మెడ భుజాలకు వ్యాయామం.. ఆకర్ణ ధనురాసనం

- October 04, 2017 , by Maagulf
మెడ భుజాలకు వ్యాయామం.. ఆకర్ణ ధనురాసనం

సాధారణంగా ఆఫీసుల్లో పని చేసేవారు కొన్ని గంటలపాటు ఒకే స్థితిలో కూర్చుని పని చేస్తుంటారు. ఎక్కువ గంటలు కూర్చుని పనిచేసేవారికి మెడ భుజాల్లో కండరాలు పట్టేయటం, నొప్పులు లాంటి సమస్యలు ఉంటాయి. మెడ భుజాలకు సంబంధించిన బాధలు తరచుగా వస్తుంటాయి. ఈ భాగాలు విపరీతమైన ఒత్తిడికి గురవుతాయి. క్రమంతప్పకుండా వీటికి ఉపశాంతినిచ్చే ఆసనాలు, వ్యాయామం సాధన చేస్తుంటే దీర్ఘకాలిక సమస్యల బారిన పడకుండా ఉండొచ్చు. అలాంటిదే ఈ ఆకర్ణ ధనురాసనం. 
 
రెండుకాళ్లూ దగ్గరగా ఉంచి నిటారుగా నిలబడాలి. చేతులను భుజాల నుండి పక్కలకు చాపాలి. కుడికాలిని ఒక అడుగు ముందుకు వేయాలి. ఇప్పుడు చేతులను ముందుకు తీసుకువచ్చి కళ్లకు సమాంతరంగా ఉంచాలి. చేతుల పిడికిళ్లు బిగించి ఉంచాలి. తలని కుడికాలి వైపు తిప్పి ఉంచాలి. 
 
ఇప్పుడు శ్వాస తీసుకుంటూ… బాణాన్ని లాగుతూ చేతిని వెనక్కు తీసుకుని వెళ్లినట్టుగా… ఎడమచేతిని వెనక్కు తీసుకుని వెళ్లి పిడికిలి చెవి దగ్గరకు వచ్చేలా ఉంచాలి. తలను కాస్త వెనక్కు వంచి కుడిచేతిని చూస్తున్నట్టుగా ఉంచాలి. ఇప్పుడు శ్వాసని వదులుతూ సాధారణ స్థితికి రావాలి. ఇలాగే చేతులను మార్చి చేయాలి.
 
ఈ ఆసనాన్ని తరచూ వేయడం వల్ల మెడ భుజాలకు వ్యాయామం కలుగుతుంది. ఆకర్ణ ధనురాసనం అలాంటి బాధలనుండి ఉపశమనాన్ని ఇస్తుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com