సెల్ ఫోన్ లో వీడియో తీసుకొంటూ డ్రైవింగ్ చేస్తున్న ఇద్దరు సౌదీ పౌరులు దుర్మరణం

- October 12, 2017 , by Maagulf
సెల్ ఫోన్ లో వీడియో తీసుకొంటూ డ్రైవింగ్ చేస్తున్న ఇద్దరు సౌదీ పౌరులు దుర్మరణం

రియాధ్: మన దేశంలో కుర్రాళ్ళు ద్విచక్రవాహనాల మీద వింత వింత ఫీట్లు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకొటుంటే..  సౌదీ యువకులు తామేమి తక్కువ కాదని వేగంగా తమ కార్లను నడుపుతూ మరోవైపు మొబైల్ లో వీడియోలు తీసుకొంటూ ప్రమాదాలకు గురై తనువు చాలిస్తున్నారు. సౌదీ అరేబియాకు చెందిన ఇద్దరు స్నేహితులు అల్ రేయాన్, అల్ బిషాహ్ నగరాలను కలుపుతున్న రహదారిపై కారులో వేగంగా దూసుపోతున్నారు. ఒకరు కారును నడుపుతుండగా.. మరో స్నేహితుడు మొబైల్‌లో వీడియోను తీస్తున్నాడు. వారిద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ కారులో కేరింతలు కొడ్తూ మరింత వేగాన్ని పెంచి తీసిన వీడియోలో డ్రైవ్ చేస్తున్న తానూ ఎలా ఉన్నానో చూద్దామని ముందున్న రోడ్డుపై దృష్టిని మరల్చి మొబైల్ లోనికి తొంగిచూసాడా డ్రైవింగ్ చేస్తున్న యువకుడు..అంతే ఎదురుగా వస్తన్న భారీ వాహనం  .   భయంకరమైన కారు ప్రమాదంలో ఇద్దరు యువకులు మరణించిన సంఘటన సౌదీలో కలకలం రేపుతోంది. ఈ ఘటన జరిగిన స్థలంలో దొరికిన ఫోన్‌లో కనిపించిన ఓ వీడియో ఈ ప్రమాదానికి కారణమేంటో తెలియజేసింది. ఓ స్నేహితుడు అయితే ఆ సమయంలో కారును నడిపే యువకుడు డ్రైవింగ్‌పై దృష్టిపెట్టకుండా.. మొబైల్‌లో చూస్తూ కేరింతలు వేయడంతో.. ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని ఏమాత్రం గమనించలేకపోయాడు. దాంతో యువకుల కారు ముందున్న వాహనాన్ని ఢీకొట్టడంతో కారు అనేక పల్టీలు రోడ్డుపై  కొట్టింది. తీవ్రమైన గాయాలు కావడంతో అక్కడక్కడే  ప్రాణాలు కోల్పోయారు. ఆ సౌదీ యువకుల  శరీర భాగాలు నుజ్జునుజ్జయిపోయాయి. సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు.. అక్కడ దొరికిన ఫోన్‌లో ఓ వీడియోను చూశారు. దీంతో కారు నడుపుతూ వీడియో తీయడం వల్లే ఈ దారుణం జరిగిందని నిర్ణయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘోర ప్రమాదం తర్వాత  ఆ యువకుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఫోన్‌లో ఉన్న వీడియో బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కారును నడుపుతూ మొబైల్‌ను వాడటం వల్లే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని పేర్కొంటూ రియాధ్ పోలీసు శాఖ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com