దహీ కె కబాబ్‌

- October 20, 2017 , by Maagulf
దహీ కె కబాబ్‌

కావల్సినవి: గడ్డ పెరుగు - ఒకటిన్నర కప్పు, కొత్తిమీర కట్ట - ఒకటి, ధనియాలు - అరచెంచా, సెనగపిండి - టేబుల్‌స్పూను, మ్యుసెలీ లేదా కార్న్‌ఫ్లేక్స్‌ - పావుకప్పు, జీలకర్రపొడి - అరచెంచా, యాలకులపొడి - అరచెంచా, ఉప్పు - తగినంత, నూనె - వేయించేందుకు సరిపడా, ఉల్లిపాయ - ఒకటి, వెనిగర్‌ - చెంచా, చిక్కని పెరుగు - అరకప్పు, మిరియాలపొడి - కొద్దిగా.
తయారీ: పెరుగును ఓ గిన్నెలోకి తీసుకుని అందులో ధనియాలపొడీ, సెనగపిండీ, జీలకర్రపొడీ, వెనిగర్‌, కొత్తిమీర తరుగూ, యాలకులపొడీ, తగినంత ఉప్పూ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్నచిన్న పట్టీల్లా చేసుకుని తరవాత మ్యూసెలీ లేదా కార్న్‌ఫ్లేక్స్‌లో అద్దాలి. వీటిని కాగుతోన్న నూనెలో వేసి వేయించుకుని తీసుకోవాలి. దీన్ని ఉల్లిపాయముక్కలు, మిరియాలపొడీ, ఉప్పు వేసిన పెరుగుతో కలిపి వడ్డించాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com