చలికాలంలో శక్తిని పెంచే పదార్ధాలు.!

- December 16, 2017 , by Maagulf
చలికాలంలో శక్తిని పెంచే పదార్ధాలు.!

శీతాకాలంలో చలి పులి మనల్ని వణికిస్తుంది. ఇక పొగమంచు, కాలుష్యాల తీవ్రత చెప్పనవసరం లేదు. పొగమంచు వల్ల రకరకాల వ్యాధుల బారిన పడతాం. అందుకే ఈ సీజన్‌లో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖ్యంగా పొగమంచు, కాలుష్యాలవల్ల అనారోగ్యం పాలవకుండా శారీరకశక్తిని పెంపొందించుకోవాలి. అందుకోసం ఇవి తింటే ఎంతో మంచిది...

క్రాన్‌బెర్రీస్‌ పళ్లల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్‌-సి, ఇ, ఎలు వీటిల్లో బాగా ఉంటాయి. శీతాకాలంలో సూర్యరశ్మి కొరత ఉంటుంది. సూర్యరశ్మిలో విటమిన్‌-డి సిలు కూడా బాగా ఉంటాయి. అందుకే ఈ సీజన్‌లో తప్పనిసరిగా క్రాన్‌బెర్రీస్‌ తినాలి. అంతేకాదు పొగమంచు కారణంగా తలెత్తే చర్మ సమస్యల నుంచి కూడా క్రాన్‌బెర్రీస్‌ రక్షణనిస్తాయి. క్రాన్‌బెర్రీస్‌లోని యాంటాక్సిడెంట్లు, ప్రొటీన్ల వల్ల రోగనిరోధకశక్తి పెరుగుతుంది. ఇన్ఫెక్షన్లను కూడా ఇవి నియంత్రిస్తాయి. ఫ్రూట్‌ స్మూతీ, ఓట్‌మీల్‌ల్లో క్రాన్‌బెర్రీస్‌ కలిపి తినొచ్చు. లేదా డ్రైడ్‌ క్రాన్‌బెర్రీస్‌ తిన్నా ఫలితం ఉంటుంది. నట్స్‌, వేగించిన బాదంపప్పులు కూడా ఈ సీజన్‌లో తినొచ్చు. 

నిమ్మ జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. అందుకే రోజులో మధ్యమధ్యలో కొద్దిగా నిమ్మరసం తాగుతుంటే శరీరంలో నీటి శాతం సరిపడినంత ఉంటుంది. లెమన్‌ టీ తీసుకుంటే గొంతు సమస్యలు తగ్గుతాయి. క్రాన్‌బెర్రీస్‌ లాగే నిమ్మ కూడా చర్మ కాన్సర్‌ సమస్యలపై శక్తివంతంగా పోరాడుతుంది.

శీతాకాలంలో ఏర్పడే పొగమంచువల్ల ఊపిరాడకపోవడం, ఊపిరితిత్తులు మూసుకుపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. వాల్‌నట్స్‌ తినడం వల్ల ఊపిరితిత్తుల్లో తలెత్తిన సమస్యలు పోతాయి. ఇవి ఊపిరితిత్తులను శుభ్రం చేయడమే కాకుండా పలు శ్వాసకోశ సంబంధిత సమస్యలు రాకుండా నిరోధిస్తాయి. వాల్‌నట్స్‌ మూడ్‌-బూస్టర్‌గా కూడా పనిచేస్తాయి. పొగమంచు వల్ల మనల్ని చుట్టుముట్టే నిరుత్సాహం సైతం ఒకటి రెండు వాల్‌నట్స్‌ తింటే పోతుంది. వాటివల్ల రోజంతా ఎంతో ఉత్సాహంగా ఉంటాం.

రోజులో కనీసం రెండు లీటర్ల నీరు తాగాలి. నీళ్లు బాగా తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు, విషపదార్థాలు బయటకుపోతాయి. నీళ్లు సరిగా తాగకపోతే జీర్ణకోశ సమస్యలు తలెత్తుతాయి.

ఈ సీజన్‌లో బెల్లం తింటే ఎంతో మంచిది. బెల్లంలో ఐరన్‌ బాగా ఉంటుంది. ఇది శరీరంలోని హిమోగ్లోబిన్‌ను పెంచుతుంది. అంతేకాదు రక్తంలో ఆక్సిజన్‌ సరఫరా కూడా బాగుంటుంది. ఫలితంగా కాలుష్య ప్రభావం నుంచి మనల్ని మనం కాపాడుకోగలం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com