శ్రీముఖి వల్లే యాంకర్‌గా కొనసాగుతున్నా: బుల్లి తెర యాంకర్ రవి

- October 19, 2017 , by Maagulf
శ్రీముఖి వల్లే యాంకర్‌గా కొనసాగుతున్నా: బుల్లి తెర యాంకర్ రవి

బుల్లి తెర యాంకర్ రవి ఆ మధ్య ఓ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఓ ఆడయో ఫంక్షన్‌ వేడుకకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సమయంలో సీనియర్ నటుడు చలపతి రావు మహిళలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు రవి సూపర్ అంటూ మద్దతు తెలపడం ఈ వివాదానికి కారణమైంది. పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. మహిళా సంఘాలు వారిద్దరిపై కేసులు కూడా నమోదు చేశాయి. ఆ వ్యాఖ్యలు ఉద్దేశపూర్వంగా చేసినవి కావని రవి వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా ఎవరూ వినలేదు. ఆ సమయంలో ఇంట్లో వారితో పాటు,  ఎక్కడికి వెళ్లినా ఇదే ప్రశ్న వేసేవారని దీంతో యాంకరింగ్ నించి విరమించుకోవాలనుకున్నానని రవి చెప్పాడు. అయితే ఆ సమయంలో తోటి యాంకర్లు శ్రీముఖి, సుమ, ప్రదీప్ అండగా నిలిచారని, మేం కూడా ఇలాంటివి ఎదుర్కున్నామని అంత మాత్రం చేత యాంకేరింగ్ నించి విరమించుకోవద్దని ధైర్యం చెప్పారన్నారు. ఆ సమయంలో శ్రీముఖి ఇచ్చిన సపోర్ట్‌ నన్ను మళ్లీ మీ ముందు యాంకర్‌గా నిలబెట్టిందని చెప్పుకొచ్చాడు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com