బరువుకు నీటి కళ్లెం

- January 15, 2018 , by Maagulf
బరువుకు నీటి కళ్లెం

దాహం వేసినపుడు కొందరు నీళ్లకు బదులు కూల్‌డ్రింకులు, పళ్ల రసాలు, కాఫీ, టీ వంటివి తాగేస్తుంటారు. వీటితో అప్పటికి దాహం తీరొచ్చేమో గానీ చాలా దుష్ప్రభావాలు పొంచి ఉంటాయి. చక్కెరను కలిపి తయారుచేస్తారు కాబట్టి ఇవి బరువు పెరగటానికివి దోహదం చేస్తాయి. అందుకే దాహం వేసినపుడు మామూలు నీళ్లు తాగటమే మంచిదన్నది నిపుణుల సూచన. ఇలినాయిస్‌ విశ్వవిద్యాలయ తాజా అధ్యయనం దీన్ని మరోసారి బలపరిచింది. గతంలో నిర్వహించిన ఒక సర్వేలో పాల్గొన్న కొందరి ఆహార అలవాట్లను పరిశోధకులు ఇటీవల విశ్లేషించారు. వీరంతా సగటున రోజుకు 4.2 కప్పుల నీళ్లు, 2,157 కేలరీలను తీసుకుంటున్నట్టు గుర్తించారు. అయితే నీళ్లు ఎక్కువగా తాగినవారు మాత్రం కేలరీలు, తీపి పానీయాలు, కొవ్వు పదార్థాలు, చక్కెర, ఉప్పు తక్కువగా తీసుకోవటం గమనార్హం. రోజుకు 1-3 కప్పులు ఎక్కువగా నీళ్లు తాగినా 68 నుంచి 205 వరకు కేలరీలు తగ్గుతున్నట్టు బయట పడింది. అందువల్ల బరువు తగ్గాలని అనుకునేవారు తగినన్ని నీళ్లు తాగాలని, వీలైతే కాస్త ఎక్కువగా తీసుకోవటమూ మంచిదని పరిశోధకులు చెబుతున్నారు. అందువల్ల ఈసారి దాహం వేసినపుడు కూల్‌డ్రింకుల వంటి వాటి జోలికి వెళ్లకుండా మామూలు నీళ్లే తాగండి. దీంతో దాహం తీరటంతో పాటు బరువూ అదుపులో ఉంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com