ముఖం మీద ఏర్పడే ముడతల నివారణకు ఫేస్ యోగా

- November 28, 2017 , by Maagulf
ముఖం మీద ఏర్పడే ముడతల నివారణకు ఫేస్ యోగా

కళ్ల చుట్టూ, నోటి చుట్టూ ముడతలు ఏర్పడితే వయసుకు మించి కనిపించడం ఖాయం. వయసుతో సంబంధం లేకుండా ముడతలు ఏర్పడడానికి అనేక కారణాలు ఉంటాయి. వాటిలో సూర్యరశ్మి, తినే తిండి ప్రధానం. ఈ రెండు విషయాల పట్ల జాగ్రత్త వహిస్తూ కింద ఇచ్చిన రెండు వ్యాయామాలు చేస్తే ముడతలు లేని చర్మం మీ సొంతమవుతుంది అంటున్నారు ఫేస్‌యోగ స్పెషలిస్టు మాన్సి గులాటి. అవి... ‘వి’, ‘నోస్‌-లేబియల్‌ ఫోల్డ్‌’ భంగిమలు. 

‘వి’ భంగిమ: కంటి చుట్టూ ఏర్పడే ముడతలు పోగొట్టేందుకు, రాకుండా చేసేందుకు ఈ వ్యాయామం ఉపయోగపడుతుంది. రెండు చేతుల చూపుడు, మధ్య వేళ్లను ఫోటోలో చూపించినట్టు ‘వి’ ఆకారంలో కళ్లకిందుగా ఉంచాలి. తరువాత వేళ్లతో కళ్లకొనల వద్ద రెండువైపులా సున్నితంగా వత్తాలి. పది సెకన్ల తరువాత కాస్త విరామం తీసుకుని మళ్లీ చేయాలి. ఇలా మొత్తం మూడుసార్లు చేయాలి.

నోస్‌-లేబియల్‌ ఫోల్డ్‌ భంగిమ: నోటి దగ్గర ముడతలు రాకుండా నివారించేందుకు చేసే వ్యాయామం ఇది. రెండు చేతుల చూపుడు వేళ్లను బుగ్గల కింద ఉంచి నెమ్మదిగా వత్తాలి. ఇది చేసేప్పుడు నోరు తెరిచి నవ్వాలి. పది సెకన్ల తరువాత విరామం తీసుకుని మళ్లీ చేయాలి. మొత్తం మూడుసార్లు ఈ వ్యాయామం చేయాలి. 

ఇవి చేయడం వల్ల ముడతలు రావు. ఇప్పటికే వచ్చిన వాళ్లకి నెమ్మదిగా పోతాయి.
ఈ వ్యాయామాలు చేస్తున్నప్పుడు నెమ్మదిగా శ్వాసించాలి. చూపు నేరుగా ఉంచాలి.
మేలుచేసే ప్రొటీన్‌...

 ముఖం మీద ఏర్పడే ముడతలకి ఆహార లోపం కూడా ఒక కారణం అని చెప్పుకున్నాం కదా. ఆహారంలో ప్రొటీన్‌ను చేర్చితే ఈ సమస్యని అధిగమించడం సులువు. కమలా పళ్లు, అరటి పళ్లు తింటే మంచి ఫలితం ఉంటుంది. పాలు, పనీర్‌, పెరుగు తప్పనిసరిగా తీసుకోవాలి. ఆకుపచ్చని కాయగూరలు, గింజధాన్యాలు, పీచుపదార్థాలను, బ్రౌన్‌ బ్రెడ్‌, బ్రౌన్‌ రైస్‌, గోధుమ ఆహారాన్ని కచ్చితంగా తినాలి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com