'మళ్ళీ రావా': మూవీ రివ్యూ

- December 08, 2017 , by Maagulf
'మళ్ళీ రావా': మూవీ రివ్యూ

సుమంత్ అనగానే సత్యం, గోదావరి వంటి సెన్సిబుల్ లవ్ స్టోరీస్ గుర్తుకు వస్తాయి. అలాంటి ఫీల్ ని ట్రైలర్ తో కలిగించింది మళ్ళీరావా. ప్రేమకథలు ఎప్పటికీ పాతబడవు కొత్తగా ప్రజెంట్ చేయగలిగే సత్తా ఉంటే కమర్షియల్ సక్సెస్ కి ఢోకా ఉండదనే విషయం చాలాసినిమాలు నిరూపించాయి.  మరి మళ్ళీరావా అందించిన ఎక్స్ పీరియన్స్ లేంటో తెలుసుకుందాం..
కథ:
కార్తిక్ (సుమంత్) రాజోలులో తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు తన క్లాస్ మెంట్ అంజలి( అకాంక్షసింగ్) తో ప్రేమలో పడతాడు. ఆ విషయంలో  రెండు కుంటుంబాలు గొడవపడటంతో అంజలి ఊరు వదిలి వెళ్లిపోతుంది. తర్వాత కొన్ని సంవత్సరాలకి కార్తిక్ పనిచేసే ఆఫీస్ లో టీమ్ లీడర్ గా అంజలి వస్తుంది.  అక్కడ ఒకరితో ఒకరు మరోసారి ప్రేమలో పడతారు.  అంజలి, కార్తిక్ లు పెళ్ళికి రెడీ అవుతారు. పెళ్ళి రోజు వచ్చి అంజలి పెళ్ళి ఇష్టం లేదని వెళ్ళి పోతుంది. కార్తిక్ ఒంటరిగా ఉంటాడు..కొన్ని సంవత్సరాల తర్వాత అంజలి పెళ్ళి కార్డ్ వస్తుంది. ఆమె పెళ్ళి కి ఇన్వైట్ చేయడానికి కార్తిక్ కి ఇంటి వస్తుంది. మరి అంజలి పెళ్ళి ఎవరితో జరుగుతుంది..? ఇష్టపడిన కార్తిక్ ని అంజలి వదిలేయడానికి కారణం ఎంటనేది మిగిలిన కథ..?
కథనం:
ప్రేమకథలు ఎప్పుడు పాతబడవు.. కొత్తగా ప్రజెంట్ చేయగల సత్తా ఉంటే ప్రేమకథలు బాక్సాఫీస్ పై దండయాత్రలు చేస్తాయి.. అర్జున్ రెడ్డి, ఫిదా లు ఇవే నిరూపించాయి. ఏ ప్రేమకథ కయినా పెద్ద విలన్స్ గా అపార్డాలే నిలుస్తాయి.  కానీ అవి  దర్శకుడు ఎలా ప్రజెంట్ చేసాడు అనే విషయం ఆ కథను ప్రత్యేకంగా నిలుపుతుంది. మళ్ళీరావాతో దర్శకుడు గౌతమ్ తిన్ననూరి అదే నిరూపించాడు. ఎజ్ కో ప్రేమకథలు ఉంటాయి.. కానీ ప్రతి ఏజ్ లోనూ ఒకే అమ్మాయి ఆ ప్రేమకథలో హీరోయిన్ అవ్వడం మళ్ళీరావా ప్రత్యేకత. కథను దర్శకుడు మొదలు పెట్టిన తీరే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. 2012 లో కథ మొదలవుతుంది. పెళ్ళి కి అన్ని ఏర్పాట్లు చేసుకొని  రిజస్టర్ ఆఫీస్ దగ్గర తను ప్రేమించిన అమ్మాయి కోసం ఎదురు చూస్తుంటాడు హీరో, ఆ అమ్మాయి వచ్చి తనకు ఈ పెళ్ళి ఇష్టం లేదని చెబుతుంది. తర్వాత 2017   ఆ అమ్మాయి కోసం అతను ఎదరు చూస్తూ , యుస్ వెళ్ళే ప్రయత్నాలలో ఉంటాడు. అదే టైం లో ఆ అమ్మాయి వెడ్డింగ్ కార్డ్ వస్తుంది.  తర్వాత కథ 1999 కి వెళ్తుంది. అక్కడ   కార్తిక్ ఆ అమ్మాయిని మొదటి సారి చూసిన సన్నివేశం .. ఇలా మూడు టైం లలో జరిగే కథను ఎక్కడా కన్ ఫ్యూజ్ కాకుండా దర్శకుడు చెప్పిన తీరు  ఈ కథకు కొత్తదనం తెచ్చింది. ఒక టైం నుండి మరో టైం కి వెళ్లేందుకు దర్శకుడు తీసుకున్న లీడ్ సన్నివేశాలు చాలా బాగున్నాయి.  చైల్డ్ ఎపిసోడ్ ని చాలా బాగా చిత్రీకరించాడు దర్శకుడు. సినిమా అంతా కనిపించే ఈ ఎపిసోడ్ లో ఆర్టిస్ట్ లు నటన చాలా బాగుంది.  