దొండకాయ వల్ల ఉపయోగాలు.!

- November 19, 2017 , by Maagulf
దొండకాయ వల్ల ఉపయోగాలు.!

వేపుడు, కూరల ద్వారా దొండకాయను డైట్‌లో చేర్చుకుంటూ వుంటాం. అలాంటి దొండకాయలో ఎన్నో ఔషధ గుణాలున్నాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. దొండలో విటమిన్లు, ఖనిజాలు, పీచు పుష్కలంగా వుంటాయి. దొండకాయలను ఆహారంలో చేర్చుకుంటే బరువు తగ్గుతారు. జలుబు, దగ్గు దరిచేరవు. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాల ద్వారా ఇన్ఫెక్షన్లు దూరమవుతాయి. 
 
దొండలోని బి-విటమిన్‌ నాడీవ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది. ఆందోళన, మూర్ఛ వ్యాధులతో బాధపడేవాళ్లకి దొండకాయ మంచి ఔషధంగా పనిచేస్తుంది.  అల్జీమర్స్‌నీ అడ్డుకుంటుంది. ఇందులోని రిబోఫ్లేవిన్‌ ఎక్కువగా ఉండే దొండ మనసును ప్రశాంతంగా ఉంచి, డిప్రెషన్‌ తగ్గడానికి దోహదపడుతుంది.
 
దొండకాయలోని గుణాలు కాలేయం మీద నేరుగా పనిచేస్తాయి. ఫలితంగా శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపించేందుకూ రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గించేందుకూ దోహదపడతాయి. మధుమేహం వచ్చే సూచనలు ఉన్నవాళ్లు దొండని ఆహారంలో భాగంగా చేసుకుంటే చాలావరకూ రాకుండా నియంత్రిస్తుంది. దొండలోని కాల్షియం మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా రక్షిస్తుంది. అదేసమయంలో ఎముక సాంద్రత పెరిగేందుకూ తోడ్పడుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com