క్యాబేజి, నిమ్మకాయ సూప్
- October 07, 2017కావలసిన పదార్థాలు: క్యాబేజి (మీడియం సైజు ) - పావుభాగం (నిలువు ముక్కలుగా తరగాలి), ఉల్లిపాయ - ఒకటి (సన్నటి ముక్కలు తరిగి), వెల్లుల్లి రెబ్బలు - మూడు (మెదిపి), అల్లం తురుము - ఒక టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి చిన్నది - ఒకటి (తరిగి), పసుపు - చిటికెడు, ఆలివ్ నూనె - ఒక టేబుల్ స్పూన్, కూరగాయలు ఉడికించిన నీళ్లు - నాలుగు కప్పులు, జీలకర్ర, సోంపు, ధనియాలు (వేగించి పొడి చేయాలి) - ఒక టేబుల్ స్పూన్, ఉప్పు, మిరియాలు - రుచికి సరిపడా, నిమ్మకాయ - ఒకటి.
తయారీ విధానం: ఆలివ్ నూనెను ఒక గిన్నెలో వేడిచేసి పసుపు, ఉల్లిపాయ, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, క్యాబేజి తరుగు వేసి కాసేపు వేగించాలి. తరువాత ఉప్పు కొద్దిగా వేసి ఐదు నిమిషాలు ఉడికించి అర టేబుల్ స్పూన్ మసాలా పొడి వేసి బాగా కలపాలి. ఇందులో ఉడికించిన కూరగాయల నీళ్లు పోసి, ఉప్పు, మిరియాలు వేసి మరో పది నిమిషాలు ఉడికించాలి. మిగతా మసాలా పొడి వేసి మూత పెట్టి నాలుగు నిమిషాలు ఉడికించాక సూప్‌ను సర్వింగ్ గిన్నెలో పోసుకోవాలి. నిమ్మకాయ రసం పిండుకుని వేడివేడిగా తాగితే ఆహా అనాల్సిందే.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్‌సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