా కూడా మరి యాజిటేషన్ చేయాల్సినంత ఆవశ్యకత గాని లేదు మరి ఇది కేవలం కూడా ఈ రాష్ట్రాన్ని ఇబ్బందులు పెట్టాలనుకున్నటువంటి జగన్ మోహన రెడ్డి దాంట్లో పావుగా ముద్రగడ్డ పద్మనాభం గారు పనిచేస్తా ఉన్నారు.

ప్ర) ఎన్నికల హామీని చంద్రబాబు సర్కార్‌ విస్మరించిందనే విమర్శలకు మీరు ఏం సమాధానం చెబుతారు? 

జ) ఎన్నికల హామీలు తూచా తప్పుకోకుండా నెరవేర్చే నాయకుడు చంద్రబాబు నాయుడు గారేనని ఇప్పటికి క్లియర్ గా అర్ధమవుతోంది. మరి పచ్చకళ్ల రోగికి లోకమంతా పచ్చగా ఉన్నట్టు వాళ్ళు ఇంతక ముందు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలందరు కూడా ముఖ్యంగా వైస్ రాజశేఖర రెడ్డి గారి దెగ్గర నుండి అందరూకూడా కేవలం వాళ్లు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చట్లేదు. కాబట్టి మరి ఇక్కడ గ్లోబల్ ప్రచారాలు చేస్తున్నారు దాంట్లో ఎలాంటి వాస్తవాలు లేవు. ఎందుకంటే ఎన్నికల హామీలన్నీ కూడా ఇప్పటివరకు నూటికి 80 నుంచి 90 శాతం వరకు నెరవేర్చినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఉదాహరణకి కాపుల గురించే మాట్లాడుకుంటే ఎన్నికలలో హామీల్లో కాపుల్ని రేజర్వేషన్లో పట్టండి అది కమిషన్ ద్వారానే పెట్టండి అని చెప్పి కాపుల సంఘాలు గాని కాపు నాయకులు గాని అడగటం జరిగింది. కానీ దానికి ఇంకా కాపులవల్లే అధికారంలోకి వచ్చాననే అభిమానంతోటి కాపులమీద ఉన్నటువంటి ప్రేమతోటి చంద్రబాబు నాయుడు గారు అదనంగా ఈ కాపు కార్పొరేషన్ పెట్టమని ఏ సంఘాలు అడగలేదు మరి రాష్ట్రంలో కాపులేవ్వరు కూడా అడగలేదు కానీ ఆయన కాపు కార్పొరేషన్ అదనంగాను అదేవిధంగా కాపులకి పొలిటికల్ ప్రాధాన్యత కూడా అధికంగా ఇచ్చినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఈ రాష్ట్రం కొత్తగా ఏర్పడినప్పటికీ కూడా 16500 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ తో ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు కాపులకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతోటి ఇన్ని రాకాల ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మరి కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయటం గాని అదేవిధంగా మంజునాథ్ కమిషన్ ఏర్పాటు చేయటం గాని వీటికి కావాల్సినటువంటి నిధులన్నీకూడా సమకూర్చటం కానీ మరి ఈ రకంగా చేసి ముందుకి వెళ్తా ఉన్నారు. అదేవిధంగా రైతు ఋణాలు కానివ్వండి, 200 రూపాయల పెన్షన్ 1000 చేయటం కానివ్వండి, వికలాంగులకు 500 పెన్షన్ 1500 కానివ్వండి, ఈరోజున నదులు అనుసంధానం చేసి గోదావరి నదిని తీసుకు వచ్చి కృష్ణా నది లో కలపటం కానివ్వండి ఈ రకంగా అనేకరకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకి వెళ్తున్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో మరి నిజానికి మరి ఆయన ఒక చిన్న బస్సులో ఉండి పరిపాలన సాగించారు. మరి ఇప్పటివరకు ఒక రాజధాని లేదు, రాజధాని లో ఉండి పాలన చేయటానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి అన్న ఉద్దేశంతోటి మరి అప్పటికప్పుడు 3 నెలల్లో సెక్రటేరియట్ నిర్మించి హైదరాబాద్ నుండి మరి మొత్తం సెక్రటేరియట్ అందరినికూడా మరి హైదరాబాద్ లో 10 సంవత్సరాల మనం సెక్రటేరియేట్ ఉంచుకునేటటువంటి అధికారం మనకి ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉండి పాలన చేయటం కష్టంగా ఉండి అన్న ఉద్దేశం తోటి ఎక్కడైతే మన ఆంధ్ర ప్రాంతం ఉందొ అక్కడే రాజధాని ఉండాలన్న ఉద్దేశం తోటి మరి తీసుకొచ్చి అనేకరకాలుగా సదుపాయాలు చేస్తూ ఈ ప్రపంచంలోనే ఉన్నతమైన రాజధానిగా తయారు చేయాలని చంద్రబాబు నాయుడు గారు ముందుకి వెళ్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కాపులదే కాదు మిగతా కార్యక్రమాలు అన్నిటి లో కూడా తప్పనిసరిగా ఎన్నికల హామీలు నెరవేర్చేటటు  వంటి నాయకుడు ఎవరన్నా అంటే అది చంద్రబాబు నాయుడు గారే అని ఈసందర్భం గా తెలియచేసుకుంటున్నాను.

