ఉల్లికాడలు, పాలు సూప్
- October 10, 2017కావలసిన పదార్థాలు: ఉల్లి కాడలు - 2 కట్టలు, ఉల్లి తరుగు - పావు కప్పు, తరిగిన వెల్లుల్లి - 2 రేకలు, ఆలివ్ నూనె - 2 టీ స్పూన్లు, చిక్కటి పాలు - అరకప్పు, నీళ్లు / వెజిటెబుల్ స్టాక్ - 1 కప్పు, ఉప్పు - రుచికి తగినంత, మెదిపిన మిరియాలు - 1 టీ స్పూను.
తయారుచేసే విధానం: ఉల్లికాడల్ని శుభ్రం చేసి కింద భాగాన్ని, పై భాగాన్ని విడి విడిగా కట్ చేయాలి. ఆలివ్ నూనెలో వెల్లుల్లి, ఉల్లి, కాడల (కింద భాగం) తరుగు ఒకటి తర్వాత ఒకటి దోరగా వేగించాలి. ఇప్పుడు కాడల (పైభాగం) తరుగు వేసి రంగు మారకుండా వేగించి దించేయాలి. చల్లారిన తర్వాత పేస్టులా చేసుకుని పాలు, నీరు/ వెజిటబుల్ స్టాక్‌లతో కలిపి 7 నిమిషాలు మరిగించాలి. ఉప్పు, మిరియాలపొడి కలిపి నేతిలో వేగించిన బ్రెడ్ ముక్కలతో అలంకరించుకుని తాగాలి.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్‌సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