ధూమపానంపై పోరాటానికి సౌదీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయం

- August 23, 2017 , by Maagulf
ధూమపానంపై పోరాటానికి సౌదీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయం

రియాద్ : ధూమపానం మానివేసేందుకు  ప్రజలకు సహాయం చేసేందుకు ఆ వ్యసనం బారిన పడిన ప్రజలకు అవగాహన కల్పించడానికి అల్-కావ్స్ డెవెలప్మెంట్ టెక్నాలజీతో ఒక ఒప్పందంపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంతకం చేసింది. "ఆరోగ్యం మంత్రి డాక్టర్ తవ్ఫిఖ్ అల్ రబీయ తన మంత్రివర్గ కార్యాలయంలో అల్ కాస్తో ఒప్పందంపై సంతకం చేశారు. పొగ వ్యతిరేక చికిత్సాలయాలు కాంప్లెక్స్ ఆబాలో ఏర్పాటుచేసినట్లు మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది.ఈ ఒప్పందంలో భాగంగా స్త్రీ మరియు పురుషులకు వేర్వేరుగా ధూమపాన-నిరోధక చికిత్సాలయాలు అందిస్తాయి. ధూమపానాన్ని విడిచిపెట్టాలని కోరుకునే వారికి చికిత్సా సేవలు 31 ఆరోగ్య కేంద్రాలు మరియు ఆసుపత్రులలోని వైద్యాన్ని అందిస్తాయి. మూడు నెలల వ్యవధిలో ధూమపాన నివారణ చికిత్సను పూర్తిచేయనున్నారు. ఆ తర్వాత ఆ వ్యక్తిని మాజీ పొగతాగే వ్యక్తిగా భావిస్తారు. ప్రపంచవ్యాప్తంగా మరణంకు దారితీసే కారణాలలో పొగాకు వ్యసనం ఎంతో తీవ్రమైనది. ధూమపానం మరియు ఇతర పొగాకు ఉత్పత్తుల వాడకం వలన ప్రతి ఏటా 7 లక్షల మందికి ప్రజలు మరణిస్తున్నారని  ప్రపంచ ఆరోగ్య సంస్థ తన గణాంకాలలో తెలిపింది. సౌదీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం ధూమపాన సంబంధిత వ్యాధుల కారణంగా ప్రతి సంవత్సరం 70,000 సౌదీ పౌరులు మరణిస్తున్నట్లు పేర్కొంది. సిగరెట్ల ధరని  సౌదీ రాజ్యంలో రెట్టింపు చేస్తున్నట్లు సిగరెట్ల కొనుగోలును నిరుత్సాహపరిచే ప్రయత్నంలో భాగంగా జూన్ నెలలో  ఎక్సైజ్ పన్నులు భారీగా పెంచినట్లు తెలిపింది. అంతేకాకుండా, పొగాకును ఉపయోగించడం వలన కలిగే ప్రమాదాలపై ప్రజా అవగాహనను పెంపొందించేందుకు "పొగాకు ప్రచారం" కు భారీ బడ్జెట్ కేటాయించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com