సిగరెట్‌ వ్యర్థాలను తొలగించేందుకు కొత్త ప్రయోగం

- May 25, 2017 , by Maagulf
సిగరెట్‌ వ్యర్థాలను తొలగించేందుకు కొత్త ప్రయోగం

దుబాయ్‌ మునిసిపాలిటీ, రోడ్లపై కనిపించే వాడేసిన సిగరెట్‌ వ్యర్థాలను తొలగించేందుకుగాను అధునాతన పరికరాల్ని వినియోగించనుంది. రోడ్లు, మార్కెట్‌ ప్లేస్‌లలో కనిపించే ఈ తరహా వేస్టేజ్‌లను సంప్రదాయ పద్ధతుల్లో తొలగించడం ఇప్పటిదాకా జరుగుతూ వస్తోంది. దానికి భిన్నంగా కొత్త పరికరంతో ఈ వేస్టేజీని తొలగిస్తారు. 120 లీటర్ల కెపాసిటీ గల ఈ పరికరం, ఇసుకని వేరుగా, సిగరెట్‌ వ్యర్థాల్ని వేరుగా సేకరిస్తుంది. ఎక్కడంటే అక్కడ వినియోగించేందుకు వీలుగా ఉంటుంది ఈ పరికరం. అధునాతన టెక్నాలజీని వినియోగించుకోవడంలో దుబాయ్‌ మునిసిపాలిటీ ఎప్పుడూ ముందుంటుందని, క్లీన్‌గా ఉంచేందుకోసం ఈ తరహా టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతుందని దుబాయ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌ డైరెక్టర్‌ అబ్దుల్‌ మజీద్‌ సిఫాయి చెప్పారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com