వీడెవడు సినిమా రివ్యూ

- September 15, 2017 , by Maagulf
వీడెవడు సినిమా రివ్యూ

సచిన్‌, ఈషా గుప్తా, కిషోర్‌ తదితరులు.
తాతినేని సత్య
రైనా జోషి
ఎస్ .ఎస్ .తమన్

మౌనమేలనోయి చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సచిన్ "ఒరేయ్ పండు" "నీజతగా నేనుండాలి " "వీరప్పన్ " చిత్రాలతో తన దైన ప్రతిభను కనబరుస్తూ ఇప్పుడు "వీడెవడు " చిత్రంతో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. "ఎస్ .ఎం .ఎస్" "భీమిలి కబడ్డీ జట్టు " వంటి వైవిధ్యమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన తాతినేని సత్య ఈ మూవీ కి డైరెక్టర్ కావడం తో ఈ మూవీ ఫై కాస్త అంచనాలు ఏర్పడ్డాయి. మరి సత్య, సచిన్ కలిసి ప్రేక్షకులను ఎలా అలరించారనేది ఇప్పుడు చూద్దాం.
సత్య (సచిన్ జోషి) మంచి కబడ్డీ ప్లేయర్..గోవాలో కబడ్డీ పోటీలకు వెళ్లగా అక్కడ శ్రుతి(ఈషా గుప్తా) ను ఓ ప్రమాదం నుండి కాపాడతాడు. ఆ తర్వాత వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడుతుంది..అది కాస్త ప్రేమగా మారడం తో ఇద్దరు పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. వీరి ప్రేమను కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకోవడం తో పెళ్లి జరిగిపోద్ది..పెళ్లైన రెండో రోజే శ్రుతి హత్య కు గురైయ్యింది.
దీంతో అందరూ సత్య నే ఈ హత్య చేసాడని అనుకుంటారు. పోలీసులు సైతం సత్య ను అరెస్ట్ చేసి జైలు కు తరలిస్తారు..ఇక జైలు లో ఓ పోలీస్ ఆఫీసర్ సత్య ను చంపడానికి ట్రై చేస్తాడు..ఇంతకు శ్రుతి ని చంపింది ఎవరు..? సత్య ను పోలీస్ ఆఫీసర్ ఎందుకు చంపాలనుకుంటాడు..? జైలు నుండి సత్య బయటకు వస్తాడా..రాడా అనేది మీరు తెర ఫై చూడాల్సిందే.
* కథ
* సెకండ్ హాఫ్ వరకు సాగే సస్పెన్స్
* సచిన్
* ఈషా గుప్తా, సచిన్ ల లవ్ ట్రాక్
* కథనం
* అక్కడక్కడ బోరింగ్ సన్నివేశాలు
* థమన్ మ్యూజిక్
* సచిన్ నటన చాల కొత్తగా కనిపించింది..నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో బాగా నటించాడు. సత్య క్యారెక్టరైజేషన్ చాలా బాగా డిజైన్ చేశాడు దర్శకుడు..ఆ పాత్ర కు పూర్తి న్యాయం చేసి సక్సెస్ అయ్యాడు సచిన్.
* హీరోయిన్ ఈషా గుప్తా చాల హాట్ గా కనిపించింది. సచిన్ , ఈషా ల మధ్య వచ్చే హాట్ హాట్ సన్నివేశాలను యూత్ బాగా ఎంజాయ్ చేయవచ్చు. తన పాత్ర మేరకు బాగానే నటించింది.
* హీరోయిన ఫ్రెండ్ పాత్రలో నటించిన ధన్య బాలకృష్ణన్ ఆకట్టుకుంది.
* శ్రీనివాస్ రెడ్డి కామెడీ బాగా వర్క్ అయ్యింది. థియేటర్స్ లలో నవ్వులు పోయించాడు.
* విలన్ పాత్రలో కనిపించిన సుప్రీత్‌, ఇన్‌వెస్టిగేటివ్ ఆఫీసర్ పాత్రలో కనపడ్డ కిషోర్ బాగా చేసారు.
* సెల్ఫీ రాజుగా వెన్నెలకిషోర్ తనదయిన పంచ్ లతో కామెడీ పండించాడు.
* మిగతా నటి నటులు వారి వారి పాత్రల మేరకు బాగానే చేసారు.
* ముందుగా థమన్ అందించిన మ్యూజిక్ పెద్దగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ , బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాల బాగా ఇచ్చాడు.
* బినేంద్ర మీనన్ సినిమాటోగ్రఫీ సినిమాకు హైలైట్ గా నిలిచింది. యాక్షన్ సీన్స్ చిత్రీకరణ సన్నివేశాలు, కబడ్డీ ఫైట్ చిత్రీకరణలో తనదయిన పనితనాన్ని నిరూపించి సక్సెస్ అయ్యాడు బినేంద్ర మీనన్ .
* ప్రవీణ్ పూడి ఎడిటింగ్ అక్కడక్కడ కాస్త బోర్ కొట్టించింది, మిగతా అంత బాగానే నడిపించాడు.
* ఇక డైరెక్టర్ తాతినేని సత్య విషయానికి వస్తే తన ప్రతి సినిమాలో స్పోర్ట్స్ ఫై శ్రద్ద పెడతాడు.. ఈ మూవీ లో కూడా అలాగే కబడ్డీ ఫై పెట్టాడు..దానికి క్రైం ను జోడి చేసాడు. పెళ్లైన రెండో రోజే భార్య చనిపోవడం , ఆ చంపింది ఎవరో తెలియకుండా కథ ను నడిపించి సక్సెస్ అయ్యాడు. క్రైమ్ థ్రిలర్ అనే కాన్సెప్ట్‌పై కథను రాసుకొని సక్సెస్ అయ్యాడు. సెకండాఫ్ మధ్య వరకు హీరోయిన్ ను చంపింది ఎవఱోనే ట్విస్టును రివీల్ చేయకుండా కథను నడపడం ద్వారా దానిపై మంచి ఉత్కంఠ క్రియేట్ అయింది.
చాల రోజుల తర్వాత సచిన్ నుండి సరికొత్త చిత్రం చూసి హ్యాపీ గా ఫీల్ అవొచ్చు..సస్పెన్స్ ను ఇష్టపడే వారికీ ఈ మూవీ బాగా నచ్చుతుంది. సినిమా మొదలు అయినా కొద్దీ సేపటికే హీరోయిన్ చనిపోవడం , ఆమెను ఎవరు చంపింది అనేది సెకండ్ హాఫ్ మధ్య వరకు కూడా సస్పెన్స్ గా సాగడం తో ప్రేక్షకులు త్రిల్ గా భావిస్తారు. ఓవరాల్ గా అందరికి నచ్చే సస్పెన్స్ థ్రిల్లర్

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com