పక్కతడపడం ఆపే అద్భుతమైన చిట్కా..

- December 08, 2017 , by Maagulf
పక్కతడపడం ఆపే అద్భుతమైన చిట్కా..

మా అమ్మాయికి పదేళ్ళు దాటాయి. ఇంకా పక్క తడుపుతూనే ఉంది. మా వాడికి ఎంత వయస్సు వచ్చినా పక్క తడపడం మానడం లేదు. పొద్దున్నే దుప్పట్లు, బొంతలు మార్చలేక చస్తున్నాం. ఇది చాలామంది తల్లిదండ్రుల కంప్లైంట్. పాపం పిల్లలకే సిగ్గేస్తోంది. ఎప్పుడూ అదే టాపిక్ వస్తుంటే ఏం చెయ్యాలి. 
 
పిల్లలు పక్క తడుపుతుంటే రాత్రి పూట ఖర్జూరాను చిన్న ముక్కలుగా చేసి పాలలో వేసి వేడి చేసి చల్లార్చి పిల్లలకు తాగించాలి. అలా చేస్తే ఖర్జూరాలోని ఆప్టాలిక్ యాసిడ్ జీర్ణక్రియను త్వరితం చేసి శరీరంలో ద్రవరూపంలోని మలినాలన్నీ త్వరగా మూత్రం ద్వారా పంపబడుతుంది. అంతకుముందే పూర్తిస్థాయిలో ద్రవరూపంలో మలినాలను పంపేశారు కాబట్టి రాత్రి నిద్రలో పోసుకోవడానికి ఇంకేమీ మిగిలి ఉండదు. పిల్లల్లో భయం, అభద్రతా భావం, ప్రేమ రాహిత్యం నరాల బలహీనత కారణంగా ఇది తలెత్తే అవకాశం వుందని చెబుతుంటారు. 
 
రాత్రి వేళల్లో వాష్ రూంకు పిల్లలు లేపితే విసుక్కోకుండా తీసుకెళ్ళాలి. ఒకసారి విసుక్కుంటే లేపినా విసుక్కుంటారని పక్కలోనే కానించేస్తారు. ఇంట్లో ఎక్కువగా గొడవలు లేకుండా చూసుకోవాలి. తరచూ గొడవలు అవుతుంటే పిల్లలు అభద్రతా భావానికి లోనవుతారు. పడుకునే ముందు ఖచ్చితంగా టాయ్‌లెట్‌కు వెళ్ళడం అలవాటు చేయాలి. మౌలికంగా పక్క తడపడం అనేది వ్యాధి కాదు. కాబట్టి దానికి మందులు వాడే అవకాశం తక్కువ.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com