కువైట్ కు భారతదేశ నూతన రాయబారిగా కె. జీవసాగర్ బాధ్యతలు స్వీకరణ

- January 12, 2018 , by Maagulf
కువైట్ కు భారతదేశ నూతన రాయబారిగా కె. జీవసాగర్  బాధ్యతలు స్వీకరణ

కువైట్ : మన తెలుగుతేజం కె .జీవసాగర్  కువైట్ లో భారతదేశ నూతన రాయబారిగా ఉద్యోగ బాధ్యతలు శుక్రవారం స్వీకరించారు. ఆయనను కువైట్  డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ మరియు విదేశాంగ మంత్రి షేక్ సబాహ్ అల్-ఖలేద్ అల్ హమద్ అల్ సబాహా సాదరంగా ఆహ్వానించారు.  షేక్ సబాహ్ అల్-ఖలేద్ నూతన రాయబారి జీవసాగర్ కు శుభాకాంక్షలు తెలియచేసి కొత్త విధిలో అదృష్టం వెన్నెంటే ఉండాలని అభిలషించారు. ,కువైట్ - భారతదేశం మధ్య స్నేహపూర్వక వాతావరణం మరింత అభివృద్ధి చెందాలని కోరుకున్నారు. ఉప విదేశాంగ మంత్రి ఖలీద్ అల్-జరల్లా, ప్రోటోకాల్స్ సహాయ మంత్రి ధరి అల్-అజ్రాన్, ఉప ప్రధాన మంత్రి మరియు విదేశాంగ మంత్రి కార్యదర్శి కార్యదర్శి శాలెహ్ అల్-లుఘాని మరియు విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి  మరియు విదేశాంగ మంత్రిత్వశాఖలోని అనేక ఇతర సీనియర్ అధికారులు నూతన భారత రాయబారికి ఆహ్వానం పలికినవారిలో ఉన్నారు. కె. జీవసాగర్  ఆంధ్రప్రదేశ్లోని మచిలిపట్నం ( బందరు) నోబుల్ కాలనీ వాస్తవ్యుడైన ఆయన నోబుల్ కళాశాల పూర్వ విద్యార్థి . కె . జీవసాగర్ 1991  బ్యాచ్ కి చెందిన ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్. కువైట్లో చేరేముందు, విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వశాఖ వెస్ట్ ఆసియా (ఇరాన్), యూరప్ (ఐర్లాండ్), దక్షిణ ఆఫ్రికా (జింబాబ్వే), లాటిన్ అమెరికా (మెక్సికో) మరియు తూర్పు ఆసియా (దక్షిణ కొరియా) సియోల్ లో ఇండియన్ మిషన్ యొక్క డిప్యూటీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన తరువాత, శ్రీ సాగర్ భారతదేశ హై కమిషనర్ గా ఘనా దేశానికి 17 జూన్ 2013 న బాధ్యతలు స్వీకరించాడు. టోగో, బుర్కినా ఫాసో మరియు సియెర్రా లియోన్లకు ఆయన సమర్ధుడైన అధికారిగా  ఏకకాలంలో గుర్తింపు పొందాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com