అన్నం తినేటపుడు ఎందుకు మాట్లాడకూడదో తెలుసా?

- June 16, 2017 , by Maagulf
అన్నం తినేటపుడు ఎందుకు మాట్లాడకూడదో తెలుసా?

యోగశాస్త్రం ప్రకారం మనుష్యుని శ్వాసగతి 12 అంగుళాల దాకా ఉంటుంది. భోజనం చేసేటపుడు 20 అంగుళాల దాకా ఉంటుంది. మాట్లాడితే శ్వాసగతి ఎక్కువవుతుంది. కాబట్టి ఆయుష్షు తగ్గుతుంది. కనుక ఆహారం తీసుకునేటప్పుడు మాట్లాడకూడదని శాస్త్రం చెపుతుంది. అంతేకాదు... ఆరోగ్యరీత్యా కూడా అది శ్రేయస్కరం కాదు. అన్నం తినేటపుడు గబుక్కున మాట్లాడితే పొరపోయే అవకాశం వుంది. ఫలితంగా ఊపిరి ఆడక ప్రాణం పోయే పరిస్థితి కూడా తలెత్తుతుంది. 
 అలాగే త్రయోదశినాడు వంకాయ తినకూడదు. అష్టమి నాడు కొబ్బరి తినకూడదని, పాడ్యమినాడు గుమ్మడికాయ తినకూడదని, పురాణాలు చెబుతున్నాయి. రాత్రి అన్నం తినేటపుడు దీపం ఆరిపోతే విస్తరాకునుగాని, పాత్రనుగాని చేతులతో పట్టుకొని సూర్యుణ్ణి స్మరించాలని దీపాన్ని చూసి మిగిలినది తినాలని అప్పుడు మరోసారి వడ్డించుకోవద్దని పెద్దలంటారు.
 రాత్రి ఆహారం తింటూ ఉన్నప్పుడు తుమ్మితే నెత్తిపై నీళ్ళు చల్లడం, దేవతను స్మరింపచేయడం ఆచారంగా ఉంది. రాత్రి పెరుగు వాడకూడదు. ఒకవేళ వాడితే నెయ్యి, పంచదార కలిపివాడవచ్చు. ఇలా చేస్తే వాతాన్ని పోగొడుతుంది. రాత్రిళ్లు కాచిన పెరుగును మజ్జిగ పులుసు మొదలైనవి వాడకూడదు. 
 ఆవునేయి కంటికి మంచిది. ఆవు మజ్జిగ చాలా తేలికైనది. అందులో సైంధవ లవణం కలిపితే వాతాన్ని పోగొడుతుందని, పంచదార కలిపితే పిత్తాన్ని పోగొడుతుందని, శొంఠి కలిపితే కఫాన్ని పోగొడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 నలుగురు కూర్చొని తింటూ ఉన్నప్పుడు మధ్యలో లేవకూడదు. తేగలు, బుర్రగుంజు, జున్ను, తాటిపండు మొదలైనవి వేదవేత్తలు తినరు. ఆకలితో బాధపడేవారు కోడి, కుక్క మొదలైనవి చూస్తూ ఉండగా తినకూడదన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com