'వైశాఖం' సినిమా రివ్యూ

- July 21, 2017 , by Maagulf
'వైశాఖం' సినిమా రివ్యూ

రివ్యూ:'వైశాఖం'
నటీనటులు: హరీష్‌, అవంతిక , డైలాగ్‌ కింగ్‌ సాయికుమార్‌, ఈశ్వరీరావు, రమాప్రభ, తదితరులు... 
సంగీతం: డి.జె.వసంత్‌, 
నిర్మాత: బి.ఎ.రాజు, 
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, ఎడిటింగ్‌, దర్శకత్వం: జయ బి.
రిలీజ్ డేట్: 2017 జులై 21న
లవ్లీ సినిమాతో యూత్ ని ఎట్రాక్ట్ చేసిన బి.జయ కొంత గ్యాప్ తీసుకొని మరో ట్రెండీ లవ్ స్టోరీ వైశాఖంతో ఆడయన్స్ ని ఎంటర్ టైన్ చేసేందుకు మరోసారి ప్రేక్షకులు ముందుకు వచ్చింది. హరీష్, అవంతికలు జంటగా రూపొందించిన వైశాఖం ఆడియన్స్ కి ఎలాంటి ఎక్స్ పీరియన్స్ నిచ్చిందో తెలుసుకుందాం..
కథ:
వేణు(హరీష్) అపార్ట్ మెంట్ లో ప్రెండ్స్ తో కలిసి ఉంటుంటాడు. ఆ అపార్ట్ మెంట్ లోని ప్లాట్స్ వాళ్ళందరికీ అతనొక పెద్ద ప్రాబ్లమ్. ఒకరోజు బానుమతి(అవంతిక) ఆ అపార్ట్ మెంట్ లోని ఒక ప్లాట్ లో బ్యూటీ పార్లర్ ఓపెన్ చేస్తుంది. వేణు లవర్ని అని అందరికీ చెప్పుకుంటుంది. వేణుతో చనువుగా ఉంటూనే అతనితో గొడవలు పడుతుంటుంది. ఇంతలో వేణు అమ్మ వచ్చి భానుమతి తో కలసి అపార్ట్ మెంట్ లో ఉంటుంది. అసలు వేణు అమ్మ భానుమతితో కలసి ఎందుకు ఉంటుంది. వేణు  లవర్ని అని ఎందుకు చెప్పుకుంటుంది..? అసలు భానుమతికి వేణుకి ఉన్న సంబంధం ఏంటనేది మిగిలిన కథ..?
కథనం:
సమాజంలో ఎవరి దారిన వారు బతికే వారే ఎక్కువ. ఉమ్మడి కుంటుంబాలు కరువైన రోజుల్లో అపార్ట్ మెంట్ కల్చర్ లో మనుషుల మద్య అనుబంధాలు పెనవేసుకుంటే అది కూడా ఉమ్మడి కుటుంబమే. ఈ పాయింట్ చుట్టూ అల్లుకున్న కథే వైశాఖం.  బి. ఎ. జయ ఇందులో తీసుకున్న  సెంట్రల్ పాయింట్ ప్రతి ఒక్కిరూ ఐడిటింఫై  చేసుకునే క్యారెక్టర్స్ ని క్రియేట్ చేసింది జయ. ఇందులో 30ఇయర్స్ పృధ్వీ ఫస్ట్ హాఫ్ లో తన దైన టైమింగ్ తో ఎంటర్ టైన్ చేసాడు. జులాయి గా తిరిగే యూత్ క్యారెక్టర్ లో హారీష్ ఈజ్ తో నడిపించాడు. పాటలలో హరీష్ అవంతిక ల పుల్ జోష్ లో రెచ్చిపోయారు. భానుమతి సాంగ్ పిక్చరైజేషన్ బాగుంది.  సరదా సన్నివేశాలతో, హీరో, హీరోయిన్ల మద్య వచ్చే అల్లరి తో ఫస్ట్ ఆఫ్ సరదాగా గడిచిపోతుంది.  షేకింగ్ శేషు, అండ్ హీరో గ్యాంగ్ మద్య వచ్చే కామెడీ రోటీన్ గా అనిపించింది. ఒకచోట బతికే వాళ్లంతా మనం అనే ఫీలింగ్ ని తెచ్చుకోగలిగితే ఎక్కడ ఉన్నా ఒంటరితనం అనిపించదు అనే లైన్ చుట్టూ బి.జయ అల్లుకన్న సన్నివేశాలు బాగున్నాయి. ఒకరింట్లో క్రికెట్ చూస్తుంటే సీరియల్స్ చూసే అలవాటున్న వారంతా ఎదురింటికెళ్లి అక్కడ సెటిల్ అవుతారు. మనకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా దూరంగా ఉన్న దగ్గరవారికంటే.. కాస్త మనసు పెద్దది చేసుకుంటే దూరంగా అనిపించే పక్కింటి వారు దగ్గరవుతారు. ఇక సాయికుమార్ క్యారెక్టర్ హార్ట్ టచ్చింగ్ గా అనిపించింది. తన సీనియారిటీతో ఆ పాత్రకు సినిమా కాన్సెప్ట్ కి ప్రాణం పోసాడు. పండుగలు పబ్బాలు కాదు ఎదుటివారి కష్టాల్లో పాలుపంచుకుంటే ప్రతి రోజు పండుగ అవుతుందనుకునే ఆ పాత్రను చాలా సహాజంగా చేసాడు. అవంతిక తన పాత్రకు న్యాయం చేసింది. పాటలలో పుల్ జోష్ గా కనిపించి యూత్ ని ఎట్రాక్ట్ చేసింది. క్లైమాక్స్ లో వచ్చే వైశాఖం టైటిల్ సాంగ్ సినిమా థీమ్ ని బాగా ఎలివేట్ చేసింది. చిన్న కాన్సెప్ట్ బి.జయ చాలా బాగా హ్యాండిల్ చేసింది. హీరో హరీష్ పాటలలోనూ పుల్ ఎనర్జిటిక్ గా కనిపించాడు. ఎమోషనల్ సీన్స్ ని కూడా పండించాడు.  పాటల పిక్చరైజేషన్ బాగుంది.  అందరికీ కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ ని తీసుకొని ఎంటర్ టైనింగ్ గా చెప్పండంలో వైశాఖం టీం సక్సెస్ అయ్యింది.
చివరిగా:
మెప్పించిన వైశాఖం  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com