వానలో తడుస్తూ  అమ్మాయిని చూసిన సన్నివేశం హైలెట్ గా నిలిచింది. తొమ్మిదో తరగతి లో ఈ ముదురు వేషాలేంటని  ముక్కున వేలు వేసుకున్నా, ‘ నాకు క్రికెట్ అంటే ఇష్టం, డుంబు అంటే ఇష్టం అలాగే ఆ అమ్మాయి అంటే ఇష్టం’ ఇందులో తప్పేంటి అనే ఈ కుర్రాడి లాజిక్ చాలా మందికి మింగుడు పడదు. ఇక ఇందులో హైలెట్ గా  శ్రవణ్ భరద్వాజ్ సంగీతం నిలుస్తుంది. సన్నివేశంలోని  ఎలివేట్ చేసేందుకు అతను చాలా సపోర్ట్ ఇచ్చాడు. అయితే మూడు పిరియడ్స్ లో జరిగే ఈ ప్రేమకథలో సుమంత్ తో పాటు  చైల్డ్ ఎపిసోడ్ లో కనిపించే  సాత్విక్,   తి ఆస్రాని  కూడా మంచి నటన తో ఆకట్టుకున్నారు. సుమంత్ క్యారెక్టర్ లో వేరియేషన్స్  చాలా బాగా మలిచాడు దర్శకుడు. ఫస్టాఫ్ చైల్డ్ ఎపిసోడ్ లో వచ్చే ‘ లోకల్ రోమియో’ ఎపిసోడ్ నవ్వులు పడించింది. అలాగే సెకండాఫ్ లో బ్రేకింగ్ న్యూస్ బాబురావు గా ఫేమస్ అయిన కిరణ్ నటన ఆకట్టుకుంది.  ఈ రెండు ఎపిసోడ్స్ కథలో కలసిపోయి కితికితలు పెట్టాయి. ప్రేమించిన అమ్మాయి  కాదన్నా కూడా అదే ప్రేమను  మనసులో ఉంచుకోవడం అనే ఐడియల్ క్యారెక్టర్ ని తెరపై చక్కగా ప్రజెంట్ చేసాడు దర్శకుడు. సుమంత్ కార్తిక్ క్యారెక్టర్ గా మారిపోయాడు. సత్యం, గోదావరి పాత్రల తరహాలో సాగే ఒక మంచి కుర్రాడి పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు.  ఆకాంక్షా సింగ్  స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది. ప్రేమను వద్దనుకునే టప్పుడు  ఆమె క్యారెక్టర్ లోని సంఘర్షణ ఎలాంటి డైలాగ్స్ లేకుండా పలికించగలిగింది.  ఈ కథలో ప్రేమతో పాటు, ప్రెండ్షిప్ అండ్ ప్యామిలీ ఎమోషన్స్ ని కూడా చాలా బాగా కుదిరాయి. తెరమీద కనపడ్డ ప్రతి పాత్రకి ఒక వ్యక్తిత్వాన్ని అందించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. నిత్యం కొట్టుకునే తల్లిదండ్రుల మద్య పెరిగిన ఆడపిల్ల భయాలు ఎలా ఉంటాయో.. ఎవరైనా ప్రేమనయినా అంగీకరించాలంటే పడే సంఘర్షణ ఎలా ఉంటుందో  తెరపై చాలా  ప్రభావవంతగా  కనిపించాయి.  అలాగే ‘నువ్వు పక్కనున్నప్పుడు ఆనంద పడటం, లేనప్పుడు బాధ పడటం తప్ప మరొకటి తెలియని ప్రేమను ఒక క్యారెక్టర్ గా మలిచిన దర్శకుడు ఇందులో పరిస్థితుల్ని తప్ప ఎవర్నీ విలన్స్ గా మలచలేదు.  పెళ్ళి చూపులు, మెంటల్ మదిలో వంటి సినిమాలు తెలుగు సినిమా మేకింగ్ లో కొంత మార్పును తెచ్చాయి. మళ్ళీ రావా తర్వాత తెలుగు సినిమా స్క్రీన్ ప్లే లో కొంత  ప్రభావం కనపడుతుంది. ఒక మాములు కథను ఎలాంటి కన్ ఫ్యూజన్స్ లేకుండా మూడు టైం పిరియడ్స్ లో  చెప్పగలిగాడు. చైల్డ్ ఎపిసోడ్ కొంత తగ్గించి సుమంత్ లవ్ స్టోరీ ని కాస్త పెంచితే బాగుండేది.  సీనియర్ నటి అన్నపూర్ణ కూడా కనిపించిన అన్ని సన్నివేశాల్లో నవ్వుంచి  చివరి సన్నివేశంలో తన సీనియారిటీ బలం ఎంటో చూపించింది. ఈ మూవీ క్లైమాక్స్ లో రెండు పాత్రల తాలూకు పీలింగ్స్ ని నిజాయితీ గా చూపించాడు దర్శకుడు. తెలుగు సినిమా కమర్షియల్ లుక్ ని మార్చేందుకు చాలామంది దర్శకులు ప్రయత్నిస్తున్నారు.. వారిలో కొంతమంది సక్సెస్ అవుతున్నారు. ఆ సక్సెస్ పుల్ దర్శకుల జాబితాలో గౌతమ్ కూడా తప్పకుండా చేరతాడు. సినిమా మేకింగ్ అనేది కమర్షియల్ కాంబినేషన్ ని సెట్ చేయడం అనే అభిప్రాయం చాలామందిలో ఉంది.. కానీ కథను నమ్మి  కమర్షియల్  రిటర్న్స్ పై లెక్కలు వేయకుండా ఈ సినిమా ని నిర్మించిన రాహుల్ కి మళ్ళీ రావా  రిఫరెన్స్ పాయింట్ గా మిగులుతుంది.  చివరిగా:
మళ్ళీ రావా సరదాగా సాగే ప్రేమకథ. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే కథ. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com