త్రిపుర:రివ్యూ

- November 06, 2015 , by Maagulf
త్రిపుర:రివ్యూ

త్రిపుర జానర్ : హారర్ థ్రిల్లర్ యాక్షన్ తారాగణం : స్వాతి, నవీన్ చంద్ర, రావు రమేష్ దర్శకత్వం : రాజ్ కిరణ్ నిర్మాత : ఎ చినబాబు, ఎమ్ రాజశేఖర్ సంగీతం : కమరన్ ఇప్పటి వరకు బబ్లీ క్యారెక్టర్స్ తో కనిపించిన హీరోయిన్ స్వాతి తొలిసారిగా ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటించింది. అదీ టాలీవుడ్ స్క్రీన్ మీద మంచి ఫాంలో ఉన్న హార్రర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన చిత్రం కావటంతో... సినిమా సక్సెస్ పై చిత్ర యూనిట్ చాలా నమ్మకంగా ఉన్నారు. ముఖ్యంగా చిత్ర దర్శకుడు రాజ్ కిరణ్ తెరకెక్కించిన గత చిత్రం గీతాంజలి ఘన విజయం సాధించటంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి అంచనాలకు తగ్గట్టు త్రిపుర ఆడియన్స్ ను ఆకట్టుకుందా.. రివ్యూలో చూద్దాం. కథ : త్రిపుర( స్వాతి) పల్లెటూరిలో ఎంతో ఆనందంగా జీవితం గడిపే అమ్మాయి. ఇక తనకు కాబోయే భార్య ఎలా ఉండాలే ఊహించుకుంటూ కాలం గడుపుతున్న డాక్టర్ నవీన్ చంద్ర. తన ఊహల్లో కనిపించే అమ్మాయిలాగే ఉన్న త్రిపురను చూసి ఇష్టపడ్డ అతడు... ఆమెను పెళ్లి చేసుకొని సిటీకి తీసుకువస్తాడు. ఒక అపార్ట్ మెంట్ లో ఫ్లాట్ అద్దెకు తీసుకొని అక్కడ కాపురం పెడతారు. ఆ తరువాత ఆ ఇంట్లో దెయ్యం ఉందని తెలుసుకున్న ఆ జంట ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది. ఆ ఇంట్లో నుంచి, ఆ దెయ్యం బారినుంచి ఎలా భయపడ్డారు అన్నదే మిగతా కథ. విశ్లేషణ : స్వామిరారా, కార్తీకేయ సినిమాల సక్సెస్ లతో మంచి ఫాంలో ఉన్న స్వాతి మరోసారి అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. తొలి సారిగా టైటిల్ రోల్ ప్లే చేసిన ఈ బ్యూటీ అందుకు తగ్గట్టుగా సినిమాను సక్సెస్ చేయటం కోసం అన్నిరకాలుగా కష్టపడింది. హీరోగా నటించిన నవీన్ చంద్ర తన పాత్ర మేరకు ఆకట్టుకున్నాడు. విలన్ గా రావు రమేష్ మరోసారి తన మార్క్ చూపించాడు. తెలుగు తెర మీద సక్సెస్ ఫుల్ కాంబినేషన్ గా పేరున్న హార్రర్, కామెడీలను మరోసారి అద్భుతంగా ప్రజెంట్ చేశాడు దర్శకుడు రాజ్ కిరణ్. హర్రర్ సినిమాలో కావాల్సిన అన్ని రకాల థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ను పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేశాడు. అయితే ఇప్పటికే ఈ జానర్ లో చాలా సినిమాలు రావటంతో పెద్దగా కొత్తదనమేమి కనిపించలేదు. సప్తగిరి చేసిన కామెడీ అక్కడక్కడా బాగానే వర్క్ అవుట్ అయిన చాలా వరకు రొటీన్ గా అనిపించింది. కెమారా వర్క్ సినిమా పరిథి మేరకు ఆకట్టుకున్నా, హార్రర్ సినిమాకు ప్రాణం లాంటి నేపథ్య సంగీతం మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. వెలిగొండ శ్రీనివాస్ అందించిన స్క్రీన్ ప్లే సినిమాకు హైలెట్ గా నిలిచింది. ప్లస్ పాయింట్స్ : స్వాతి పర్ఫామెన్స్ స్క్రీన్ ప్లే కామెడీ మైనస్ పాయింట్స్ రొటీన్ జానర్ సంగీతం సెకండాఫ్ లో కొన్ని సన్నివేశాలు ఓవరాల్ గా 'త్రిపుర' హార్రర్ సినిమా అభిమానులను అలరించినా, స్వాతి కెరీర్ లో హ్యట్రిక్ సక్సెస్ ను మాత్రం ఇవ్వలేకపోయింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com