దోలా-సాదియా భారత్ దేశంలోనే అతిపెద్ద బ్రిడ్జ్‌

- May 25, 2017 , by Maagulf
దోలా-సాదియా భారత్ దేశంలోనే అతిపెద్ద బ్రిడ్జ్‌

భారత్: భారత్ దేశంలోనే అతిపెద్ద బ్రిడ్జ్‌కు శుక్రవారం ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. అస్సాంలో ఉన్న ఈ ఫాస్ట్‌ ట్రాక్‌ బ్రిడ్జ్‌ ఆర్మీ ఇండియా-చైనా బోర్డర్‌కు చాలా కీలకమైనది. ఈ వంతెన నిర్మాణానికి 2011లో అప్పటి ప్రధాని మన్మోహన్‌ శంకుస్థాపన చేసినా... నిర్మాణం మాత్రం జరగలేదు. అయితే ఇండియా-చైనా బోర్డర్‌లో కీలకమైన ఈ ప్రాజెక్ట్‌ను సీరియస్‌గా తీసుకున్న కేంద్రం నిధులు కేటాయించి... మూడేళ్లలో పూర్తి చేసింది.

దోలా-సాదియా మధ్య లోహిత్‌ నదిపై ఈ బ్రిడ్జ్‌ను నిర్మించారు. ఈ వంతెన పొడవు 9కిలోమీటర్లుకాగా... అస్సాం రాజధాని గౌహతికి సరిగ్గా 540 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే అరుణాచల్‌ప్రదేశ్‌ రాజధాని ఇటానగర్‌కు 300 కిలోమీటర్ల దూరం. అస్సాం-అరుణాచల్‌ ప్రదేశ్‌ మధ్య రాకపోకలకు ఈ బ్రిడ్జ్‌ కీలకమైనది. అలాగే అస్సాం నుంచి అరుణాచల్‌ ప్రదేశ్‌కు నాలుగు గంటల్లో చేరుకోవచ్చు. 

ప్రధానంగా ఆర్మీకి ఈ బ్రిడ్జ్‌ అత్యంత కీలకమైనది. అస్సాం నుంచి అరుణాచల్‌ప్రదేశ్‌లోని చైనా బోర్డర్‌కు వెళ్లేందుకు ఈ వంతెన ప్రధానమైనది. అంతేకాదు  60 టన్నుల బరువుండే యుద్ధ ట్యాంకులు బ్రిడ్జిపై నుంచి వెళ్లినా తట్టుకునేలా నిర్మించారు. ఈ బ్రిడ్జి నిర్మాణానికి 950 కోట్లు ఖర్చయ్యింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com