అగ్ని ప్రమాదంలో బాలుని మరణం తర్వాత షాక్ లోనే ఆ కుటుంబం

- May 25, 2017 , by Maagulf
అగ్ని ప్రమాదంలో బాలుని మరణం తర్వాత షాక్ లోనే ఆ కుటుంబం

మనామ: స్థానిక హమాడ్ టౌన్ లో మంగళవారం జరిగిన  అగ్నిప్రమాదంలో ఖలీఫా ఇసా అనబడే  రెండున్నర ఏళ్ళ బాలుడు  ప్రాణాలు కోల్పోయిన విషయం పాఠకులకు విదితమే  .పౌర రక్షణ విభాగం ఆ ఇంట్లో ఎగిసిపడుతున్న అగ్నిజ్వాలలను ఎట్టకేలకు అదుపులోనికి తెచ్చినప్పటికీ , మంటల కారణంగా దట్టంగా అలుముకున్న పొగ  రెండు సంవత్సరాల అయిదు నెలల వయస్సు ఉన్న ఓ చిన్నారికి  ఊపిరి ఆడని కారణంగా చనిపోయాడు. చనిపోవడానికి కారణమయ్యింది మంగళవారం వారి బిడ్డను కోల్పోయిన తరువాత ఆ కుటుంబం పడుతున్న మానసిక వేదన వర్ణనాతీతం. ప్రస్తుతం ఆ  కుటుంబం ఓదార్పును కోరుతోంది. ఆ ఇంటిలో అగ్ని ప్రమాదానికి గురైన సమయంలోనే వారి పని మనిషిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు ఇప్పటికీ అత్యాసర చికిత్స కేంద్రంలో ఉండి వైద్యం పొందుతున్నారు. కాగా ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థి  క్లిష్టమైన పరిస్థులలో ఉంది.  ఈ సందర్భంగా బాలుని తండ్రి కుటుంబంలో మా మొదటి మరియు ఏకైక సంతానం ఖలీఫా, మొత్తం మా కుటుంబం అంతా ఆ బాలుడిని ఎంతో  ప్రేమించారు. నా భార్య మరియు మేము ఈ అగ్నిప్రమాద  వార్త వినినప్పుడు మా  పనిలో నిమగ్నమై ఉన్నాం. ఈ సమాచారం తెలియగానే  మా బిడ్డ , పనిమనిషి ఎలా ఉన్నారో తెలుసుకొనేందుకు హడావిడిగా ఇంటికి చేరుకున్నట్లు తెలిపారు. . రిఫా నుండి హమాడ్ టౌన్ చేరుకోవడానికి 10 నిమిషాల కంటే ఎక్కువ సమయం పట్టదు., అయితే అగ్నిమాపకదళ సిబ్బందికి అక్కడకు చేరుకోవడానికి  20 నిమిషాల సమయం పట్టింది. అలాగేవారు . నీటిని ఉపయోగించి పరిస్థితిని నిర్వహించడానికి బదులుగా వారు అగ్నిని  నివారించే రసాయనాలు ఉపయోగించారని ఆయన వాపోయారు.. అంతేకాకుండా, అంబులెన్స్ కూడా ఒక గంట ఆలస్యంగా ప్రమాదస్థలంకు చేరుకొంది,. నా కుమారుడు మరియు మా  పని మనిషిని ఇంటి నుండి వెలుపలకు తీసుకువచ్చారు.  వారు వీధిలో పడి ఉన్నారు. అగ్నిమాపక సిబ్బంది కూడా వారు ఇరువురు ప్రాణాలు  కోల్పోయినట్లు భావించారు, కానీ అంబులెన్స్ వచ్చి వారిని పరీక్షించినపుడు మా పనిమనిషి సజీవంగా ఉన్నట్లు గుర్తించారు. దీనితో ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. "మేము ఎవరినీ నిందించడం లేదు మరియు మేము నిజంగా తప్పు ఎక్కడ జరిగిందో తెలియదు కానీ మా బిడ్డను కోల్పోయామని ఆ తండ్రి విలపించారు. ఈ బాదఫ తమను జీవితాంతం వెంటాడుతూనే ఉంటుందని పేర్కొంటూ, తమ చిన్నారి చనిపోవడంపై మేము ఒక తీవ్తమైన  షాక్ లో ఉన్నామని ఆన్నారాయన. విద్యుత్ ఓవర్లోడ్ కారణంగా ఇంట్లో షార్ట్ సర్క్యూట్కు దారితీసిందని స్థాని పత్రికలు వార్తలు ప్రచురించాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com