ఎన్నారైలకు ఓటు హక్కు ఎప్పుడు: సుప్రీంకోర్టు ప్రశ్న

- July 26, 2017 , by Maagulf
ఎన్నారైలకు ఓటు హక్కు ఎప్పుడు: సుప్రీంకోర్టు ప్రశ్న

ఎన్నారైలకు ఓటు హక్కు ఎప్పటికల్లా కల్పిస్తారు? అని భారత అత్యున్నత న్యాయస్థానం, కేంద్ర ప్రభుత్వాన్ని ్పశ్నించింది. చీఫ్‌ జస్టిస్‌ జెఎస్‌ ఖెహర్‌, జస్టిస్‌ డివై చంద్రచూడ్‌లతో కూడిన బెంచ్‌, అటార్నీ జనరల్‌ ఇచ్చిన సమాచారాన్ని పరిగణనలోకి తీసుకుంది. పార్లమెంటులో రిప్రెజెంటేషన్‌ ఆఫ్‌ పీపుల్‌ (ఆర్‌ఐపి)కి మార్పులు చేర్పులు చేసేందుకు పార్లమెంటు ఆమోదం అవసరమని అటార్నీ జనరల్‌ కెకె వేణుగోపాల్‌ న్యాయస్థానానికి తెలిపారు. కేంద్ర మంత్రుల సమావేశంలో, ఈ విషయానికి సంబంధించి పలు అంశాలపై చర్చ జరిగిందని కూడా న్యాయస్థానానికి విన్నవించారు అటార్నీ జనరల్‌. నాన్‌ రెసిడెంట్‌ ఇండియన్స్‌, ఇ-బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించే విషయమై చాలాకాలంగా చర్చ జరుగుతోంది. ఆ దిశగా ప్రభుత్వాలు ఆలోచన చేస్తున్నా, చిత్తశుద్ధితో పనిచేయడంలేదన్న విమర్శలు వినవస్తున్నాయి.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com