లేత కొబ్బరి జీడిపప్పు సక్కీ
- October 19, 2017కావలసినవి: లేత కొబ్బరి 100 గ్రా., నూనె 30 మి.లీ., తరిగిన ఉల్లిపాయ 50 గ్రా., తరిగిన చిన్నసైజు టొమాటో ఒకటి, కారం ఒక టీ స్పూన్, పసుపు పావు టీ స్పూన్, గరం మసాలా అర టీ స్పూను, అల్లం వెల్లుల్లి ముద్ద అర టీ స్పూను, నానబెట్టిన జీడిపప్పులు 15, ఉప్పు తగినంత, ఒకటిన్నర టేబుల్ స్పూను టొమాటో కెచప్, ఒక కప నీళ్లు, తరిగిన కొత్తిమీర 2 టేబుల్ స్పూను.
ఎలా చేయాలి: కొబ్బరిని సన్నని పొడవైన ముక్కలుగా తరగాలి. బాణలిలో నూనె వేసి మరిగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలను వేసి బంగారు రంగు వచ్చే వరకు వేగించాలి. టొమాటో ముక్కలు వేసి మెత్తగా అయ్యేవరకు కలపాలి. కొబ్బరి ముక్కలు వేసి రెండు నిముషాల పాటు ఉడికించాలి. కారం, పసుపు, మసాలా, అల్లం వెల్లుల్లి ముద్దను వేసి బాగా కలపాలి. జీడిపపలు, ఉప్పు, టొమాటో కెచప్‌లు వేసి కలపాలి. నీళ్లు పోసి సన్నని సెగ మీద ఉడికించాలి. ఆ తర్వాత కిందికి దించి కొత్తిమీరతో అలంకరించాలి. ఇది వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్‌సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