Maa Gulf Pakistani Imam drowns in Ajman sea
అజ్మాన్ సముద్రంలో గల్లంతైన పాకిస్తాన్ మత బోధకుడు

అజ్మాన్ సముద్రంలో గల్లంతైన పాకిస్తాన్ మత బోధకుడు

అజ్మాన్: అజ్మాన్ లో పాకిస్తాన్ ఇమామ్ ( మత బోధకుడు) సముద్రంలో గల్లంతై మృతి చెందినట్లు మృతదేహం సముద్రం ఒడ్డున దొరికినట్లు నివేధిలు పేర్కొన్నాయి. అజ్మాన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సంబంధిత వ్యక్తి నాలుగు రోజుల క్రితం రాస్ అల్ ఖైమా పోలీసు స్టేషన్ తప్పిపోయినట్లుగా ఒక పిర్యాదు సైతం చేయబడినట్లు వారు తెలిపారు. అజ్మాన్ పోలీసులు రాస్ అల్ ఖైమా పోలీసులను సంప్రదించారు. సముద్రంలో లభ్యమైన ఇమామ్ మృతదేహాన్ని గుర్తించడానికి మృతుని కుటుంబ సభ్యులను  తీసుకువచ్చారు. ఎం. హెచ్.ఎస్ గా  గుర్తించబడిన  పాకిస్తాన్ ఇమామ్ మృతి వెనుక  ఏ నేరపూరిత చర్య ఉందొ అనే అనుమానం కుటుంబసభ్యులు వ్యక్తం చేయడంతో ఈ  అనుమానాస్పద మరణంపై పూర్తి విచారణ జరుగుతోంది. రాస్ అల్ ఖైమాలోని అల్ ధైట్ పొరుగు ప్రాంతంలో ఒక మసీదులో ఇమామ్ ( మత బోధకుడు) గా ఆయన పనిచేసేవాడు.