'లై' రివ్యూ

- August 11, 2017 , by Maagulf
'లై' రివ్యూ

రేటింగ్ (2.75/5)
నితిన్... దాదాపు ఏ తెలుగు హీరోకీ రానంత క్రైసిస్ ని ఎదుర్కొని కూడా తానేమిటో నిరూపించుకున్న యువ నటుడు. అతని వయస్సులో కెరీర్ పూర్తిగా సెట్ కాకముందే నితిన్ కి ఎదురైన ఫ్లాప్ లు మామూలువి కాదు. దాదాపు నితిన్ పని ఇక అయిపోయిందీ అనుకున్న టైం లో మళ్ళీ లేచి నిలబడ్డాడు. టాలీవుడ్ కి కావాల్సిన నటన అనే 'స్టఫ్' తో మళ్ళీ ఎదిగాడు. ఒక్కొక్క సినిమానీ ఎటువంటి పెద్ద అంచనాలు లేకుండానే రిలీజ్ తర్వాత సైలెంట్ హిట్ అన్న టాక్ తో తన స్టామినా తో సినిమాని నడిపించగల స్థాయి కి ఎదిగాడు. అయితే ఈసారి మళ్ళీ స్టైలిష్ లుక్ తో వచ్చి 'యావరేజ్ కంటే తక్కువే' అనిపించుకునేలా తయారయ్యాడు. సారీ...! సినిమాని హను రాఘవపూడితో కలిసి అలా తయారు చేసాడు... చాలా అంచనాలతో వచ్చింది 'లై' ఇదివరకు ఎన్నడూ లేనంత స్టైలిష్ లుక్ తో నితిన్, స్ట్రైట్ సినిమాలో విలన్ గా చేసిన నిన్నటితరం యాక్షన్ కింగ్ అర్జున్, టాలీవుడ్ లో ఒక డిఫరెంట్ ఫీల్ ఉండే సినిమా అందాల రాక్షసీ, నానీ కెరీర్ లోనే గుర్తుండిపోయే సినిమా 'కృష్ణగాడి వీర ప్రేమ గాథ' లాంటి సినిమాలని తీసిన హను రాఘవపూడి దర్శకత్వం.... ఇవన్నీ ఉంటే ప్రేక్షకుడు ఎంత ఎక్స్పెక్ట్ చెస్తాడు...? మరి ప్రేక్షకుడు కొరుకున్నది దొరికిందా? లై 'నిజంగా' ఎంత ఆకట్టుకోగలిగిందీ అన్నది ఇప్పుడు చూద్దాం...

కథ:
అబద్ధాల మీద మాత్రమే బతకగలం అని చిన్నతనం నుంచే మైండ్ ని ఫిక్స్ చేసుకున్న ఒక అబ్బాయి జీవితం మొత్తం అబద్ధాలతో నింపేసుకుంటాడు సత్యం (నితిన్) పేరు మాత్రమే సత్యం కానీ ఎప్పుడూ నిజం చెప్పడు. ఎలాంటి భాధ్యతలు లేని కుర్రాడు. పెద్దింటి అమ్మాయిని పెళ్లాడాలనే ఆలోచనతో ఉన్న సత్యానికి చైత్ర (మేఘా ఆకాష్) పరిచయం అవుతుంది. ఒక విచిత్రమైన కారణం (చెప్తే క్యామిడీకంటే ఎక్కువ నవ్వుతారు) తో పెళ్ళి క్యాన్సిల్ చేసుకున్న చైత్ర పిల్ల మన సత్యం తో కలిసి యూఎస్ ట్రిప్ కి బయల్దేరుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com