అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో షాకిచ్చారు హెచ్1బీ వీసాల రద్దు

- March 04, 2017 , by Maagulf
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో షాకిచ్చారు హెచ్1బీ వీసాల రద్దు

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో షాకిచ్చారు. హెచ్1బీ వీసాల ప్రీమియం ప్రాసెసింగ్‌ను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్‌సీఐఎస్) స్పష్టం చేసింది. ఏప్రిల్ 3 నుంచి హెచ్1బీ వీసాల ప్రీమియం ప్రాసెసింగ్ రద్దు అమల్లోకి రానుంది. హెచ్1బీ వీసాల ప్రీమియం ప్రాసెసింగ్ రద్దు ఆరు నెలల వరకు తాత్కాలిక రద్దు ఉండవచ్చని యూఎస్‌సీఐఎస్ స్పష్టం చేసింది. ముందుగా రెగ్యులర్ వీసాలను మాత్రమే ప్రాసెస్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది యూఎస్‌సీఐఎస్.
కొద్ది రోజుల పాటు ఆయా కంపెనీల తరపున ఉద్యోగం చేసేందుకు హెచ్1బీ వీసాలపై అమెరికాకు వెళ్తుంటారు.
ఈ క్రమంలో కంపెనీలు తమ ఉద్యోగులను అమెరికా పంపించేందుకు వీసా ప్రాసెసింగ్ త్వరగా అయ్యేందుకు 1,125 అమెరికా డాలర్లను స్పెషల్ ఫీజు కింద చెల్లిస్తున్నాయి. దీంతో రెగ్యులర్ హెచ్1బీ వీసాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి దరఖాస్తులు వెనుక పడుతుండటంతో ప్రస్తుతం ఆ పద్ధతికి స్వస్తి చెప్పింది. ప్రీమియం ప్రాసెసింగ్ సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేయడంతో చాలా కాలం నుంచి పెండింగ్‌లో ఉన్న రెగ్యులర్ హెచ్1బీ వీసాలను త్వరగా ప్రాసెస్ చేసే అవకాశం ఉందని యూఎస్‌సీఐఎస్ తెలిపింది.
ప్రీమియం ప్రాసెసింగ్ కింద ఒక అభ్యర్థి హెచ్1బీ వీసా కోసం దరఖాస్తు చేసుకుంటే ఆ అభ్యర్థికి వీసా వచ్చేది లేనిది తేల్చేందుకు కేవలం 15 రోజుల సమయం మాత్రమే పడుతుంది. ఈ క్రమంలో ప్రీమియం ప్రాసెసింగ్ దరఖాస్తులు ఎక్కువ అవడంతో రెగ్యులర్ హెచ్1బీ వీసా కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు వీసా ప్రాసెసింగ్ చేసుకునేందుకు మూడు నెలలపైనే సమయం పడుతుందని.. అందుకే హెచ్1బీ వీసాల ప్రీమియం ప్రాసెసింగ్‌ను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు యూఎస్‌సీఐఎస్ స్పష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com