రాజశేఖర్ నటించిన గరుడవేగ రివ్యూ

- November 03, 2017 , by Maagulf
రాజశేఖర్ నటించిన గరుడవేగ రివ్యూ

రివ్యూ : గరుడ వేగ

తారాగణం: రాజశేఖర్, పూజా కుమార్, అరుణ్ అదిత్, నాజర్, శ్రద్దా దాస్, పోసాని కృష్ణ మురళి, కిశోర్, రవి వర్మ, చరణ్ దీప్, సన్నిలియోన్, 30ఇయర్స్ పృథ్వీ, అలీ, అవసరాల శ్రీనివాస్, షియాజీ షిండే, ఆదర్శ్ తదితరులు
ఆర్ట్: శ్రీకాంత్ రామిశెట్టి
ఎడిటింగ్: ధర్మేంద్ర కాకరాల
సంగీతం: శ్రీచరణ్ పాకాల, భీమ్స్
సినిమాటోగ్రఫీ: అంజి
నిర్మాత: కోటేశ్వరరాజు
కథ, దర్శకత్వం: ప్రవీణ్ సత్తారు
విడుదల తేదీ: 03 నవంబర్ 2017

రాజశేఖర్ చాలా కాలం తర్వాత తన ఇమేజ్ కు తగ్గ కథతో సినిమా చేస్తున్నాడు అని ఇండస్ట్రీలో, ఆడియన్స్ లో అంచనాలు క్రియేట్ చేసిన సినిమా గరుడ వేగ. ప్రవీణ్ సత్తారు హాలీవుడ్ స్టైల్లో డైరెక్ట్ చేసిన ఈసినిమా రాజశేఖర్ కు హిట్ ఇస్తుందని టీం మొత్తం చాలా కాన్ఫిడెంట్ గా చెప్పింది. ట్రైలర్ కూడా ఈసినిమా రొటీన్ ట్రాక్ కు దూరంగా వెళ్తుందనే బజ్ క్రియేట్ చేసింది. దీంతో ఈసినిమా తెలుగు జేమ్స్ బాండ్ తరహా కథగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ ప్రవీణ్ సత్తారు మిషన్ రాజశేఖర్ కు సక్సెస్ ఇచ్చిందా?

కథ:
చంద్రశేఖర్(రాజశేఖర్) NIA ఆఫీసర్. ఓ మర్డర్ కేసును డీల్ చేసే క్రమంలో అతనికి కొన్ని సంఘటనలు ఎదురవుతాయి. ఆ హత్య, ఆ మర్డర్ వెనుక సంఘటలు అన్ని నిరంజన్ అయ్యర్(అరుణ్ అదిత్) తో ముడిపడి ఉంటాయి. అతన్ని అరెస్ట్ చేసే క్రమంలో దేశసంపదను కొల్లగొడుతోన్న రాజకీయ ముఠా గురించి తెలుస్తుంది. రక్షణ, ఆర్దిక, మైనింగ్ శాఖలు కలిసి సాగించే కుంభకోణాన్ని బట్టబయలు చెయ్యడానికి చంద్రశేఖర్ సాగించే పోరాటంలో అతనికి బోల్డన్ని సమస్యలు ఎదురవుతుంటాయి. గవర్నమెంట్ తోనే పోరాడాల్సిన పరిస్థితి వస్తుంది. ఫ్యామిలీ కూడా చిక్కుల్లో పడుతుంది. ఆ ఫైట్ లో చంద్రశేఖర్ కు సపోర్ట్ గా నిలబడింది ఎవరు? గద్దెపై కూర్చున్న రాబందులను బోన్ లో పెట్టడానికి శేఖర్ సాగించిన పోరాటంలో అతను తన ఫ్యామిలీని కాపాడుకున్నాడా? లేదా? అతనికి ఎదురైన అనుభవాలు ఏంటి? అనేది మిగిలిన కథ

