దుబాయ్ లో తాగి తన్నుకున్న భారతీయ రూంమేట్స్ .బిల్డింగ్ కిటీకీ నుంచి కిందికి తోసి హత్య

- January 18, 2018 , by Maagulf
దుబాయ్ లో తాగి తన్నుకున్న భారతీయ రూంమేట్స్ .బిల్డింగ్ కిటీకీ నుంచి కిందికి తోసి  హత్య

దుబాయ్: పూటుగా తాగిన మద్యం ....విచక్షణ జ్ఞానంను నశింపచేసింది. ఒకే దేశానికి చెందినవారమని .ఒక గదిలో కల్సి ఉంటున్నామని ఆలోచనను ఆల్కహాల్ అణిచివేసింది. నరాలలోనికి పాకిన మత్తు ప్రతీకారం తీర్చుకోమని పురిగొల్పింది. ఫలితం తన రూమ్మేట్ అని కనికరం లేకుండా నిర్దాక్షిణ్యంగా కిటికీలోంచి కిందకు తోసి చంపేలా చేసింది. దుబాయ్ నగరంలో ఇటీవల వెలుగులోకి వచ్చిన ఈ ఘటకు సంబంధించిన పూర్తివివరాలు ఈ విధంగా ఉన్నాయి. పుట్టిన దేశం వదిలి గల్ఫ్ లో డబ్బులు సంపాదించుకొందామని  యూఏఈ వెళ్లిన ఆ ఇరువురు భారతీయులు ఒకే రూంలో సహచరులుగా ఉంటున్నారు. చేతినిండా డబ్బులు కనబడటంతో దురలవాట్లు తోడయ్యాయి. ఇద్దరూ ఓ రోజు మద్యం సేవించారు.  ఇద్దరిలో ఒకరైన ఒక వ్యక్తి తనకు గ్లాస్ మంచినీళ్లు ఇవ్వాలంటూ మరో వ్యక్తిని కోరాడు. రెండవ వ్యక్తి ఇవ్వనంటూ తిరస్కరించడంతో వారి మధ్య తగాదా మొదలయింది. ఒకరినొకరు బండ బూతులు తిట్టుకోవడంతో కోపంతో ఊగిపోయిన నిందిత వ్యక్తి మద్యం మత్తులో ఉన్న సహచర రూమ్మేట్ ని  బిల్డింగ్ కిటీకీ నుంచి కిందికి తోసేశాడు. తీవ్రంగా గాయపడి రక్తపుమడుగులో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న కనీసం రూంమేట్‌ను ఆసుపత్రికి తీసుకువెళ్లకపోగా హంతకుడు ఏమీ తెలియని వ్యక్తిలా హాయిగా నిద్రపోయాడు.. తర్వాత రోజు ఉదయం సమాచారం అందుకున్న పోలీసుల దర్యాప్తులో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. విచారణ అనంతరం నిందితుడికి 10 ఏళ్ల జైలుశిక్ష, అనంతరం దేశబహిష్కరణ విధించాలని కిందిస్థాయి న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేసిన నిందితుడు ఉన్నతస్థాయి కోర్టులోనూ  సవాల్ చేశాడు. విచారణ జరిపిన న్యాయస్థానం నిందితుడికి జైలు శిక్షను మరింతగా పెంచింది. 25 ఏళ్ల జైలుశిక్ష అనంతరం దేశం నుంచి బహిష్కరించాలని తీర్పునిచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com