ప్ర) చంద్రబాబు ప్రభుత్వం పట్ల కాపు సామాజిక వర్గం వ్యతిరేకతతో ఉందా? సానుకూలంగా ఉందా? 

జ) మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో నూటికి 99 మంది కాపులు కూడా చంద్రబాబు నాయుడు గారితో ఉన్నారు అందుకే అధిక ప్రాధాన్యత ఇస్తూ ఈరోజున కాపు కార్పొరేషన్ ద్వారా ఎన్నో లక్షల మందికి బెనిఫిట్ వచ్చింది. అదేవిధంగా మరి ఆర్ధికంగా సపోర్ట్ చేస్తా ఉన్నారు, విద్యా పరంగా సపోర్ట్ చేస్తున్నారు, ఎవరైనా కాళీగా ఉంటె ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు, అదే విధంగా మహిళలకి కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున జరుగుతా ఉంటె ఈ రాష్ట్రంలో కాపులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక భగవంతుడు అనేటువంటి ఆలోచనలో ఉన్నారు, రామరాజ్యం అంటే ఎక్కడో లేదు ఈరోజున చంద్రబాబు గా రే ఆ రాముడు అని ప్రత్యక్షంగా భావిస్తున్నారు. అందుకోసం ఈ రాష్ట్రంలో కాపులందరికి కూడా ఎట్టిపరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు చేసిన మేలును మరిచిపోరు. అందుకే ఈరోజున చంద్రబాబు నాయుడు గారిమీద అమితమైన ప్రేమతో ముందుకు వెళ్తున్నారు. కేవలం ఇప్పుడు జరిగేటువంటి ప్రచారం అంతాకూడా కేవలం కాపులకి డిస్టర్బన్స్ తీసుకురావాలని కొద్ది మంది స్వార్ధపరులు చేసేటటువంటి ప్రయత్నం తప్ప మరి అది జగన్ క్రియేషన్ తప్ప వాస్తవానికైతే కాపులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారితో ఆయన వెంట ఆయన అడుగు జాడల్లో ఈ రాష్ట్ర అభివృద్ధిలో చంద్రబాబు నాయుడు గారితో పాలుపంచుకోవాలి. ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు తో మరి అభివృద్ధికోసం తోడ్పడినటువంటి కులంగా బలిజ కాపులు ఉండాలన్న ఒక ఆలోచనతోటి మరి ఈ రాష్ట్రంలో కాపులందరూ కూడా ఉన్నారు.

ప్ర) అసలు కాపు సామాజిక వర్గానికి చంద్రబాబు ప్రబుత్వం చెబుతున్నట్లుగా రిజర్వేషన్లు సాధ్యమేనా? 

జ) సహజంగా ఇప్పుడు కొన్ని ప్రతిపక్ష పార్టీలు గాని, చంద్రబాబుకు వ్యతిరేక గ్రూపులు గాని ఈరోజున దీనిమీద పెద్ద ప్రచారం చేస్తా ఉన్నాయి. నిజానికి ఒకసారి ఇప్పుడు జరుగుతున్నటువంటి సమాజంలో రేజర్వేషన్లు 49.5% వరకు కూడా మరి రిజర్వేషన్ వ్యవస్థ ఉంది 50%  కంటే ఎక్కువ మరి రిజర్వేషన్ ఇచ్చే అవకాశం లేదు కాబట్టి దాన్ని సాకుగా చూపించి అందరుకూడా ఇదంతాకూడా చంద్రబాబు మాయ చేస్తున్నారు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. దాంట్లో ఉదాహరణకి తీసుకుంటే ఇటు కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా దీనిమీద కమిషన్ ద్వారా మాత్రమే ఒకసారి సుప్రీమ్ కోర్ట్ జడ్జిమెంట్ కూడా  ఒకసారి చూస్తే కమిషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసి ఆరకంగా చేసేటటువంటి అవకాశం ఉన్నది. ఉదాహరణకి తమిళనాడు లో గాని, కేరళ లో గాని, కర్ణాటక లోగాని అదనంగా రిజర్వేషన్ ఏరకంగా అయితే ఇప్పుడు  ఉన్నదో అదే విధంగా ఉన్నటువంటి రేజర్వేషన్లో మరి ఏరకంగా కూడా రిజర్వేషన్ ఇచ్చినటువంటి వాళ్లు ఎమాత్రంకూడా వాటా అడగకోకుండా ఉన్నా అదనంగా రిజర్వేషన్ కర్ణాటక, తమిళనాడు, కేరళ తరహాలో రిజర్వేషన్లు ఇప్పించాలన్న ఆలోచనలో చంద్రబాబు గారు వెళ్తున్నారు. అది తప్పనిసరిగా సాధ్యం అవుతుంది.


ఈ అవకాశం కల్పించిన మాగల్ఫ్ అధినేత శ్రీకాంత్ చిత్తర్వు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com