దుబాయ్‌లో క్రికెటర్‌ శిఖర్‌ధావన్‌కు అవమానం

- December 29, 2017 , by Maagulf
దుబాయ్‌లో క్రికెటర్‌  శిఖర్‌ధావన్‌కు అవమానం

దుబాయ్:భార్య, పిల్లల్ని అనుమతించని ఎమిరేట్స్‌ సిబ్బంది కేప్‌టౌన్‌: భారత క్రికెటర్‌ శిఖర్‌ధావన్‌కు దుబాయ్‌ ఎయిర్‌పోర్టులో అవమానం జరిగింది. సతీమణి ఆయేషాతో పాటు ఇద్దరు పిల్లలతో కలిసి ధావన్‌ బుధవారం దక్షిణాఫ్రికా బయల్దేరాడు. ముంబయి నుంచి దుబాయ్‌ చేరుకుని అక్కడి నుంచి మరో విమానంలో వీరు దక్షిణాఫ్రికా వెళ్లాల్సి ఉంది. దుబాయ్‌లో దక్షిణాఫ్రికా విమానం ఎక్కే సమయంలో సంబంధిత విమాన సిబ్బంది ధావన్‌ భార్యతో పాటు పిల్లలను ఎక్కించుకునేందుకు అనుమతించలేదట. పిల్లల జనన ధ్రువీకరణ పత్రాలను చూపించాలని అడిగారట. దీంతో వారు ఇప్పటికీ దుబాయ్‌ ఎయిర్‌పోర్టులోనే ఉండిపోయారట. దుబాయ్‌ ఎయిర్‌పోర్టులో చోటు చేసుకున్న ఘటనను శిఖర్‌ ధావన్‌ ట్విటర్‌లో పేర్కొన్నాడు. 'ఎమిరేట్స్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థకు సంబంధించిన సిబ్బంది వ్యవహరించిన తీరు హుందాగా లేదు. కుటుంబసభ్యులతో కలిసి దక్షిణాఫ్రికా పర్యటనకు బయల్దేరాను. ముంబయి నుంచి దుబాయ్‌ చేరుకున్న మేము అక్కడ దక్షిణాఫ్రికా వెళ్లే విమానం ఎక్కేందుకు సిద్ధమైన సమయంలో నా భార్య, పిల్లలను అనుమతించలేదు. పిల్లలకు సంబంధించిన జనన ధ్రువీకరణ పత్రాలతో పాటు మరికొన్ని పత్రాలు సమర్పించాలని కోరారు.

ఆ సమయంలో మా వద్ద అవి లేవు. డాక్యుమెంట్లు వచ్చే వరకూ వారు అక్కడే ఉంటారు. ఇప్పటికీ దుబాయ్‌ ఎయిర్‌పోర్టులోనే ఉన్నారు. మేము ముంబయి నుంచి దుబాయ్‌కి వచ్చింది ఎమిరేట్స్‌ విమానంలోనే.

కారణం లేకుండానే ఒక ఉద్యోగి మా పట్ల మరీ అమర్యాద పూర్వకంగా ప్రవర్తించారు' అని ధావన్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. కాలి గాయంతో బాధపడుతోన్న ధావన్‌ ముంబయిలో స్కానింగ్‌ తీయించు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com