ఫ్రాన్స్‌ అధ్యక్షుడి మీటింగ్‌ను పాడుచేసిన కుక్క

- October 22, 2017 , by Maagulf
ఫ్రాన్స్‌ అధ్యక్షుడి మీటింగ్‌ను పాడుచేసిన కుక్క

ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్‌ మాక్రోన్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఇందుకు కారణం ఆయన ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న పెంపుడు కుక్కే. ఇంతకీ ఏం జరిగిందంటే.. మాక్రోన్‌ ఆదివారం ఎలిసీ ప్యాలెస్‌లో పలువురు మంత్రులు, ప్రభుత్వాధికారులతో సమావేశమయ్యారు.
వారితో సమావేశంలో ఉన్నప్పుడు ఆయన పెంపుడు కుక్క 'నీమో' విచిత్రంగా అరుస్తూ వారి మధ్యకు వచ్చి మూత్రం పోసింది. దాన్ని చూసిన ఓ మంత్రి 'ఇది ఎప్పుడూ ఇలా చేస్తూనే ఉంటుందా?' అని ప్రశ్నించారు. ఇందుకు మాక్రోన్‌ నవ్వుతూ 'నో. నా కుక్కను తప్పుగా అర్థంచేసుకున్నారు.' అని చెప్పారు. ఇక చేసేదేంలేక 'నీమో' అక్కడక్కడే తిరుగుతున్నా మాక్రోన్‌ తన సమావేశాన్ని కొనసాగించారు.
'నీమో' రెండేళ్ల లాబ్రెడార్‌-గ్రిఫ్రిన్‌ జాతికి చెందిన శునకం. దీనిని ఆగస్ట్‌లో మాక్రోన్‌ దంపతులు ఓ రెస్క్యూ సెంటర్‌ నుంచి దత్తత తీసుకున్నారు. అప్పటి నుంచి మాక్రోన్‌ ఎక్కడికి వెళ్లినా 'నీమో' ఆయన వెంటే ఉంటుంది. మీడియా కూడా 'నీమో' ఫొటోలు తరచూ తీస్తుంది.
సమావేశంలో ఇలాంటి ఘటనను మాక్రోనే కాదు ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడునికోలస్‌ సార్కోజీ కూడా ఎదుర్కొన్నారు. ఆయన అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు పెంపుడు కుక్కలు ప్యాలెస్‌లో కొన్ని వేల యూరోలు విలువ చేసే ఫర్నీచర్‌ను ధ్వంసం చేశాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com