నేనే రాజు నేనే మంత్రి మూవీ రివ్యూ

- August 11, 2017 , by Maagulf
నేనే రాజు నేనే మంత్రి మూవీ రివ్యూ

భార్యకు ప్రేమతో ముఖ్యమంత్రి రానా - నేనే రాజు నేనే మంత్రి మూవీ రివ్యూ..
నేనే రాజు నేనే మంత్రి
నటీనటులు : రానా, కాజల్, క్యాథెరిన్, తనికెళ్ల భరణి, నవదీప్, శివాజీ రాజా తదితరులు
సినిమాటోగ్రఫి : వెంకట్.సి. దిలీప్
సంగీతం : అనూప్ రూబెన్స్
ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు
దర్శకుడు : తేజ
నిర్మాతలు : కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి, సురేష్ బాబు
విడుదల తేది : ఆగష్టు 11, 2017.
నిడివి - 152 నిమిషాలు
బాహుబలి, ఘాజీ చిత్రాల తర్వాత రానా నటించిన మూవీ నేనే రాజు నేనే మంత్రి.. ఇటీవల కాలంలో ప్లాప్ లతో నిరాశలో ఉన్న తేజ ఈ మూవీకి దర్శకుడు. ఈ మూవీ రాజకీయ నేపథ్యంతో ఉన్న మూవీ అంటూ భారీ ప్రచారమే నిర్వహించారు. రానా కూడా సరికొత్త గెటప్ లో కనిపించాడు.. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. కమర్షియల్ పొలిటికల్ డ్రామా ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీ ఈ రోజే విడుదలైంది. ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఈ రివ్యూ చదవాల్సిందే 
కథ
జోగేంద్ర (రానా) ముఖ్యమంత్రి పదవి అంటూ చేసిన తప్పుకు ఉరి శిక్ష వేస్తుంది కోర్టు.. ఉరి వేసిన సమయంలో చివరి కోరిక ఏది అని అడిగితే తన జీవిత కథ టివిలో ప్రసారం కావాలి అంటాడు.. దీంతో అసలు కథ ప్రారంభమవుతోంది. జోగేంద్ర అనంతపురం జిల్లాలోని ఓ గ్రామంలో ఓ వడ్డీ వ్యాపారి.. అతడికో అందమైన భార్య రాధ(కాజల్). భార్య అంటే ఎంతో ప్రేమ.. భార్య కోసం ఏదైనా చేయగల తెగింపు ఉన్న వ్యక్తి.. భార్య గర్భవతిగా ఉండగా దేవాలయంలో దీపం వెలిగించేందుకు వెళితే అక్కడ తొలిదీపం సర్పంచ్ భార్య వెలిగించాలంటూ తోసేస్తారు.. దీంతో అబార్షన్ అవుతుంది..ఈ విషయం తెలిసి రగిలిపోతాడు.. దీంతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తాడు..సర్పంచ్ ను చంపేసి ఎన్నికల్లో నిలబడి సర్సంచ్ అయిపోతాడు.. రాజకీయ వాసనలు వంట బట్టడంతో ఒక్కోసంఘటనతో ఒక్కో మెట్టు ఎక్కుతాడు.. సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే, ఆ తర్వాత మినిస్టర్ ఆ తర్వాత ముఖ్యమంత్రి పీఠం అందుకుంటాడు..ఈ పదవులను సాధించేందుకు అడ్డుగా ఉన్న ఎమ్మెల్యేను, మినిస్టర్ ను కూడా హత్య చేసేందకు వెనకాడడు. ముఖ్యమంత్రి పీఠంపై కన్నువేసిన తర్వాతరాజకీయాల్లో ఎంతో కుళ్లు ఉందో తెలుసుకుంటాడు..దిన దిన పదవి గండంతో పాటు ఎత్తులు పై ఎత్తులతో విసిగిపోతాడు..