గుజరాత్ ఎన్నికల్లో 35 మంది ఎమ్మెల్యేలకు నో చాన్స్ !

- November 17, 2017 , by Maagulf
గుజరాత్ ఎన్నికల్లో 35 మంది ఎమ్మెల్యేలకు నో చాన్స్ !

గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని, ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఉప ముఖ్యంత్రి నితిన్ పటేల్ తో సహ 70 మంది శాసన సభ నియోజక వర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను శుక్రవారం ఆ పార్టీ విడుదల చేసింది. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని మరోసారి సీఎం అభ్యర్థిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని రాజ్ కోట్ పశ్చిమ శాసన సభ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్నారు. జైన్ మతానికి చెందిన విజయ్ రూపాని బీజేపీ గుజరాత్ రాష్ట్ర విభాగం ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్నారు. విజయ్ రూపాని ఎంపీగాను సేవలందించారు. గుజరాత్ ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ మెహ్సనా శాసన సభ నియెజక వర్గం, జీతు వగాని భావ్ నగర్ పశ్చిమ శాసన సభ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్నారు. నవంబర్ 18, 19వ తేదీల్లో బీజేపీ మొదటి విడత జాబితాను విడుదల చేస్తారని ఇంత వరకూ ప్రచారం జరిగింది.

అయితే ఒక్క రోజు ముందుగానే బీజేపీ నాయకులు మొదటి విడత జాబితాను విడుదల చేశారు. గుజరాత్ లో డిసెంబర్ 9, 14వ తేదీల్లో రెండు విడతలుగా శాసన సభ ఎన్నికలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. శుక్రవారం బీజేపీ విడుదల చేసిన 70 మంది జాబితాలో 45 మంది మొదటి విడత (డిసెంబర్ 9), 25 మంది రెండో విడత (డిసెంబర్ 14) లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గుజరాత్ లో గత 22 ఏళ్ల నుంచి బీజేపీ అధికారంలో ఉంది. ప్రస్తుతం గుజరాత్ లో బీజేపీకి 121 మంది శాసన సభ్యులు ఉన్నారు. వారిలో 35 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు మళ్లీ పోటీ చెయ్యడానికి అవకాశం కల్పించడానికి అధిష్టానం నిరాకరించింది. అంతే కాకుండా 6 మంది మంత్రులు మళ్లీ పోటీ చెయ్యడానికి అవకాశం ఇవ్వడం లేదని ప్రచారం జరుగుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com