'రాజుగారి గది - 2' రివ్యూ

- October 13, 2017 , by Maagulf
'రాజుగారి గది - 2' రివ్యూ

నాగార్జున- సమంత- శీరత్‌కపూర్ కాంబినేషన్‌లో శుక్రవారం భారీ ఎత్తున తెలుగు రాష్ర్టాల్లో రిలీజైన మూవీ 'రాజుగారి గది2'. టాలీవుడ్‌లో ఇప్పటివరకు హారర్ జోనర్‌లో స్టార్స్ నటించిన సందర్భం లేదు. ఆ తరహా మూవీలను చేయడానికి హీరోలు అంగీకరించిన దాఖలాలు లేవు. చోటామోటా హీరోలు, క్యారెక్టర్ ఆర్టిస్టులే నటిస్తూ ఉంటారు. మలయాళ సినిమా 'ప్రేతమ్' స్టోరీ ఆధారంగా దీన్ని తెరకెక్కించారు. తొలి వెర్షన్‌ డైరెక్ట్ చేసిన ఓంకార్.. ఈ సీక్వెల్ వెర్షన్‌ను హ్యాండిల్ చేశాడు. మరి రివ్యూ ఎలావుందో ఓ లుక్కేద్దాం..

స్టోరీ...
వెన్నెల కిషోర్ (కిషోర్), ప్రవీణ్ (ప్రవీణ్), అశ్విన్ (అశ్విన్‌)లు మంచి ఫ్రెండ్స్. వీళ్లంతా కలిసి బీచ్ దగ్గర రాజుగారికి చెందిన ఓ రిసార్ట్‌ని కొనుగోలు చేస్తారు. ఇందులో దెయ్యం వున్న సంగతి వీళ్లకి తెలీదు. రిసార్ట్‌ని కొనుగోలు చేసిన తర్వాత తెలుస్తోంది.

ఆ ఘోస్ట్‌లను పట్టుకోవడానికి ఈ ముగ్గురు చర్చి ఫాదర్(నరేష్)ని కలుస్తారు. ఆయన సలహాతో మెంటలిస్ట్ రుద్ర (నాగార్జున) రంగంలోకి దిగుతాడు. తొలుత రుద్రకు సుహానిస(సీరత్‌ కపూర్‌)పై అనుమానం వస్తుంది. ఆ తర్వాత అమృత (సమంత) అనే అమ్మాయి ఆత్మ ప్రతీకారం తీర్చుకుంటుందన్న విషయం తెలుసుకుంటాడు.

సీన్ కట్ చేస్తే.. రాజుగారి రిసార్ట్‌కి వీళ్లకి వున్న సంబంధం ఏంటి? అమృత- సుహానిసల మధ్య రిలేషన్ ఉందా? వీళ్లని రుద్ర ఎలా హ్యాండిల్ చేశాడన్న విషయాలు తెరపై చూడాలి.

విశ్లేషణ...
ఆడ పిల్ల గొప్పతనం గురించి చెప్పడమే కాదు..

సొసైటీలో చెడు ఎదురైనప్పుడు వాటిని ఎలా ఫేస్ చేయాలన్నది అసలు పాయింట్. హారర్‌ కామెడీ నేపథ్యంతో కూడుకున్న మూవీయే అయినా ఓ మంచి సందేశంతో తీర్చిదిద్దాడు డైరెక్టర్. ప్రారంభంలో సాదాసీదాగానే సాగినా.. దెయ్యం ప్రవేశంతో స్టోరీ వూపందుకుంటుంది.

ఫస్టాఫ్ కిశోర్‌, అశ్విన్‌, ప్రవీణ్‌ల మధ్య నార్మల్‌గా సాగుతాయి. కేవలం కొన్ని సన్నివేశాలు మాత్రమే భయపెడతాయి. నాగార్జున ఎంట్రీతో స్టోరీ వేగం పెరిగింది. సెకండాఫ్‌లో మూవీ ప్రధాన బలం సమంత.
 
ఇక నాగార్జున- సమంత మధ్య వచ్చే చివరి 20 నిమిషాల సీన్స్ బాగున్నాయి.

నాగార్జున మోడ్రన్‌ సెయింట్‌ రుద్ర పాత్రలో సెట్టయిపోయాడు. సమంత లా స్టూడెంట్‌గా.. సీరత్‌కపూర్ అందాల ఆరబోత శ్రుతిమించినా, ఆమె నటించిన చాలా సీన్స్ బాగున్నాయి. ఇక అభినయ యాక్టింగ్ ఓకే.

ఏదో ప్రేక్షకుడ్ని భయపెట్టాలంటే దెయ్యాన్ని చూపించాలనే తీరులో కాకుండా కాన్సెప్ట్ ప్రకారం ఆత్మను చూపించాడు. సినిమాటోగ్రఫీ బావుంది.. ప్రతి సీన్ రిచ్‌గా కనపడింది. థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు.

దేవుడ్ని బోనులో నిలబెట్టే అవకాశం వచ్చింది. వెళ్లి గట్టిగా నిలదీయ్‌ అనే డైలాగ్స్ ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతాయి. కామెడీని ఆశించిన ప్రేక్షకుడికి నిరాశే ఎదురవుతుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

స్టార్ హీరోల సినిమాలు లేకపోవడంతో మెల్లగా ఆడేయవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com