గుజరాతీ వంటకాలతో సంబరాలు చేసుకుంటున్న భాజపా నాయకులు

- December 18, 2017 , by Maagulf
గుజరాతీ వంటకాలతో సంబరాలు చేసుకుంటున్న భాజపా నాయకులు

భోపాల్‌ : గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. గుజరాత్‌లో అధికార భాజపా విజయం దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాల ప్రకారం భాజపా అక్కడ 10 స్థానాల్లో గెలుపొంది.. మరో 95 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక్కడ భాజపాకు కాంగ్రెస్‌ గట్టిపోటీ ఇస్తోంది. మరోవైపు హిమాచల్‌ప్రదేశ్‌లో భాజపా గెలుపు ఖాయమైంది. 

రెండు రాష్ట్రాల్లో భాజపా విజయంతో దేశవ్యాప్తంగా ఆ పార్టీ కార్యకర్తలు సంబరాల్లో మునిగితేలారు. మిఠాయిలు పంచి, టపాసులు పేల్చి సంబరాలు చేసుకుంటున్నారు. అయితే మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో పార్టీ కార్యకర్తలు గెలుపు వేడుకలను వినూత్నంగా నిర్వహిస్తున్నారు. గుజరాత్‌ ప్రజలు ఇష్టంగా తినే డోక్లా, ఫఫ్దా తదితర ప్రముఖ వంటకాలను భోపాల్‌ ప్రధాన కార్యాలయంలోని క్యాంటీన్‌ మెనూలో చేర్చారు. ఈ రోజు వాటిని కార్యకర్తలు ఇష్టంగా తింటున్నారు. గుజరాత్‌లో భాజపా విజయానికి గుర్తుగా ఆ రాష్ట్ర వంటకాల రుచి చూస్తున్నామని కార్యకర్తలు ఆనందంగా చెబుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com