విశ్లేషణ:
ప్రవీణ్ సత్తారు సినిమా సినిమాకు ఓ న్యూ యాంగిల్ ను ప్రజెంట్ చేస్తూ, తన మేకింగ్ తో ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాడు. ఒకదానికొకటి సంబంధం లేని కథలను ఎంచుకుని సర్ ప్రైజ్ చేస్తూనే ఉంటాడు. పి.ఎస్.వి.గరుడ వేగ సినిమాతోనూ ఆ మార్క్ ను కంటిన్యూ చేశాడు. NIA ఆఫీసర్స్ చేసే ఆపరేషన్స్, గవర్నమెంట్ ప్రెషర్ ను తట్టుకుని వాళ్లు దేశభద్రతకు ఎంతగా పాటుపడతారు అనే విషయాన్ని పవర్ ఫుల్ స్క్రీన్ ప్లేతో చాలా థ్రిల్లింగ్ గా చెప్పాడు ప్రవీణ్ సత్తారు. గరుడవేగతో హాలీవుడ్ స్టైల్ ను తెలుగు కు తీసుకొస్తున్నాడు అని యూనిట్ మెంబర్స్ చెప్పినట్లుగానే, ఈసినిమాను అదే ఫ్లేవర్ లో ప్రజెంట్ చేశాడు. హీరోయిజం ఎస్టాబ్లిష్ మెంట్ కోసం అనసరపు షాట్స్, సాంగ్స్ నింపలేదు.  ఎక్కడా సినిమాటిక్ డ్రామాస్, రెగ్యులర్ 70MM ఫార్ములాస్ కు చోటివ్వలేదు. సినిమాను చాలా వేగంగా నడిపించాడు. కోవర్ట్ ఆపరేషన్స్ లో NIA ఆఫీసర్స్ తమ లైఫ్ ను పణంగా పెట్టి ఎంత శ్రద్దగా డ్యూటీ చేస్తారు అనే వాటిని చాలా బాగా ప్రజెంట్ చేశాడు. ఎన్ క్రిప్టెడ్ మెసేజెస్ ను డీకోడ్ చేసే అంశాలాంటి చిన్న చిన్న విషయాలను కూడా పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేశాడు. గరుడవేగ సినిమా కోసం చాలా హెం వర్క్ చేసినట్లు కనిపిస్తుంది. స్టార్టింగ్ టు ఎండింగ్ అదే టెంపోను మెయింటైన్ చేస్తూ సినిమాను రన్ చేశాడు. ఫస్టాఫ్ ఆపరేషన్ సీన్స్ తో చాలా ఫాస్ట్ గా రన్ అయితే, సెకండాఫ్ 30ఇయర్స్ పృధ్వీ కామెడీ ట్రాక్ అందులో ఇమడలేకపోయింది. అయితే ఆ ట్రాక్ సన్నిలియోన్ ఇంట్రడక్షన్ కోసం రాసింది కాబట్టి, ఆవెంటనే డియో డిస్క్ మొదలై ధియేటర్లు గోలకు కేరాఫ్ అవుతాయి. సో అవుట్ అండ్ అవుట్ గా స్టార్టింగ్ టు ఎండింగ్ గరుడవేగ మిషన్ చాలా థ్రిల్లింగ్ గా సాగుతుంది. అలాగే పొలిటికల్ లీడర్స్ అధికారం చాటున చక్కబెట్టుకునే వ్యవహారాలు, ప్రజాసంపదను దోచుకుతినే దోపిడివిధానాలను టచ్ చేశాడు.  ఇక నటీనటుల విషయానికొస్తే రాజశేఖర్ NIA ఆఫీసర్ క్యారెక్టర్ లో బాగానే నటించాడు. తన వయసుకు కొంచెం కష్టమైనా ఫైట్స్ అవీ బాగానే చేశాడు. పవర్ ఫుల్ క్యారెక్టర్ లో తన మునుపటి ఫ్లెక్సిబిలిటీ ప్రదర్శించలేకపోయినా, క్యారెక్టర్ కు ఫిట్ గానే కనిపిస్తాడు. మేకప్ మెన్ మాత్రం రాజశేఖర్ ఏజ్ ను మొహంలో దాచిపెట్టలేకపోయాడు. ఇక రాజశేఖర్ తర్వాత సినిమాకు లీడ్ క్యారెక్టర్ అరుణ్ అదిత్. ఫస్టాఫ్ లో కొంచెం సస్పీషియస్ గా కనిపించినా, గరుడవేగ మిషన్ గురించి రివీల్ చేసే విషయాలు, శాటిలైట్ ను కూడా హ్యాక్ చేసి రాజకీయనాయకులు దేశసంపదను ఎలా దోచుకుంటున్నారో తెలిపే విషయాలు సినిమా కథను మలుపుతిప్పుతుంది కాబట్టి, అదిత్ క్యారెక్టర్ లో కూడా ఆ హీరోయిజం ఫ్లేవర్ కనిపిస్తుంది. దేశ సంపదను దోచుకుతినే కన్నింగ్ పొలిటీషియన్ గా షియాజీ షిండే, అధికారం దూరమై పదవికోసం కోట్లు ఖర్చుపెట్టే సగటు రాజకీయనేతగా పోసాని కృష్ణమురళి కూడా బాగానే చేశారు. పూజా కుమార్ తన పరిధిమేరకు బాగానే నటించింది. జర్నలిస్ట్ గా శ్రద్దా దాస్ క్యారెక్టర్ కూడా కథకు సరిపోయింది. NIA హెడ్ గా నాజర్ పెర్ఫామెన్స్ ఓకే. రాజకీయనాయకుల మాటున దేశసంపదను తీరం దాటించే పాత్రలో కిశోర్ చాలా క్రుయల్ గా కనిపించాడు. ఇక చరణ్ దీప్, రవి వర్మ, శతృ, ఆదర్శ్ పరిధి మేరకు నటించారు. ఇక ఈసినిమా హాలివుడ్ స్టైల్ లో కనిపించిందంటే టెక్నికల్ సపోర్ట్ వల్లే. అంజి సినిమాటోగ్రఫీ చాలా రిచ్ గా ఉంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు హైలెట్ గా నిలిచింది. యాక్షన్ సీన్స్, ఛేజింగ్ సీక్వెన్స్ లో ఆ మూడ్ ను కంటిన్యూ చెయ్యడంలో సంగీత దర్శకులు సక్సెస్ అయ్యారు. సినిమాలో మెయిన్ హైలెట్  యాక్షన్ కొరియోగ్రఫీ. శతృను వెంటాడే సీన్, అదిత్,రాజశేఖర్ లను చంపడానికి ట్రై చేసే సీన్స్, క్లైమాక్స్ బాంబ్ ఫైటింగ్స్ లో డేవిడ్, సతీష్ స్టంట్స్ హాలివుడ్ మూవీస్ ను రిప్రజెంట్ చేస్తాయి. టోటల్ గా ఈసినిమా రాజశేఖర్ కు చాన్నాళ్ల తర్వాత మంచి విజయాన్ని ఇచ్చిందని చెప్పొచ్చు.

చివరిగా: ప్రవీణ్ సత్తారు మిషన్ సక్సెస్ 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com