'ఆక్సిజన్' మూవీ రివ్యూ

- November 30, 2017 , by Maagulf
'ఆక్సిజన్' మూవీ రివ్యూ

టైటిల్ : ' ఆక్సిజన్‌ ' (2017) 
స్టార్ కాస్ట్ : గోపీచంద్ , రాశీఖన్నా, అను ఏమాన్యూల్, జగపతి బాబు తదితరులు.
దర్శకత్వం : ఏ.ఎం.జ్యోతికృష్ణ
నిర్మాతలు: ఎస్.ఐశ్వర్య, ఏ.ఎం.రత్నం
మ్యూజిక్ : యువన్ శంకర్ రాజా
విడుదల తేది : నవంబర్ 30, 2017 
తెలుగు మిర్చి రేటింగ్ : 2.75/5
రివ్యూ : కమర్షియల్ 'ఆక్సిజన్‌'

గోపీచంద్ కథానాయకుడిగా ఏ.ఎం.జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ "ఆక్సిజన్" . గోపీచంద్ సరసన రాశీఖన్నా, అను ఏమాన్యూల్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీసాయిరామ్ క్రియేషన్స్ పతాకంపై ఎస్.ఐశ్వర్య నిర్మించారు. గత కొంతకాలంగా రిలీజ్ కాకుండా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న ఈ మూవీ ఎట్టకేలకు అన్ని అడ్డంకులు తొలగించుకొని ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి వరుస ప్లాపులతో ఇబ్బంది పడుతున్న గోపీచంద్ కు "ఆక్సిజన్" ఎంత వరకు నింపిందో ఇప్పుడు చూద్దాం.
కథ :
రాజమండ్రిలో వూరిపెద్దగా ఉండే రఘుపతి(జగపతి బాబు) కి అదే వూరిలో ఉండే ఇద్దరు వ్యక్తుల ద్వారా శత్రుత్వం ఉంటుంది. ఎప్పుడెప్పుడు రఘుపతి కుటుంబాన్ని చంపేద్దామా అని వారు తగిన అవకాశం కోసం ఎదురుచూస్తుంటారు. దీంతో ఎలాగైనా తన కుటుంబాన్ని కాపాడుకోవాలని రఘుపతి, తన కుమార్తె కు అమెరికా సంబంధం చూస్తాడు. అలా కృష్ణప్రసాద్‌(గోపీచంద్‌) శ్రుతిని చూడటానికి అమెరికా నుంచి రాజమండ్రి వస్తాడు. కానీ ఊరిని వదిలి వెళ్ళడానికి ఇష్టపడదు శ్రుతి (రాశికన్నా). ఎలాగైనా ఈ సంబంధం తప్పించాలని మాస్టర్ ప్లాన్ చేస్తుంటుంది. కానీ కృష్ణప్రసాద్‌ మాత్రం ఆ కుటుంబ సబ్యులకు బాగా దగ్గరవుతాడు. ఈ నేపథ్యం లో శత్రువులు వీరి ఫై దాడికి దిగుతారు..ఆ సమయం లో కృష్ణప్రసాద్‌ ఎలా వారిని ఎదురుకున్నాడు..? శృతి ని పెళ్లి చేసుకుంటాడా లేదా..? అసలు రఘుపతి కి వారికీ శత్రుత్వం ఎలా వచ్చింది..అనేది మీరు తెర ఫై చూడాల్సిందే.
ప్లస్ :
* గోపీచంద్ యాక్షన్
* ఇంటర్వెల్ ట్వీస్ట్
* అక్కడక్కడా కామెడీ
మైనస్ :
* ఫస్ట్ హాఫ్
* మ్యూజిక్
* ఫైట్స్ లలో గ్రాఫిక్స్
నటీనటుల పెర్పామెన్స్ :
* ఎప్పటిలాగానే గోపీచంద్ తన యాక్షన్ తో అదరగొట్టాడు. రెండు విభిన్న క్యారెక్టర్లలో అభిమానులను అలరించాడు. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ లో గోపీచంద్ అదరగొట్టాడు.
* హీరోయిన్స్ విషయానికి వస్తే అను ఏమాన్యూల్ జస్ట్ గెస్ట్ రోల్ కే పరిమితం అయ్యింది. ఇక రాశిఖన్నా తన గ్లామర్ తో అలరించింది. కథ పరంగా చూస్తే ఈ ఇద్దరికీ పెద్దగా మార్కులేవి పడలేదు.
* పంచెకట్టు తో జగపతిబాబు ఆకట్టుకున్నాడు. సినిమాలో రెండు డిఫరెంట్ షేడ్స్ లలో కనిపించి అభిమానులను అలరించాడు.
* వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్, ఆలీ కామెడీ పర్వాలేదు అనిపించింది.
* కిక్ శ్యామ్, చంద్రమోహన్, నాగినీడు, బ్రహ్మాజీ, అభిమన్యు సింగ్, అమిత్, ప్రభాకర్, సాయాజీ షిండే, ఆశిష్ విద్యార్ధి మొదలగు వారు వారి వారి పరిధిలో బాగానే నటించారు.
సాంకేతిక విభాగం :
* యువన్ శంకర్ రాజా అందించిన సాంగ్స్ పెద్దగా ఆకట్టుకోలేక పోయినప్పటికీ , బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఆకట్టుకుంది. ముఖ్యం గా ఫైట్స్ లలో వచ్చే సౌంగ్ అదరగోట్టాయి.
* పీటర్ హైన్స్-స్టంట్ సిల్వ ఫైట్స్ మాస్ జనాలను బాగా ఆకట్టుకుంటాయి. కాకపోతే ఫైట్స్ లలో గ్రాఫిక్స్ పెద్దగా ఆకట్టుకోలేకపోవచ్చు.
* వెట్రి-ఛోటా కె.నాయుడు సినిమాటోగ్రఫీ ఓకే..
* నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.
* ఏ.ఎం.జ్యోతికృష్ణ ఎంచుకున్న అంశం బాగుంది. ఫస్ట్ హాఫ్ అంత రొటీన్ సినిమా మాదిరి తెరకెక్కించిన సెకండ్ హాఫ్ లో అసలు సినిమాను చూపించి సక్సెస్ అయ్యాడు.
చివరిగా :
యాక్షన్ కథల్లో గోపీచంద్ నటన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో వచ్చిన 'శౌర్యం', 'లౌక్యం', 'జిల్‌' వంటి యాక్షన్ కథలలో ఎలైతే నటించాడో..ఈ మూవీ లో కూడా అదే తరహాలో నటించి మార్కులు కొట్టేసాడు. ఆక్సిజన్‌ అనే టైటిల్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందో డైరెక్టర్ సెకండ్ హాఫ్ లో చూపించాడు.
ఫస్ట్ హాఫ్ అంత రొటీన్ గా సాగినప్పటికీ సెకండ్ హాఫ్ లో అసలు కథ నడుస్తుంది..అసలు కృష్ణ ప్రసాద్
( గోపీచంద్‌ ) లక్ష్యం ఏంటి ? రాజమండ్రి ఎందుకు వచ్చాడు? అన్నది చూపించి డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. ఇంటర్వెల్ ట్వీస్ట్ బాగుంది..అలాంటివి సినిమాలో రెండు , మూడు ఉంటె బాగుండు.
ఇక హీరోయిన్స్ కేవలం పాటలకే పరిమితం అయ్యారు. కామెడీ పర్వాలేదు. ఫైట్స్ ఆకట్టుకున్నాయి. ఓవరాల్ గా కమర్షియల్ 'ఆక్సిజన్‌' గా చెప్పవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com