బ్లాక్ మెయిల్ రాజకీయాలపై విరక్తి పెంచుకుంటాడు.. దీంతో ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకుంటాడు. ఈ రాజకీయ వైకుంఠపాళీలో అడుగడుగునా భార్య రాధ మద్దతు ఇస్తుంది. తన కోసం భర్త చేస్తున్న పనులను చూసి మురిసిపోతుంది.. ఇదే సమయంలో ఒక టి వి ఛానల్ యజమానిగా ఉన్న క్యాథరిన్ ఆ చానల్ బాధ్యతలు స్వీకరించే ముందు ఎవరిదైనా జీవితాన్ని షో గా తీయాలని అనుకుంటుంది.. అప్పడే అమె దృష్టి జోగేంద్ర పై పడుతుంది.. అతడి నిజ జీవితం తెలిసి ఆశ్చర్యపోతుంది.. కొన్ని మంచి పనులు ఉండటంతో అతడిపై అభిమానాన్ని పెంచుకుంటుంది.. ఇంతకీ ఈ మూవీలో జోగేంద్ర రాజకీయ ప్రక్షాళన కోసం ఏం చేశాడు.. ఉరి తీయాల్సినంత నేరం ఏమిటి.. భార్య రాధ, స్నేహితురాలు క్యాథరిన్ లు జోగేంద్ర కోసం ఏం చేశారు అనే విషయాలు తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే.
విశ్లేషణ
ముందు ఈ మూవీకి రానాను ఎన్నుకున్నందుకు దర్శకుడు తేజాకి థ్యాంక్స్ చెప్పాలి. జోగేంద్ర పాత్ర ఎంపికలో ఈ మూవీకి సగం సక్సెస్ వచ్చింది. భార్య కోసం ఏమైనా చేసే భర్తగా, రాజకీయాల్లో ఎత్తులు పై ఎత్తులు వేస్తూ ముఖ్యమంత్రి స్థాయికి వెళ్లిన వ్యక్తిగా రానా మంచి నటన కనబరిచాడు.. ఈ మూవీలో ప్రతి క్షణం ఏదో ఒక్క ట్విస్ట్ ఉంది. దీంతో ప్రేక్షకులు మూవీలో లీనమైపోతారు..భార్య భర్తల అనుబంధాన్ని చక్కగా చూపించిన తేజ అంతకంటే రాజకీయ సన్నీవేశాలను గొప్పగా చేశాడు..రానా మేనరిజం, డైలాగ్ డెలివరి అతడి నటనలలో పరిపక్వత కనిపించింది. ఇక రాధ పాత్ర కాజల్ రాణించింది. భర్త చేస్తున్న ప్రతి పని చెడు అని తెలిసినా ప్రేమతో నాకోసం చేస్తున్నాడని మురిసిపోయే పాత్రలో మెరిసింది.. అదే సమయంలో రాజకీయ వైకుంఠపాళీలో భర్తకే ముప్పు ఉందని తెలిసిన సమయంలో జోగేంద్రకు నచ్చచెప్పే సీన్ లో ఎమోషన్స్ బాగా పండాయి.. క్యాథరిన్ పాత్ర కూడా ఈ మూవీలో కీలకం.. అందర్ని ఆకట్టుకునేలా నటించింది. తనికెళ్లే భరణి, అశుతోష్, నవదీప్, శివాజీ రాజ, అజయ్ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.. తేజా మరోసారి తనలోని దర్శకత్వం ప్రతిభను ప్రదర్శించాడు..ఏ సీన్ ఎంత కావాలో అంత నటననే రాబట్టుకున్నాడు.. ఎక్కడ అతిగా పోలేదు.. అదే సమయంలో ఎక్కువ ట్విస్ట్ లు ఉండటంతో ప్రేక్షకులు కన్ ప్యూజ్ అయ్యే ప్రమాదం ఉంది. అనూప్ రూబెన్స్ సంగీతం ఈ మూవీకి అదనపు బలం.. పాటల కంటే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చక్కగా ఉంది. వెంకటేష్ సినిమాటోగ్రఫీ తో మెస్మరైజ్ చేశాడు.. నటుల ఫీలింగ్స్ చక్కటి లైటింగ్ తో చూపాడు.. తేజా సినిమా కాస్త నిడివి ఎక్కువుగాను ఉంటుంది.. కొన్ని సన్నివేశాలకు కత్తెర వేస్తే ఈ మూవీ మరింత క్రిస్ప్ గా ఉండేది.. రోటిన్ చిత్రాలకు భిన్నంగా ఉన్న ఈ మూవీ లో నిర్మాణ విలువలు రిచ్ గానే ఉన్నాయి.. కొత్త ధనం కోరుకునే ప్రేక్షకులకు ఇదో మంచి మూవీ.. అందరూ చూసేలా తీయడంలో మాత్రం తేజ విజయం సాధించాడు
కామెంట్ -భార్యకు ప్రేమతో ముఖ్యమంత్రి
రేటింగ్ - 3/5

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com