కువైట్ ఆయిల్ కంపెనీ బుర్గాన్ క్షేత్రంలో అగ్ని ప్రమాదం నల్గురు కార్మికులకు గాయాలు
- October 12, 2017కువైట్ : కువైట్ ఆయిల్ కంపెనీకి చెందిన బుర్గాన్ చమురు క్షేత్రంలోని నిర్మాణ స్థలంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు గాయపడ్డారని కె.ఒ.సి అధికారి గురువారం తెలిపారు.కువైట్ ఆయిల్ కంపెనీకి చెందిన అధికార ప్రతినిధి మరియు ప్రస్తుత డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఫర్ ఫైనాన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ మెహహీ అల్-ఎనిజీ వివరిస్తూ, బుర్గాన్ లో బుధవారం సాయంత్రం 6: 50 సమయంలో కార్మికులు ఒక పనిచేసే స్థలంలో సంభవించిన అగ్నిప్రమాదంలో నలుగురు కార్మికులు గాయపడ్డారు. కాలిన గాయాలతో ఉన్నవారిని అహ్మది ఆసుపత్రికి వెంటనే తరలించినట్లు ప్రస్తుతం వారికి అక్కడ మెరుగైన చికిత్స పొందుతున్నారని ఆయన కువైట్ ఆయిల్ కంపెనీ ట్విట్టర్ ఖాతాలో తెలిపారు. కువైట్ ఆయిల్ కంపెనీకి చెందిన సంబంధిత అగ్ని నియంత్రణ బృందాలు తక్షణమే ఆ ప్రదేశానికి తరలించామని, ఆ తరువాత కంపెనీని అనుసరిస్తున్న విధానాలకు అనుగుణంగా వ్యాపించకుండా ఆ అగ్నిని సమర్ధవంతంగా నియంత్రించామని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- బుల్లెట్ ప్రూఫ్ కారులో కనిపించిన సల్మాన్ ఖాన్
- హైదరాబాద్‌లో జోరు వాన..
- హిందూపురంలో నందమూరి బాలకృష్ణ నామినేషన్
- యూఏఈ వర్షాల్లో ముగ్గురు మృతి..!
- వరదల కారణంగా టైఫాయిడ్, డెంగ్యూ కేసుల పెరుగుదల..!
- రుణాల చెల్లింపునకు సహెల్ యాప్‌లో కొత్త ఫీచర్
- దెబ్బతిన్న ఇళ్లకు ఉచితంగా మరమ్మతులు… ఎమ్మార్
- మహిళను వేధించినందుకు ప్రవాసికి 5 సంవత్సరాల జైలు
- ఖతార్‌లో భారతీయ బైకర్‌కు సత్కారం
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్