మొట్ట మొదటిసారిగా హారర్ సినిమా లో నటిస్తున్న మన మన్మధుడు

- August 28, 2017 , by Maagulf
మొట్ట మొదటిసారిగా హారర్ సినిమా లో నటిస్తున్న మన మన్మధుడు

'విక్రమ్‌' నుంచి 'ఓం నమో వేంకటేశాయ' వరకు లవ్‌, యాక్షన్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌, భక్తి రస చిత్రాలతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న హీరో కింగ్‌ నాగార్జున. తాజాగా ఓంకార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న 'రాజుగారిగది2' చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు కింగ్‌ నాగార్జున. షూటింగ్‌ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో విడుదల కాబోతోంది. ఆగస్ట్‌ 29 కింగ్‌ నాగార్జున పుట్టినరోజు. ఈ సందర్భంగా కింగ్‌ నాగార్జున మీడియాతో మాట్లాడుతూ.. 
ప్యాచ్‌ వర్క్‌ 'రాజుగారి గది2' మినహా కంప్లీట్‌ అయిపోయింది. రీకార్డింగ్‌ జరుగుతోంది. ఇది హారర్‌ కామెడీ థ్రిల్లర్‌. నా సైడ్‌ నుంచి కామెడీ తక్కువ. వెన్నెల కిషోర్‌, ప్రవీణ్‌, అశ్విన్‌ కామెడీ వుంటుంది. అది కూడా సిట్యుయేషనల్‌ కామెడీ ఉంటుంది అని తెలిపారు.. నాకు హారర్‌ సినిమాలంటే చాలా ఇష్టం. హారర్‌ అంటే ఎక్సార్జిస్ట్‌లాంటి సినిమాల్లా కాకుండా కామెడీ వుంటూ లైటర్‌ వేన్‌లో హార్రర్‌ వుండే సినిమాలంటే ఇష్టం. లక్కీగా అలాంటి సినిమా వచ్చింది. అని చెప్పారు. ఓంకార్‌ పర్‌ఫెక్షనిస్ట్‌. చిన్న చిన్న కరెక్షన్స్‌ వున్నా సరిచేసి తీస్తాడు. అతను అనుకున్నది పర్‌ఫెక్ట్‌గా తీస్తాడు. చాలా క్లియర్‌గా వుంటాడు. ఫుల్‌ స్క్రిప్ట్‌ ముందే రాసుకున్నారు. ఆర్టిస్టులకు చాలా ఈజీ అవుతుంది. 
రాజుగారిగది సినిమాకి, ఈ పార్ట్‌2కి సంబంధమే లేదు. ఆ టైటిల్‌ తీసుకోవడానికి కారణం బాగా పాపులర్‌ అయిన సినిమా. ఆ జోనర్‌ అందరికీ తెలిసింది. అందుకే ఆ టైటిల్‌ పెట్టడం జరిగింది. 
మెంటలిస్ట్‌ క్యారెక్టర్‌ నాది. రియల్‌ లైఫ్‌లో అలాంటివారిని ఇద్దరు, ముగ్గుర్ని కలిసాను. వాళ్ళకి ఎక్స్‌ట్రా సెన్సరీ పవర్స్‌ వుంటాయి. మీ మనసులో వున్నది ఈజీగా కనిపెట్టేస్తారు. నిజంగా చెప్తున్నారా, అబద్ధం చెప్తున్నారా అనేది వాళ్ళకి తెలిసిపోతుంది. ఒక పది ప్రశ్నలు అడిగి మీ మనసులో ఏమనుకుంటున్నారో చెప్పేస్తారు. అదేమీ మ్యాజిక్‌ కాదు, అబ్జర్వేషన్‌ పవర్స్‌ చాలా ఎక్కువ. మిర్రర్‌ మెమరీ వుంటుంది. ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం జరిగింది వాళ్ళ మెమరీలో సేవ్‌ అయిపోతుంది. ఎప్పుడు అవసరమైతే అప్పుడు కంప్యూటర్‌లోలా దాన్ని బయటికి తీస్తారు. ఒరిజినల్‌గా ఒక మెంటలిస్ట్‌ క్యారెక్టర్‌ని పట్టుకొని తీశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com