దుబాయ్ పోలీసులు కొత్త ఆన్ లైన్ సర్వే..

- October 27, 2015 , by Maagulf
దుబాయ్ పోలీసులు కొత్త ఆన్ లైన్ సర్వే..

మీరు అసంతృప్తిగా ఉన్నారా? అయితే మీకు మేం కాల్ చేస్తాం అంటున్నారు దుబాయ్ పోలీసులు. 2021 నాటికి ప్రపంచంలోని టాప్ టెన్ సంతోషకరమైన నగరాల జాబితాలో చోటు సంపాదించే ఉద్దేశంతో దుబాయ్ పోలీసులు ఈ మేరకు కొత్త ఆన్ లైన్ సర్వే చేపట్టారు. ఈ సర్వే ప్రకారం మీరు ఆనందంగా ఉన్నారా? మాములుగా ఉన్నారా? బాధగా ఉన్నారా? అని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఆన్ లైన్ సర్వేలో ఎవరైనా తాము అసంతృప్తిగా ఉన్నట్టు ఆప్షన్ ఎంపిక చేస్తే.. వారికి పోలీసులు కాల్ చేసి మాట్లాడనున్నారు. వారి అసంతృప్తికి కారణాలు తెలుసుకోనున్నారు. ఇప్పటికే దుబాయ్ చాలా రంగాల్లో పేరుగాంచింది. ప్రపంచంలో అత్యంత ఎత్తైన కట్టడమూ ఇక్కడే ఉంది. ఈ నేపథ్యంలో ఆనందకరమైన నగరాల జాబితాలో అగ్రస్థానంలో ఉండాలని ప్రయత్నిస్తున్నది. అయితే ఇందుకు నిర్వహిస్తున్న ఈ సర్వేలో ఎవరైనా అసంతృప్తిగా ఉన్నామని చెప్తే వారికి పోలీసులు కాల్ చేయడం ఏమిటని పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 'ద హ్యాపీనెస్ ఇండస్ట్రీ: హై ద గవర్న్ మెంట్ అండ్ బిగ్ బిజినెస్ సోల్డ్ అస్ వెల్-బియింగ్' రచయిత విలియమ్ డేవిస్ ఈ సర్వేపై స్పందిస్తూ 'ఇది ప్రజలను భయపెట్టే సర్వేలా నాకు అనిపిస్తున్నది. ఎవరైనా పొరపాటున తాము అసంతృప్తిగా ఉన్నామంటే.. 'ఏంటి సంగతి' అని పోలీసుల నుంచి వారికి కాల్ రావడం ఒక రకంగా భయపెట్టేదే' అని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com