జీలకర్ర నీటిని తాగండి.. జలుబును దూరం చేసుకోండి..

- October 12, 2017 , by Maagulf
జీలకర్ర నీటిని తాగండి.. జలుబును దూరం చేసుకోండి..

రోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు ఒక గ్లాసు జీలకర్ర కలిపిన గోరువెచ్చని నీటిని తాగడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఎందుకంటే జీలకర్రలో ఉండే ఔషధ గుణాలు జీర్ణక్రియని ఉత్తేజపరుస్తాయి. డయాబెటిక్ పేషెంట్లు ఇలా తాగడం షుగర్ అదుపులో ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాదు బి.పి.ని కూడా అదుపు చేసే గుణాలు జీలకర్రకు ఉన్నాయంటున్నారు. 
 
జీలకర్రలో ఐరన్, ఫైబర్‌లు అధికంగా ఉండటం వల్ల గర్భిణీ మహిళలు ఈ నీటిని తాగడం మంచిది. ఈ నీటిని సేవించడం ద్వారా రోగనిరోధకశక్తి కూడా పెరుగుతుంది. మూత్రపిండాలు ఎక్కువగా ప్రభావం చెందుతాయని అందువల్ల అనవసరమైన టాక్సిన్లు బయటకు పంపేందుకు సహాయపడుతుంది. 
 
అలాగే జీలకర్ర యాంటీ-సెప్టిక్ కారకాలను కలిగి ఉండటం ద్వారా జలుబు ఫ్లూలను కలుగచేసే కారకాలకు నశింపజేస్తుంది. ఒక కప్పు నీటిలో జీలకర్ర, అల్లం, తులసి ఆకులను కలుపుకొని మరిగించి వడిగట్టుకోవాలి. ఆపై తేనెను కలిపి తాగటం వలన జలుబు నుండి ఉపశమనం కలుగుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com