బుర్జ్ ఖలీఫాకి పోటీగా జెడ్డా టవర్

- January 17, 2018 , by Maagulf
బుర్జ్ ఖలీఫాకి పోటీగా జెడ్డా టవర్

రియాద్‌: ప్రపంచంలో అత్యంత ఎత్తైన భవనం బుర్జ్‌ ఖలీఫా. ఇది అందరికీ తెలిసిన విషయమే. దాన్ని తలదన్నే కట్టడం మరొకటి అతి త్వరలో రాబోతోంది. బుర్జ్‌ ఖలీఫా కంటే 590 అడుగులు ఎక్కువ పొడవు ఉండబోతుంది. అదే సౌదీ అరేబియాలోని ఏడారి ప్రాంతంలో నిర్మితమవుతున్న జెడ్డా టవర్‌.

2020లో జెడ్డా టవర్‌ను ప్రారంభించనుంది సౌదీ అరేబియా. దాదాపు 1.4 బిలియన్‌ డాలర్ల వ్యయంతో దీన్ని నిర్మించబోతున్నట్లు తెలిపారు. దీని ఎత్తు 3,280 అడుగులు‌(1000మీటర్లు). ఇప్పటికే 239 అడుగుల పాటు(72మీటర్లు) నిర్మాణాన్ని పూర్తి చేశారు. దుబాయ్‌లో ఉన్న బుర్జ్‌ ఖలీఫా ఎత్తు 2690 అడుగులు(828 మీటర్లు).

మొత్తం ఐదు కోట్ల డెబ్భై లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో జెడ్డా టవర్‌ను నిర్మిస్తున్నారు. కమర్షియల్‌ భవనాలు, హోటళ్లు, ఇళ్లు, ఆఫీస్‌లు, టూరిస్ట్‌లకు సంబంధించిన కాంప్లెక్స్‌లు జెడ్డా టవర్‌లో కొలువుదీరతాయి. సౌదీ అరేబియా ఆర్థిక నగరమైన జెడ్డాకు ఈ టవర్‌ మణిహారంగా మారుతుందని అంటున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com