చైనాలోకి భారత డ్రోన్‌

- December 06, 2017 , by Maagulf
చైనాలోకి భారత డ్రోన్‌

భారత్‌కు చెందిన ఒక డ్రోన్‌ తమ గగనతలంలోకి వచ్చిందని చైనా ఆరోపిస్తోంది. అయితే ఆ డ్రోన్‌ కూలిపోయినట్లు తెలిపింది. ఈ మేరకు చైనా అధికారిక మీడియా పేర్కొంది. 'చైనా ప్రాదేశిక సౌర్వభౌమత్వాన్ని ఉల్లంఘించేలా భారత్‌ చర్య ఉంది. దీనిపై మేం తీవ్ర అసహనం, అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం' అని చైనా ఆర్మీ డిప్యూటీ డైరెక్టర్‌ జాంగ్‌ షౌలీ మీడియాతో అన్నారు. అయితే డ్రోన్‌ ఎక్కడికి, ఎప్పుడు వచ్చిందనే విషయాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. చైనా సరిహద్దు దళాలు డ్రోన్‌ను గుర్తించినట్లు పేర్కొన్నారు. అయితే దీనిపై భారత అధికారుల నుంచి ఇంకా స్పందన రాలేదు. కాగా కొద్ది నెలల క్రితం భారత్‌-చైనా మధ్య డోక్లాం వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. భారత భద్రతకు భంగం కలిగేలా చైనా రోడ్డు నిర్మాణం చేపట్టిందని మన దేశం ఆరోపించింది. భారత సైన్యం దాన్ని అడ్డుకోవడంతో చైనా మండిపడింది. భారత సైన్యం వెనక్కి వెళ్లిపోవాలని, లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పలు మార్లు హెచ్చరించింది. దాదాపు రెండున్నర నెలల ఉద్రిక్తత తర్వాత ఆగస్టులో డోక్లాం వివాదం సద్దుమణిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com