మటన్‌ పెప్పర్‌ రోస్ట్‌

- October 14, 2017 , by Maagulf
మటన్‌ పెప్పర్‌ రోస్ట్‌

కావాల్సిన పదార్థాలు
 
(మొదటి దశ)
మటన్‌ : అరకిలో
పసుపు : అర స్పూను
చెక్కా లవంగాలు : ఐదు
యాలకులు : నాలుగు
ఉప్పు : తగినంత
నీళ్లు : సరిపడేన్ని


(రెండో దశ)
ఉల్లి తరుగు : ఒక కప్పు
టొమోటో : రెండు (తరుగు)
అల్లం వెల్లుల్లి పేస్ట్‌ : రెండు స్పూన్లు
పచ్చిమిరపకాయలు : ఆరు (తరుగు)
ధనియాల పొడి : ఒక స్పూను
కారంపొడి : రెండు స్పూన్లు
మిరియాల పొడి : మూడు స్పూన్లు
మెంతులు : అరస్పూను
కొత్తిమీర : (అరకప్పు తరుగు)
ఉప్పు : తగినంత
నూనె : నాలుగు స్పూన్లు
 
 
ఎలా చేయాలి?
 
మటన్‌తో పాటు (మొదటి దశ) పైన చెప్పిన వాటన్నిటినీ వేసి.. కాసిన్ని నీళ్లు పోసి.. ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
కారంపొడి, ధనియాలపొడి, అన్ని దినుసులతో కలిపి మసాలా పేస్టును మిక్సీ ఆడించి సిద్ధం చేసుకోవాలి.
పాన్‌లో నూనె పోసి.. ఉల్లి తరుగును బంగారు వర్ణంలోకి వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోండి. పాన్‌లోకి మళ్లీ ఆయిల్‌ పోసి.. అల్లం వెల్లుల్లి పేస్టును పచ్చి వాసనపోయే వరకు వేగించాలి. సిద్ధం చేసుకున్న మసాలా పేస్టును అందులో వేయాలి. ఆ తరువాత కట్‌ చేసుకున్న టొమోటోలు, పచ్చిమిర్చి ముక్కలు మగ్గే వరకు వేయించాలి. అందులో మిరియాల పొడిని చల్లి బాగా కలపాలి. కరివేపాకు వేసి ఐదు నిమిషాలు వేయించాలి. ఇది వరకే వేయించి పక్కన పెట్టుకున్న ఉల్లి తరుగును కలపాలి. ఆఖర్న ఉడికించి పక్కన పెట్టుకున్న మటన్‌ను అందులో వేసి.. కుక్కర్‌ మూత పెట్టి పది నిమిషాలు మంట మీదే ఉంచాలి. నీళ్లు ఇమిరిపోయి నూనె తేలిన తరువాత దించేస్తే సరి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com