భార్యకి కువైట్‌ నుంచి ఫోన్‌లో ట్రిపుల్‌ తలాక్‌!

- December 06, 2017 , by Maagulf
భార్యకి కువైట్‌ నుంచి ఫోన్‌లో ట్రిపుల్‌ తలాక్‌!

ట్రిపుల్‌ తలాక్‌ చట్టవిరుద్ధమైనదని సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు వెల్లడించినప్పటికీ.. కువైట్‌లో ఉన్న తన భర్త ఫోన్‌లో ట్రిపుల్‌ తలాక్‌ చెప్పాడని ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫతేపూర్‌ జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. జాఫర్‌గంజ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని దలేల్‌ఖేద గ్రామానికి చెందిన మహిళ మంగళవారం ఎస్పీ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేశారు. తన భర్త నవంబర్‌ 24న కువైట్‌ నుంచి ఫోన్‌లో మూడుసార్లు తలాక్‌ చెప్పాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారని ఏఎస్పీ వినోద్‌ కుమార్‌ మీడియాకు సింగ్‌ తెలిపారు.

బాధిత మహిళ తన తండ్రి, ఇద్దరు పిల్లలతో కలిసి ఎస్పీ కార్యాలయానికి వచ్చారని ఏఎస్పీ తెలిపారు. పదేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన వ్యక్తితో ఆమెకు వివాహమైందని తెలిపారు. అయితే, పని కోసం గతేడాది కువైట్‌కు వెళ్లినట్టు చెప్పారు. అతడు డిమాండ్‌ చేయడంతో మూడేళ్ల క్రితం రూ.2లక్షల కట్నం ఇచ్చినట్టు బాధితురాలి తండ్రి చెప్పారని ఏఎస్పీ తెలిపారు. మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టామని, అతడిపై త్వరలోనే చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టంచేశారు.

ట్రిపుల్‌ తలాక్‌ చట్టవిరుద్ధమైనదని పేర్కొంటూ ఈ ఏడాది ఆగస్టులో సర్వోన్నత న్యాయస్థానం చారిత్రక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. దీన్ని రద్దు చేస్తూ త్వరలో ప్రారంభం కానున్న పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం బిల్లు పెట్టనుంది. ట్రిపుల్‌ తలాక్‌ రద్దుపై కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ముసాయిదా బిల్లుకు ఈ రోజు ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం ఆమోదం కూడా తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com