జీతం తీసుకోవడంలో ఏడు రోజుల జాప్యం జరిగితే వేరే ఉద్యోగం వెతుక్కోవచ్చు

- February 18, 2017 , by Maagulf
జీతం తీసుకోవడంలో ఏడు రోజుల జాప్యం జరిగితే  వేరే ఉద్యోగం వెతుక్కోవచ్చు

కతర్ :  వేతనాలు ఇవ్వడంలో యజమాని విఫలమై  ఏడు రోజుల జాప్యం కనుక  జరిగితే ఆ ఉద్యోగి  వేరే ఉద్యోగం వెతుక్కోవచ్చు  అడ్మినిస్ట్రేటివ్ డెవలప్మెంట్, కార్మిక మరియు సామాజిక వ్యవహారాల మంత్రిత్వశాఖ ఒక నూతన పాలక విధానం విధించనుంది. దీని ప్ర్రకారం ఉద్యోగులు వారి యజమానుల నుండి అభ్యంతరం లేదని ఒక సర్టిఫికెట్ (ఎన్ ఓ సి)  పొందకుండానే వేరే ఉద్యోగాలు మారడానికి హక్కు ఏర్పడనుంది. అడ్మినిస్ట్రేటివ్ డెవలప్మెంట్, కార్మిక మరియు సామాజిక వ్యవహారాల మంత్రిత్వశాఖ నుండి ఒక అధికారి తెలిపిన వివరాల ప్రకారం ప్రకారం, ఈ విషయమై ఒక నిర్ణయం మంత్రివర్గ స్థాయిలో తీసుకోవడం జరిగనుందని వెనువెంటనే అది త్వరలో అమలు చేయబడుతుందని తెలిపారు .దేశంలో అన్ని సంస్థలు తమ తమ ఉద్యోగులకు నెలవారీ జీతాలు తప్పనిసరిగా ఇవ్వాల్సిన తేదీ లోపున చెల్లించాలి లేని ప్రభుత్వం సూచిస్తుందని లేని  పక్షంలో డ్యూ తేదీ నుండి ఏడు రోజుల సమయం లోపల ఆయా వేతనాలని చెల్లించాలని తెలిపారు. సంస్థ యాజమాన్యాలు అలా అవ్వకపోతే, అటువంటి కంపెనీల నుంచి ఉద్యోగులు  ఉద్యోగ మార్పు కోరుకోవచ్చని తెలిపింది.వారు ఒప్పందం కాలం  పూర్తి చేయక్కరలేదని  వేరే ఉద్యోగం మారే వారికి హక్కు ఉంటుంది. కతర్ లో  కొన్ని కంపెనీలు ప్రభుత్వం ఆ కంపెనీలు అటువంటివి  గుర్తించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు అందుకే  వేతన రక్షణ వ్యవస్థ పరిధిలోనికి ఆయా సంస్థలను తీసుకువచ్చినట్లు అయన పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com