కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్: సినిమా రివ్యూ

- December 14, 2017 , by Maagulf
కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్: సినిమా రివ్యూ

శుక్రవారం అనగానే సినిమా హడావిడి ఉంటుంది. కాని ఒక రోజు ముందుగానే ఒక సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టైటిల్ తోనే విచిత్రమైన టాక్ తెచ్చుకున్న ఈ సినిమా , ట్రైలర్ ద్వారా కొంత ఆసక్తి రేకెత్తించింది. డార్క్ జానర్, ఫిలిం నాయర్ ని చెబుతూ వస్తున్నా ఈ సినిమా ఎలా ఉందో ఒక సారి చూద్దాము.
 
కథ :
ఆర్యన్ whackedout మీడియా లో పని చేసే ఒక జర్నలిస్ట్. అతనికి మెట్రో లైఫ్ స్టైల్ లో బ్రతికే ఒక గర్ల్ ఫ్రెండ్ స్వీటీ . ఇద్దరూ కలిసి సహజీవనం చేస్తూ ఉంటారు. అయితే , ఒక పబ్ కి వెళ్ళిన ఆర్యన్ తన పర్స్ పోగొట్టుకుంటాడు. పోయిన తన పర్స్ పొందే క్రమంలో ఆర్యన్ తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే అదే సమయంలో స్వేటీ లైఫ్ స్టైల్ వల్ల ఇర్రిటేట్ అయ్యి ఆర్యన్ తన దగ్గర నుండి వెళ్లిపోమంటాడు. అలా వెళ్ళమని చెప్పిన మరుసటి రోజే స్వీటీ హత్యకు గురవుతుంది. ఆ తరువాత ఏమి జరిగింది అనేదే సినిమా కథ.

నటీనటుల పనితీరు :
కన్ఫ్యూషన్ ఉన్న యువకుడిగా ఆర్యన్ పాత్రకు కిరణ్ సరిపోయాడు. అయితే డబ్బింగ్ లో మరింత శ్రద్ధ తీసుకుని ఉండాల్సింది. ఇక పొతే సినిమా మొత్తానికి చెప్పుకోదగ్గ పాత్ర చేసింది స్వీటీ పాత్ర చేసిన హర్షితా కులకర్ణి. అయితే ఆ అమాయిని చూడటానికి కాస్త కష్టపడాలి కాని , నటనతో కవర్ చేసింది. ఈ అమ్మాయి ఒక్కటే సన్నివేశానికి అనుగుణంగా చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఫిదా ఫేం గాయత్రి గుప్తా మరోసారి గుర్తుండిపోయే పాత్ర చేసింది. అక్కడక్కడా కాస్త తడబడినా ఒకరంగా కొంత వరకు సినిమాకి ప్లస్ అయ్యింది గాయత్రి గుప్తా ఒకట్టే.
 
సంకేతికవర్గం:
గివి మ్యూజిక్ స్లో గా ఉంది. వెరైటీ ట్రై చేసారు. సినిమాలో టైటిల్ సాంగ్ ఒక్కటే ఆకట్టుకునేలా ఉంది. సిద్ధ కే. సినిమాటోగ్రఫీ పూర్తిగా కొత్తగా ఉంది. ప్రతి సీన్ లో కెమెరా పనితనం కనిపిస్తుంది. ఎడిటింగ్ విషయంలో మెచ్చుకోవాల్సింది ఏంటంటే సినిమా లెంగ్త్ ని మేనేజ్ చెయ్యడం. ఎక్కువసేపు నడవకుండా సినిమా నిడివి తగ్గించడం వల్ల కాస్త రిలాక్స్ అవ్వొచ్చు.
 
విశ్లేషణ:
ఆర్యన్ క్యారెక్టర్ లోని చేతకాని తనాన్ని పరిచయం చేస్తూ నడిపిన మొదటి భాగం , సో సో గా నెమ్మదిగా నడుస్తుంటుంది. ప్రేక్షకుడికి ఏం జరుగుతుందో అర్ధం కాదు. స్వీటీ హత్యతో అసలు కథ మొదలు అవుతుంది. అక్కడినుండి ఒక్కొక్క సీన్ ని ఎక్స్ప్లోర్ చేసే కొద్ది ఇంటరెస్టింగ్ గా సాగుతుంది ఈ సినిమా. అయితే ఎంటర్టైన్మెంట్ పూర్తిగా లేకపోవడం. డార్క్ థీమ్ తో సినిమాని తీయడం వల్ల వెంటనే గొప్పగా నచ్చకపోవచ్చు. అలాగే వీక్ గా ఉన్న మొదటి భాగం కూడా ఈ సినిమా కి కాస్త మైనస్. ఓవరాల్ గా చెప్పాలంటే కొత్తగా ఉంది. కాని కమర్షియల్ ఎలెమెంట్స్ ను ఆశించి వచ్చే వారికి కిస్ దక్కోచ్చేమో గాని బ్యాంగ్ మాత్రం దక్కదు.

రేటింగ్ : 2.5/5

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com