రియాద్ లో దోపిడీకి పాల్పడ్డ సాయుధులైన దొంగలు..చోరీసొమ్ముతో పరారీ

- March 27, 2017 , by Maagulf
రియాద్ లో  దోపిడీకి పాల్పడ్డ సాయుధులైన దొంగలు..చోరీసొమ్ముతో పరారీ

నగదు రవాణా చేసే ఒక కంపెనీకి చెందిన ఇద్దరు ఉద్యోగులపై గుర్తు తెలియని సాయుధులైన దొంగలు  కాల్పులకు తెగబడ్డారు. అనంతరం డబ్బు చేజిక్కించుకొని దొంగ సొత్తుతో పరారయ్యారు. దీనిపై సమాచారం అందించిన ప్రతినిధి  రియాద్ ప్రావిన్స్ పోలీస్ కల్నల్ ఫరజ్  అల్ మైమన్  ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆదివారం  బులెట్ గాయాలు పాలైన ఆ ఉద్యోగులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స జరుపుతున్నట్లు తెలిపారు.ఈ సంఘటనకు సంబంధించి భద్రతా అధికారులు వారి పరిశోధనలు ఇంకా కొనసాగుతూనే ఉంటాయని కల్నల్ అల్ మైమన్ ధ్రువీకరించారు. పోలీసులు  సాయుధ దొంగలను అదుపులోనికి తీసుకొనేందుకు తీవ్ర   ప్రయత్నం చేస్తూనే ఉంటారని ఆయన ఉద్ఘాటించారు. ప్రత్యక్ష సాక్షుల కధనం ప్రకారం  రాజధాని రియాద్ ఉత్తర భాగంలోని అల్ రెడ్జిల్లా ఆదివారం  ముగ్గురి మధ్యాహ్న సమయంలో (దుహ్ర్ ) ఆయుధాల ట్రక్కులో నగదు తరలించుతున్నారనే సమాచారం తెల్సుకొని ముగ్గురు దుండగులు ట్రక్కు మార్గాన్ని అడ్డుకొని ఈ దోపిడీకి పాల్పడినట్లు తెలిపారు.నగదు తరలిస్తున్న కంపెనీ ఉద్యోగులు ప్రయాణిస్తున్న ట్రక్కుని లక్ష్యం చేసుకొని విచక్షణారహితంగా తుపాకీతో కాల్పులు జరిపేరు. ఆ తర్వాత  వారి వద్ద నుంచి పెద్ద మొత్తంలో డబ్బుని దోచుకున్నారు. వారు దొంగిలించిన సొత్తు సుమారు 2 మిలియన్ల సౌదీ రియాళ్ల వరకు ఉండవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. సిబ్బందిపై  పట్ట పగలు కాల్పులు జరిపిన నేపథ్యంలో తీవ్రంగా గాయపడ్డారు. తూటాల  కాల్పులలో గాయపడిన ఉద్యోగులను ఆసుపత్రికి తరలించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com