పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్‌ఖాన్‌కు నాన్‌బెయిలబుల్ అరెస్టు వారెంట్
- October 12, 2017పాకిస్థాన్ మాజీ క్రికెటర్, పాకిస్థాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీ చైర్మన్ ఇమ్రాన్ ఖాన్‌కు ఇవాళ ఆ దేశ ఎన్నికల సంఘం నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. కోర్టు ధిక్కరణ కేసులో ఎన్నికల సంఘం ఈ ఆదేశాలు ఇచ్చింది. పెండింగ్ కేసులో ఇమ్రాన్ ఖాన్ వరుసగా కోర్టుకు హాజరుకావడం లేదు. కోర్టుకు రాలేకపోతున్నట్లు కూడా ఇమ్రాన్ రాతపూర్వక క్షమాపణ ఇప్పటి వరకు ఇవ్వలేదు. దీంతో ఈ కేసులో ఇవాళ ఎన్నికల సంఘం ఇమ్రాన్‌కు నాన్‌బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఈనెల 26వ తేదీన జరగనున్న విచారణకు ఇమ్రాన్‌ను పట్టుకు రావాలని కోర్టు ఆదేశించింది. పార్టీ వ్యవస్థాపక సభ్యుడు అక్బర్ వేసిన కేసులో ఇమ్రాన్‌పై ఈ ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల సంఘం అక్రమాలకు పాల్పడినట్లు గతంలో ఇమ్రాన్ ఆరోపణలు చేశారు. ఆ కేసులోనే ఈ విచారణ కొనసాగుతున్నాయి.
తాజా వార్తలు
- T20 ప్రపంచకప్...బ్రాండ్ అంబాసిడర్‌గా బోల్ట్
- తెలంగాణ రాష్ట్రంలో వేర్వేరు రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి
- ఇళ్ల మరమ్మతులకు Dh2 బిలియన్ ఫండ్
- ఈజిప్షియన్లకు వర్క్ పర్మిట్ జారీ నిలిపివేత..!
- విదేశీ కార్మికుల కోసం బహ్రెయిన్‌లో కొత్త చట్టం..!
- హాస్పిటల్లో చేరిన కింగ్ సల్మాన్..!
- ఒమన్ లో 'ఎక్స్చేంజ్ యువర్ ల్యాండ్' ప్రారంభం
- ఏప్రిల్ 16న విధించిన ట్రాఫిక్ జరిమానాలు రద్దు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..