రివ్యూ:హలో

- December 22, 2017 , by Maagulf
రివ్యూ:హలో

రివ్యూ : హలో మూవీ

విడుదల తేదీ : డిసెంబర్ 22, 2017
నటీనటులు : అఖిల్‌ అక్కినేని, కళ్యాణి ప్రియదర్శన్‌
దర్శకత్వం : విక్రమ్‌ కె. కుమార్‌
నిర్మాత : అక్కినేని నాగార్జున
సంగీతం : అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రఫర్ : పి. ఎస్‌. వినోద్‌
ఎడిటర్ : ప్రవీణ్‌ పూడి

అక్కినేని కుంటుబానికి మనం వంటి మెమరబుల్ సినిమాని అందించిన విక్రమ్ కుమార్ కి  అఖిల్ కెరియర్ ని గాడిలో పెట్టే బాధ్యతలు అప్పగించారు నాగార్జున. అందుకు తగ్గట్టుగానే సాంగ్స్ అండ్ ట్రైలర్ లతో విక్రమ్ కుమార్ కొత్త లుక్ లో అఖిల్ ని ప్రజెంట్ చేసాడు.  కథేంటో టూకీ గా చెప్పేసిన హాలో  ప్రేక్షకులకు ఎలాంటి అనుభావానలు అందించిందో తెలుసుకుందాం..?

కథ :
శ్రీను( అఖిల్ ) అనాథ .. ఎడేళ్ళ వయస్సు నుండి  రోడ్ పక్కన తిరుగుతూ వయోలన్ వాయిస్తూ సిగ్నల్స్ దగ్గర చిల్లర కోసం ఎదురు చూసే శీను జీవితంలోకి  జున్ను(కళ్యాణి) వస్తుంది.  తన కోసం ఏదైనా చేసే ప్రేమను చూపిస్తుంది. జున్ను వాళ్ళు కుటుంబం ఢిల్లీకి షిప్ట్ అవుతుంది.వెళుతూ తన ఫోన్ నెంబర్ శ్రీను కి ఇస్తుంది.అది మిస్ అవుతుంది.  అయితే జున్ను కి  శ్రీను ఇచ్చిన మాటలలో ఒకటి. రోజు అదే పార్క్ కి వస్తానని .. ఆ మాటకోసం జున్ను కోసం శ్రీను 13 ఏళ్ళు గా అదే ప్లేస్ కి వస్తుంటాడు.. మరి శ్రీను తన సోల్ మేట్ ని కలిసాడా..? అనేది మిగిలిన కథ

కథనం:
సినిమాకి ప్రధానంగా అఖిల్ అప్పీరియన్స్ హైలెట్ గా నిలుస్తుంది. సినిమా మొదలైన కొద్ది నిమిషాల్లోనే వచ్చిన హాలో టైటిల్ సాంగ్ మంచి మూడ్ లోకి ప్రేక్షకుల్ని తీసుకెళ్తుంది. తన సోల్ మేట్ కోసం యేళ్ళ తరబడి ఎదరుచూస్తున్న ప్రేమికుడిగా శ్రీను క్యారెక్టర్ లో అఖిల్  నటన ఆకట్టుకుంటుంది. తర్వాత మొదలైన చైల్డ్ ఎపిసోడ్ విక్రమ్ కుమార్ సెన్సిబిలిటీస్ కి అద్దం పడుతుంది. ఇది జరుగుతుందా ఇలా జరుగుతుందా అనే విషయాలు పక్కన పెడితే ఆ సన్నివేశాల్లో కనిపించిన ఎమోషన్స్ అందరి గుండెలని పిండి వేస్తాయి. మిఖైల్ గాంధీతో విక్రమ్ కుమార్ చేయించిన నటన హెట్స్‌‌ఫ్ అనిపిస్తుంది. ఏటువంటి అంచనాలు, అవసరాలు లేకుండా ఒకమనిషిని ప్రేమించడం మొదలెడితే జీవితం ఎలా మారుతుందో అనే పాయింట్ ని విజువలైజ్ చేయడంలో విక్రమ్ కుమార్ పూర్తిగా విజయం అయ్యాడు. ఆ  ఎపిసోడ్ కి కనెక్ట్ అయ్యాక అఖిల్ మరింత ఇష్టంగా మారాడు. తన సోల్ మేట్ కోసం అతను పడే ఆరాటం.. చేసే పోరాటం తో ప్రతి ప్రేక్షకుడు ఈజీగా కనెక్ట్ అవుతాడు. ఇంటర్వెల్ సమయానికి హీరో హీరోయిన్లను దగ్గర చేసిన దర్శకుడు ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య మంచి రొమాంటిక్ ట్రాక్ ను నడపలేకపోయాడు. రమ్యకృష్ణ నటన లోని  లోతులు తెలియాలంటే ఒక యాక్సిడెంట్ సన్నివేశం చాలు.. అక్కడ ఆమె చూపించిన నటన కు స్పందిచని హృదయం ఉండదు. అలాంటి ఫైన్ ఫెర్ఫార్మెన్స్ లను రాబట్టుకోగలిగాడు విక్రమ్ కుమార్. ఇక కళ్యాణి నటన బాగుంది. తన పాత్రలోని ఫీల్ క్యారీ చేయడంలో సక్సెస్ అయ్యింది. పి. యస్. వినోద్ సినిమాటోగ్రఫీ ఈ సినిమా మూడ్ ని  ప్రేక్షకులకు అందించడంలో సక్సెస్ అయ్యంది. అతని  సినిమాటోగ్రఫీ తో ఈ ప్రేమకథ మరింత ఉద్వేగభరితంగా మారింది.  అనూప్ రెబెన్స్ మంచి ట్యూన్స్ తో హాలో అసెట్ గా మారాడు. టైటిల్ సాంగ్ అనూప్ రూబెన్స్ కెరియల్ లో బెస్ట్ గా నిలుస్తుంది. యాక్షన్ సన్నివేశాలు హాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రియలిస్టిక్ అనిపించే  హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రఫీ బాబా బ్రౌన్ ఈ సినిమా పోరాటాలకు కొత్త లుక్ ని తెచ్చాడు. మనం ఎంటర్ ప్రైజస్ మీద నాగార్జున నిర్మించిన ఈ సినిమా ఆయన నమ్మకాన్ని నిలబెట్టింది. నాగార్జున అభిరుచి పై నమ్మకాన్ని పెంచింది.


చివరిగా:
నిజాయితీ నిండిన ఈ ప్రేమకథతో రీ లాంచ్ అయిన అఖిల్ యూత్ ఆడియన్స్ లో తన మార్క్ ని క్రియేట్ చేసుకోగలిగాడు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com