శమంతకమణి:మూవీ రివ్యూ

- July 14, 2017 , by Maagulf
శమంతకమణి:మూవీ రివ్యూ

సినిమా పేరు: శమంతకమణి 
విడుదల తేదీ: 14-07-2017
సంగీతం: మణిశర్మ 
నిర్మాత: వి.ఆనంద్‌ ప్రసాద్‌ 
కథ.. దర్శకత్వం: శ్రీరామ్‌ ఆదిత్య 
నిర్మాణం: భవ్య క్రియేషన్స్‌ 
నటీనటులు: నారా రోహిత్‌, సుధీర్‌బాబు, సందీప్‌కిషన్‌, ఆది, రాజేంద్రప్రసాద్‌, సుమన్‌. ఇంద్రజ, చాందినీ చౌదరి, అనన్య సోని, జెన్నీ హనీ...
టాలీవుడ్‌లో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నలుగురు హీరోలతో తెరకెక్కిన సినిమా 'శమంతకమణి'. నారా రోహిత్‌, సుధీర్‌బాబు, సందీప్‌కిషన్‌, ఆది. ఇలా నలుగురు యంగ్ హీరోస్ కలిసి చేసిన సినిమా కావడంతో ఈ మూవీపై అంచనాలు ఉన్నాయి. వీళ్లకి తోడు నలుగురు హీరోయిన్ల సందడి.. ఇంకోవైపు, రాజేంద్రప్రసాద్, సుమన్. ఇలా.. భారీ కాస్టింగ్ తో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఏమేరకు ఆకట్టుకుందో చూద్దాం.
స్టోరీ : రిచ్ కిడ్ అయిన కృష్ణ(సుధీర్‌బాబు) హైదరాబాద్‌లో ఫ్రెండ్స్ కు గ్రాండ్ పార్టీ ఇస్తాడు. అంతా ఎంజాయ్ చేసి వెళ్లిపోయే టైంలో ఓ కారు మాయమైన సంగతి తెలిసొస్తుంది. అది ఐదు కోట్ల రూపాయల విలువైన కారు. ఆ కారుపేరే శమంతకమణి. కారు ఎవరు దొంగిలించారన్నది తేల్చేందుకు ఇన్‌స్పెక్టర్‌ రంజిత్‌కుమార్‌ (నారారోహిత్‌) రంగంలోకి దిగుతాడు. ఆ పార్టీకి వచ్చిన వారిలో ముగ్గుర్ని సస్పెక్ట్స్ గా భావిస్తాడు రంజిత్. ఆ ముగ్గురూ ఎవరంటే.. ఉమామహేశ్వరరావు(రాజేంద్రప్రసాద్‌), శివ(సందీప్‌ కిషన్‌), కార్తీక్‌(ఆది). ఈ ముగ్గురూ ఒకే మెంటాలిటీ గల వ్యక్తులు, ఏదో ఒకటి చేసి లైఫ్ లో పాష్ గా సెటిల్‌ అయిపోవాలనుకునే స్వభావం వీరిదైతే, ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ఇన్‌స్పెక్టర్‌ రంజిత్‌కుమార్‌ కూడా సేమ్ టు సేమ్ అదే టైపు. ఈ నేపథ్యంలో దర్యాప్తు ఎలా సాగింది. శమంతకమణి దొంగిలించింది ఎవరు అనేదే సినిమా కథ.
'భలే మంచిరోజు' మూవీతో కాంప్లిమెంట్స్ అందుకున్న డైరెక్టర్ శ్రీరామ్‌ ఆదిత్య తెరకెక్కించిన రెండో సినిమా ఇది. క్రైమ్ కామెడీ కాన్సెప్ట్ తో ఈసినిమా తెరకెక్కించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. అయితే, నలుగురు హీరోలను తీసుకోవడంతో నలుగురుకీ తగిన ప్రాధాన్యతనిస్తూ ఆ పాత్రలన్నింటినీ ఇంట్రడ్యూస్ చేయడంతోటే ఫస్ట్ హాఫ్ అయిపోయింది. దీంతో ప్రేక్షకుడికి సినిమా చాలా స్లోగా సాగుతుందే అనే భావన కలిగింది. ఇక సెకండాఫ్ లో కథనాన్ని పరుగెత్తించాలని డైరెక్టర్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో వచ్చే కొన్ని ట్విస్ట్‌ ఫర్వాలేదనిపిస్తాయి. ఒక రకంగా ఈ ట్విస్ట్స్ కోసమే డైరెక్టర్ కథ అల్లాడా అన్న భావనా కలుగకమానదు. క్లైమాక్స్ బావుందనిపిస్తుంది.
నలుగురు హీరోలనీ వేర్వేరు పాత్రల్లో సమర్థంగా చూపించగలిగాడు దర్శకుడు. సుధీర్‌బాబు పాత్ర మాత్రం భావోద్వేగంతో సాగుతుంది. సందీప్‌కిషన్‌, ఆది రోల్స్ సరదాగా సాగిపోతాయి. నారారోహిత్‌ పాత్ర కథకు కీలకంకాగా, రాజేంద్రప్రసాద్‌- ఇంద్రజ మధ్య వచ్చే లవ్‌ ట్రాక్‌ నవ్వులు రప్పించింది. హీరోయిన్లు వాళ్ల పరిధి మేరకు మెప్పించారు. సమీర్‌రెడ్డి కెమేరా ఓకే. మణిశర్మ నేపథ్య సంగీతం బావుంది. నిర్మాణ విలువలకు మార్కులు పడతాయి. ఆఖరి పదినిమిషాలే సినిమా అనే ఒపీనియన్ లో ప్రేక్షకుడు బయటకొచ్చాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com